మహేంద్ర సోలంకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేంద్ర సింగ్ సోలంకి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
నియోజకవర్గం దేవాస్
ముందు మనోహర్ ఉంట్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1984-04-11) 1984 ఏప్రిల్ 11 (వయసు 40)
ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామ్ సింగ్ సోలంకి, సర్జూ బాయి
జీవిత భాగస్వామి ప్రీతి మిశ్రా సోలంకి
సంతానం 2 కొడుకులు
నివాసం నార్ఖేడి, దేవాస్, మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా
మూలం [1]

మహేంద్ర సింగ్ సోలంకి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన దేవాస్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహేంద్ర సింగ్ సోలంకి 1984 ఏప్రిల్ 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రామ్ సింగ్ సోలంకీ, సీరియల్ బాయి సోలంకి దంపతులకు జన్మించాడు. ఆయన దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మహేంద్ర సోలంకి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దేవాస్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ టిపన్యాపై 372,249 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[2] పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడిగా, వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.


మహేంద్ర సోలంకి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దేవాస్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర మాలవ్యపై 425225 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 26 సెప్టెంబర్ 2024 నుండి పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Mahendra Solanki" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "देवास लोकसभा सीट से जीतने वाले BJP के महेंद्र सोलंकी कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)