Jump to content

మహేశ్వర్ మొహంతి

వికీపీడియా నుండి
మహేశ్వర్ మొహంతి
ఒడిశా శాసనసభ్యుడు
In office
1995–2019
అంతకు ముందు వారుఉమా బాల్రావ్ రత్
తరువాత వారుజయంత్ కుమార్ సారాంగి
నియోజకవర్గంపూరి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1956 ఫిబ్రవరి 26
పూరి, ఒడిశా, భారతదేశం
మరణం2023 నవంబర్ 7
భువనేశ్వర్, ఒడిస్సా, భారతదేశం
పౌరసత్వంభారతీయుడు
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీబిజు జనతాదళ్
ఇతర రాజకీయ
పదవులు
జనతాదళ్
జీవిత భాగస్వామిప్రియా మహంతి
సంతానం2
తల్లిదండ్రులునారాయణ మహంతి తండ్రి
వృత్తిన్యాయవాది రాజకీయ నాయకుడు

మహేశ్వర్ మొహంతి (26 ఫిబ్రవరి 1956 - 7 నవంబర్ 2023) ఒడిశాకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 2004 నుంచి 2008 వరకు ఒడిశా శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

మహేశ్వర్ మొహంతి 26 ఫిబ్రవరి 1956న పూరీలో నారాయణ్ మహంతి దంపతులకుజన్మించారు. మహేశ్వర్ మొహంతి బిష్ణుప్రియ మొహంతిని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. [1] మహేశ్వర్ మొహంతి ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి తన ఎల్.ఎల్.బి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసాడు. [2]

మహేశ్వర్ మొహంతి 1995 నుండి 2019 వరకు ఐదుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు [3] మహేశ్వర్ మొహంతి 2004 నుంచి 2009 వరకు ఒడిశా శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ, చట్టం, ప్రణాళిక సమన్వయం, పర్యాటకం సంస్కృతి, పంచాయతీరాజ్ వంటి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. [4]

మహేశ్వర్ మొహంతి 67 సంవత్సరాల వయస్సులో 7 నవంబర్ 2023న భువనేశ్వర్‌లో స్ట్రోక్‌తో మరణించారు [5] [3]

ఎమ్మెల్యేగా విజయాలు

[మార్చు]
టర్న్ ప్రారంభం టర్మ్ ముగింపు స్థానం నియోజకవర్గం పార్టీ
1995 2000 11వ ఒడిశా శాసనసభ సభ్యుడు పూరి జనతాదళ్
2000 2004 12వ ఒడిశా శాసనసభ సభ్యుడు బిజు జనతా దళ్
2004 2009 13వ ఒడిశా శాసనసభ సభ్యుడు
2009 2014 14వ ఒడిశా శాసనసభ సభ్యుడు
2014 2019 15వ ఒడిశా శాసనసభ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Shri Maheswar Mohanty". odishaassembly.nic.in. Odisha Assembly. Retrieved 7 November 2023.
  2. Dash, Mrunal Manmay. "Former Odisha Assembly Speaker, Minister Maheswar Mohanty no more". OdishaTV (in ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
  3. 3.0 3.1 "Former Odisha Speaker Maheswar Mohanty passes away". Prameya English (in Indian English). 7 November 2023. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  4. "Former Odisha Speaker Maheswar Mohanty No More". Odisha Bytes (in అమెరికన్ ఇంగ్లీష్). 7 November 2023. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  5. Mohapatra, Debabrata (7 November 2023). "Former Odisha speaker Maheswar Mohanty passes away". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.