మహేష్ కశ్యప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేష్ కశ్యప్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు దీపక్ బైజ్
నియోజకవర్గం బస్తర్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-10-01) 1975 అక్టోబరు 1 (వయసు 49)
కుంబ్రాబంద్ కల్చా, జగదల్‌పూర్ , బస్తర్ , ఛత్తీస్‌గఢ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సుక్రు రామ్ కశ్యప్, సుధ్రి
జీవిత భాగస్వామి చంపా కశ్యప్
వృత్తి రాజకీయ నాయకుడు

మహేష్ కశ్యప్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహేష్ కశ్యప్ 1996 నుండి 2001 వరకు బజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్‌గా, 2001 నుండి 2007 వరకు విశ్వహిందూ పరిషత్ జిల్లా ఆర్గనైజేషన్ మంత్రిగా, 2008 వరకు వి.హెచ్.పి శాఖ ఆర్గనైజేషన్ మంత్రిగా పని చేసి 2014లో కాల్చాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచి సర్పంచ్‌గా ఎన్నికై,[2] బస్తర్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా, ఛత్తీస్‌గఢ్ సర్పంచ్ మహాసంఘ్ కో-కన్వీనర్‌గా, భాత్ర సమాజ్ వికాస్ పరిషత్ డివిజన్ కార్యదర్శిగా పని చేశాడు.

మహేష్ కశ్యప్ 2021 నుండి షెడ్యూల్డ్ తెగ మోర్చా బీజేపీ బస్తర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాపై 55,245 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bastar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "बीजेपी के महेश कश्यप, पहली बार लड़े लोकसभा चुनाव, कांग्रेस के कवासी लखमा को चटाई धूल". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (4 June 2024). "Bastar (ST) election results 2024 live updates: BJP's Mahesh Kashyap wins against CONG's Kawasi Lakhma with a margin of 55245 votes". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.