మాండవీ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోవాలో మాండవీ నది

మాండవి లేదా మహాదాయి గోవాకర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహించే నది. గోవా జీవ నాడిగా దీన్ని అభివర్ణిస్తారు. 77 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నది 29 కిలోమీటర్లు కర్ణాటకలో, 52 కిలోమీటర్లు గోవాలో ప్రవహిస్తుంది.  కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో పశ్చిమ కనుమల్లోని భీమ్ గాడ్ వద్ద 30 నీటి చెలమల సమూహం నుంచి ఏర్పడింది. కర్ణాటకలో 2,032 చదరపు కిలోమీటర్లు, గోవాలో 1,580 చదరపు కిలోమీటర్ల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. మాండవీ నది నీలిరంగు నీటితో దూద్ సాగర్ జలపాతం, వరపోహా జలపాతం వంటి అనేక అందమైన జలపాతాలు ఏర్పడ్డాయి.

మాండవీ నది కర్ణాటకలో బెల్గాంఉత్తర కన్నడ జిల్లాల్లో ప్రవహించి గోవాలోకి ఉత్తరాన సత్తారి తాలూకాలో ఉత్తర కన్నడ జిల్లా నుంచి ప్రవేశించి కంబర్జువా, దివాడి, చోడ్నే ప్రాంతాల్లో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. జౌరీలోకి మాండవీ కబో అగౌడా అన్న ప్రాంతంలో కలిసి మర్మగోవా నౌకాశ్రయంగా రూపొందుతోంది. గోవా రాజధాని పనజీ, గోవా పూర్వ రాజధాని ఓల్డ్ గోవా, రెండూ మాండవీ పశ్చిమ రాష్ట్ర రాజధాని పనాజీ, గోవా పూర్వ రాజధాని ఓల్డ్ గోవా రెండూ మండోవి ఎడమ ఒడ్డున ఉన్నాయి. మాపుసా నది మాండోవికి ఉపనది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]