మాట్ హెండర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాట్ హెండర్సన్
దస్త్రం:Matt Henderson Cricketer 7 May 1927.png
మాథ్యూ హెండర్సన్ (1927)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ హెండర్సన్
పుట్టిన తేదీ(1895-08-02)1895 ఆగస్టు 2
ఆక్లాండ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1970 జూన్ 17(1970-06-17) (వయసు 74)
లోయర్ హట్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 6)1930 10 January - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1921/22–1931/32Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 41
చేసిన పరుగులు 8 495
బ్యాటింగు సగటు 8.00 14.14
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6 47
వేసిన బంతులు 90 6,649
వికెట్లు 2 107
బౌలింగు సగటు 32.00 29.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/38 6/70
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 12/–
మూలం: Cricinfo, 2023 30 April

మాథ్యూ హెండర్సన్ (1895, ఆగస్టు 2 - 1970, జూన్ 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వెల్లింగ్టన్ తరపున 1922 నుండి 1932 వరకు ఆడాడు. 1930 జనవరిలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.

క్రికెట్ కెరీర్[మార్చు]

హెండర్సన్ ఎడమచేతి ఫాస్ట్-మీడియం బౌలర్, టెయిల్-ఎండ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1921-22లో వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. తన రెండవ మ్యాచ్‌లో ఆక్లాండ్‌పై 66 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.[1] 1926-27 సీజన్‌లో రెండు మ్యాచ్‌లలో 17.75 సగటుతో 12 వికెట్లు తీసుకున్నాడు.[2] ఆక్లాండ్‌పై 70కి 6 వికెట్లు తీసుకున్నాడు.[3]

టామ్ లోరీ నేతృత్వంలోని 1927 జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. ఈ పర్యటనలో ఎలాంటి టెస్టులు ఆడలేదు. హెండర్సన్ 24.21 సగటుతో 33 ఫస్ట్-క్లాస్ వికెట్లు తీశాడు. ఇందులో సివిల్ సర్వీస్‌పై 27 పరుగులకు 5 వికెట్లు, [4] లీసెస్టర్‌షైర్‌పై 76 పరుగులకు 5 వికెట్లు తీశాడు.[5] విస్డెన్ ప్రకారం, కానీ ఇతని బౌలింగ్ కి దిశా నిర్దేశం లేదు.[6]

హెండర్సన్ తన 34వ ఏట 1930 జనవరిలో క్రైస్ట్‌చర్చ్‌లో హెరాల్డ్ గిల్లిగాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుతో న్యూజీలాండ్ ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. తన మొదటి డెలివరీ తోనే ఎడ్డీ డాసన్‌ను అవుట్ చేసాడు.[7] తర్వాత టాప్ స్కోరర్ అయిన కెఎస్ దులీప్‌సిన్హ్జీ వికెట్ తీసుకున్నాడు.[8]

హెండర్సన్ మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఆడలేదు. 1932లో వెల్లింగ్టన్ కోసం మరో మూడు ఆటల తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి తప్పుకున్నాడు. వెల్లింగ్టన్ క్లబ్ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌లో 21.90 సగటుతో 333 వికెట్లు తీశాడు.[9]

మరణం[మార్చు]

హెండర్సన్ తన 74 సంవత్సరాల వయస్సులో 1970, జూన్ 17న వెల్లింగ్టన్‌లోని లోయర్ హట్లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Auckland v Wellington 1921-22
  2. Matt Henderson bowling by season
  3. Auckland v Wellington 1926-27
  4. Civil Service v New Zealanders 1927
  5. Leicestershire v New Zealanders 1927
  6. Wisden, 1928, page 451.
  7. Wicket with first ball in Test cricket
  8. "New Zealand v England, Christchurch 1929-30". CricketArchive. Retrieved 1 March 2020.
  9. Wisden, 1971, p. 1025.

బాహ్య లింకులు[మార్చు]