Jump to content

మాదల వీరభద్రరావు

వికీపీడియా నుండి
మాదల వీరభద్రరావు
మాదల వీరభద్రరావు
జననం(1919-05-19)1919 మే 19
మరణం2001 ఆగస్టు 13(2001-08-13) (వయసు 82)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు
తల్లిదండ్రులురాజ్యలక్ష్మమ్మ, బుచ్చిరాజు

మాదల వీరభద్రరావు స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ పాత్రికేయుడు.క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో 19.5.1919 న రాజ్యలక్ష్మమ్మ బుచ్చిరాజు దంపతులకు జన్మించాడు.[1] 13.8.2001 న మరణించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు విద్యార్థిదశ నుండే జాతీయ భావాలను, సేవా భావాలను కలిగి పేద ప్రజలకు తన సహాయాన్ని అందించాడు. తన స్వగ్రామమైన మాదలలోని సాగరేశ్వర గ్రంథాలయాన్ని పునరుద్ధరించటం, రాత్రి పాఠశాలలు పెట్టి వయోజనులకు విద్య నేర్పటం, వేసంగి పా‌ఠశాలలను ఏర్పాటు చేయటం, రైతు సమావేశాలు ఏర్పాటు చేయటం, తద్వారా వారి కష్టాలను తెలుసుకోవటం, ప్రభుత్వ దృష్టికి తేవటం, తదనుగుణ చర్యలు తీసుకోవాలని విన్నపించటం మొదలైన కార్యక్రమాలు చేపట్టాడు[1]. ఇతడు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేయడంతో ఇతడు ఇతర పార్టీ సభ్యులతో అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు ఇతనిని అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలో ఇతడు సాయుధపోరాటం నిష్ప్రయోజనమైనదనే అభిప్రాయానికి వచ్చాడు. కారాగారం నుండి విడుదలైన తర్వాత 1953లో కమ్యూనిస్ట్ పార్టీ ఇతడిని బహిష్కరించింది. ఈ చర్యతో విసుగెత్తిన మాదల వీరభద్రరావు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని నిశ్చయించుకున్నాడు[2]. ఇతడు ఆంధ్రరత్న, ఆంధ్రజనత, ఆంధ్రప్రభ పత్రికలలో సంపాదకీయ వర్గంలో పనిచేశాడు. ఇతడు వ్రాసిన ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టులు అనే గ్రంథానికి తెలుగు భాషా సమితి (మద్రాసు) వారు ప్రథమ బహుమతి ఇచ్చారు[1].

రచనలు

[మార్చు]
  1. జాతీయ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రుల ఉజ్జ్వల పాత్ర
  2. అల్లూరి సీతారామరాజు
  3. దేశభక్త జీవిత చరిత్ర
  4. శ్రీ సర్వోత్తమ జీవితము
  5. మా తీర్థయాత్రలు
  6. గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు
  7. ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమం
  8. ఆంధ్రోద్యమ చరిత్ర
  9. స్వాతంత్ర్యోద్యమంలో రాయలసీమ పాత్ర
  10. స్వాతంత్ర్య సమరయోధుల ప్రజా సేవకుల సంస్మరణ
  11. క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవాలు
  12. ఆంధ్ర జలవిద్యుత్ ప్రాజెక్టులు[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 బాలేమర్తి లలిత (19 May 2017). "మార్గదర్శకుడు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 3 మార్చి 2020. Retrieved 3 March 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. శ్యామ్‌ యాదగిరి (1 October 2019). "Madala Veerabhadra Rao's long vigil for independence". The New Indian Express. Archived from the original on 3 మార్చి 2020. Retrieved 3 March 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. దరువూరి వీరయ్య (1964). గుంటూరు మండల సర్వస్వం. గుంటూరు: యువ కర్షక ప్రచురణలు. p. 475. Retrieved 3 March 2020.[permanent dead link]