Jump to content

మాదాటి నర్సింహారెడ్డి

వికీపీడియా నుండి
మాదాటి నర్సింహారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1994
ముందు చందుపట్ల జంగారెడ్డి
తరువాత సిరికొండ మధుసూధనాచారి
నియోజకవర్గం శాయంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1923
మొసలపల్లి, మొగుళ్ళపల్లి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2019 అక్టోబర్ 10
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

మాదాటి నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శాయంపేట శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1962లో మొట్లపల్లి గ్రామ సర్పంచ్‌గా, 1970 నుండి 75 వరకు పరకాల సమితి అధ్యక్షుడిగా, 1981లో సమితి సభ్యుడిగా ఎన్నికై జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా 1985 వరకు పని చేశాడు. ఆయన 1985, 89లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డిల మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

మాదాటి నర్సింహారెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2019 అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మరణించాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 December 2018). "'చల్ల'గా చరిత్ర తిరగరాశారు." Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  2. Sakshi (12 November 2018). "అంతుపట్టని పరకాల తీర్పు". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  3. Sakshi (10 October 2019). "అనారోగ్యంతో మాజీ మంత్రి మృతి". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  4. Suryaa (2019). "మాజీ మంత్రి నరసింహా రెడ్డి మృతి" (in ఇంగ్లీష్). Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)