చందుపట్ల జంగారెడ్డి
చందుపట్ల జంగారెడ్డి | |||
నియోజకవర్గము | వరంగల్
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసము | హనుమకొండ గ్రామం, హనుమకొండ మండలం, వరంగల్ : జిల్లా,, తెలంగాణ రాష్ట్రము. |
చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకులు.
జననం, బందుత్వం[మార్చు]
రెడ్డిగారు 18 నవంబర్ 1935 న జన్మించాడు, పరకాల గ్రామంలో, పరకాల మండల (ఇప్పుడు తెలంగాణలో) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నివాసం హన్మకొండలో ఉంటుంన్నారు.
శ్రీమతి. సుదేష్మాను 1953లో వివాహమాడారు.[1].
జీవిత విశేషాలు[మార్చు]
తెలంగాణ ప్రాంతానికి హనుమకొండ నుంచే 1984 వరంగల్ జిల్లాలో కాదు అప్పటి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి[2]. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు. ఆ భారతీయ జనతా పార్టీ జిల్లాలో మొదటి వ్యక్తి. జంగారెడ్డి గారు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ, 2 డి (టీచర్) బడిపంతులుగా పనిచేశారు.
శాసనసభ్యునిగా[మార్చు]
పరకాల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెండెంట్ బి. కైలాసం పై గెలిచి శాసనససభలో అడుగుపెట్టారు.
ఓటమి, విజయం[మార్చు]
ఇదే పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా మళ్ళి భారతీయ జనసంఘ పార్టీ నుండి 1972లో పోటీచేసి పింగళి ధర్మా రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తరువాత 1978లో మళ్ళీ పింగళి ధర్మా రెడ్డి పై శాసనసభ్యునిగా మళ్ళి భారతీయ జనసంఘ పార్టీ నుండి విజయం సాధించారు జంగారెడ్డి గారు.[3] దీనికి వేదిక మాత్రం శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం అయింది. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడం మూలానా ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు కావడం వలన పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు.
చరిత్ర పుటల్లో[మార్చు]
1984 లో భాజపా 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది ఒకటి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, [ఏకే పటేల్] అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి[4].
దక్షిణ భారతదేశం తొలి బీజేపీ ఎంపీ[మార్చు]
మాజీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌లో కీలక నేతగా దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు [పివి నర్సింహారావు]పై 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి దక్షిణ భారతదేశం తొలి బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడు హనుమకొండ నుంచే ఎంపికయ్యారు చందుపట్ల జంగారెడ్డి[5]. దక్షిణ భారతదేశం నుంచి ఆయనే తొలి బీజేపీ ఎంపీ కావడం ఓ రికార్డు. ఆ సమయంలో స్థానికుడు కావడం వలన అభిమానంతో జనం జంగారెడ్డిని ఆదరించారు. ఆ విజయం చరిత్ర పుటల్లో భద్రంగా ఉంది[6].
ఎంపీగా ఓటమి[మార్చు]
1989,1991,1996లో కాంగ్రెస్ పార్టీ నుండి కమాలుద్దీన్ అహ్మద్ చేతిలో జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందారు...[7]
మూలాలు[మార్చు]
- ↑ http://www.refocusindia.com/member-of-parliament-lok-sabha-profile-2343-Reddy,%20Shri%20ChandupatlaJanga#.VkGW2eyC8bU.twitter
- ↑ B.J.Ps rise in indian politics
- ↑ https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE_(1978)
- ↑ http://www.sakshi.com/news/telangana/pv-narasimha-rao-birth-143641
- ↑ http://www.sakshi.com/news/elections-2014/legends-defeat-in-past-elections-117762
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-10. Retrieved 2015-11-10.
- ↑ http://www.suryaa.com/news/andhra-pradesh/article.asp?contentId=177500[permanent dead link]
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- వరంగల్లు పట్టణ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు