మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. శ్రీనివాస్ రెడ్డి
మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి


శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
17 జూన్ 2015 నుండి 16 జూన్ 2021 వరకు

వ్యక్తిగత వివరాలు

జననం 20 జులై 1939
మమ్నూర్, వరంగల్లు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రామకృష్ణ రెడ్డి, అమృతమ్మ
జీవిత భాగస్వామి పుష్పలత
నివాసం హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూ

మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గవర్నర్ కోటాలో తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఈ పదవిలో 2015 జూన్ 17 నుండి 2021 జూన్ 16 వరకు పనిచేశాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, మమ్నూర్ గ్రామంలో 1939, జులై 20న రామకృష్ణ రెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ పూర్తి చేసి, పి.హెచ్.డి పట్టా అందుకున్నాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుండి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇంచార్జ్ గా పని చేశాడు. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సేవలకుగాను 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గవర్నర్ కోటాలో పార్టీ ఆయనను తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

మూలాలు

[మార్చు]
  1. Ap7AM (19 July 2015). "టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాది శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం". ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. HMTV (3 August 2020). "Warangal TRS leaders: ఓరుగల్లు గులాబీ నేతలు ఒక్క చాన్స్‌ అని ఎందుకంటున్నారు?". www.hmtvlive.com. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  3. Siasat (19 June 2015). "Prof Srinivas Reddy takes oath as MLC". The Siasat Daily - Archive. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  4. Namasthe Telangana (20 July 2021). "మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.