మాధవీ ముద్గల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవీ ముద్గల్
జననం (1951-10-04) 1951 అక్టోబరు 4 (వయసు 72)
వృత్తిఒడిస్సీ నాట్యకారిణి, ఉపాధ్యాయిని
Current groupగాంధర్వ మహావిద్యాలయ, న్యూఢిల్లీ
Dancesఒడిస్సీ నాట్యం, భరతనాట్యం, కథక్

మాధవీ ముద్గల్ భారతీయ క్లాసికల్ నృత్యకారిణి. ఆమె ఒడిస్సీ నాట్యంలో సుప్రసిద్దురాలు. ఆమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో "సంస్కృతి అవార్డు", పద్మశ్రీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు, ఫ్రాన్స్ ప్రభుత్వంచే గ్రాండే మెడైలే డి ల విల్లీ అవార్డు వంటివి లభించాయి. ఆమెకు 2004 లో నృత్య చూడామణి అవార్డు కూడా లభించింది.[1]

ప్రారంభ జీవితం, శిక్షణ[మార్చు]

ఆమె గాంధర్వ మహావిద్యాలయ స్థాపకుడైన వినయ్ చంద్ర ముద్గల్యకు జన్మించింది. న్యూఢిల్లీలో గల గాంధర్వ మహావిద్యాలయం హిందూస్థానీ సంగీతం, క్లాసికల్ సంగీతం లకు శిక్షణనిచ్చె ప్రముఖ సంగీత పాఠశాల. ఆమె సంగీతం, కళలపై ఆసక్తితో ప్రముఖ గురువు శ్రీ హరికృష్ణ బెహరా వద్ద శిక్షణ పొందారు. కళల పట్ల ఆమె విశేష నైపుణ్యాలను పొమారు. ఆమె తన 4 వ యేట మొదటి సారి బహిరంగ ప్రదర్శన నిచ్చారు.[2] ప్రారంభంలో ఆమె భరతనాట్యం, కథక్ లను నృచుకున్నది. కానీ చివరికి ఆమె ఒడిస్సీ నాట్యాన్ని ఎన్నుకొని ఆ నాట్యంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఒడిస్సీ నాత్యాన్ని ప్రముఖ నాట్యకారులు అయిన కెలూచరణ్ మోహపాత్రా వద్ధ శిక్షణ పొందారు.

ఆమె అగ్రికల్చర్ లో డిప్లొమా పొందారు, వివిధ మ్యాగజైన్లకు, పుస్తకాలకు తన రచనలనందిస్తున్నారు.[3]


వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె సోదరుడు మధుప్ ముద్గల్ కూడా పద్మశ్రీ పురస్కార విజేత. ఆయన ఖయాల్, భజన్ రంగంలో సుపరిచితుడు. ఆయన సంగీత స్వరకర్త, గాంధర్వ మహావిద్యాలయానికి ప్రిన్సిపాల్ గా కూడా ఉన్నారు. ఈ పాఠశాల 1995 నుండి సంగీతం, నాట్యం పై శిక్షణను అందిస్తున్నది.[4][5] ఆమె మేనకోడలు అరుషి న్యూఢిల్లీ లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ లో పూర్వ విద్యార్థి. ఆమె మాధవి ముద్గర్ వద్ద గాంధర్వ మహావిద్యాలయంలో శిక్షణ పొందారు 2003 లో సోలో ఒడిస్సీ నాట్యకారిణిగా కచేరీలనిస్తున్నారు.[6] 2008లో ఆమె అంతర్జాతీయ నాట్య వేడుకలలో పాల్గొన్న ఏకైక భారతీయ నాట్యకారిణి.[7] ఆమె రెండవ సోదరుడు ముకుల్ ముద్గల్ పంజాబ్, హర్యానా కోర్టుకు మాజి ప్రధాన న్యాయమూర్తి.

మూలాలు[మార్చు]

  1. Madhavi, Mudgal (2004-11-15). "surprised and glad' to be chosen for Nritya Choodamani 2004 -Madhavi" (Interview). Interviewed by www.narthaki.com.
  2. "Madhavi Mudgal". Per Diem Co. Archived from the original on 2015-02-02. Retrieved June 4, 2012.
  3. "International Dance Festival - VISTAAR". Retrieved June 4, 2012.
  4. "Madhup Mudgal and the world of khayal". Indian Express. January 8, 2006.[permanent dead link]
  5. "Interview : Madhup Mudgal: 'It's hard teaching beginners'". The Financial Express. Nov 12, 2006.
  6. "Baby, You're On Your Own Now". Indian Express. September 10, 2003.[permanent dead link]
  7. "Dance Works". Indian Express. Nov 3, 2008.

బయటి లింకులు[మార్చు]