మాధవ తీర్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవ తీర్థ
జననంవిష్ణుశాస్త్రి
ఉత్తర కర్ణాటక
నిర్యాణముమన్నూర్ వద్ద 1350 A.D గుల్బర్గా సమీపంలో
క్రమమువేదాంతం
గురువుమధ్వాచార్యులు
తత్వంద్వైతం
ప్రముఖ శిష్యు(లు)డుఅక్షోభ్య తీర్థ, మధుహరి తీర్థ

మాధవ తీర్థ ఒక హిందూ ద్వైత తత్వవేత్త, పండితుడు, మధ్వాచార్య పీఠానికి 3వ పీఠాధిపతి. అతను నరహరి తీర్థ తరువాత 1333 - 1350 వరకు మధ్వాచార్య పీఠానికి పీఠాధిపతిగా నియమితుడయ్యాడు.[1]

జీవితం[మార్చు]

మాధవ తీర్థ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో విష్ణుశాస్త్రి పేరుతో జన్మించాడు. తర్వాత మధ్వాచార్యులు దగ్గర వేద విద్యను అభ్యసించి, ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. తన జీవితాన్ని ద్వైత సిద్ధాంతానికి అంకితం చేసిన మాధవ తీర్థ మన్నూర్ వద్ద 1350 A.D గుల్బర్గా సమీపంలో పరమపదించారు.

రచనలు[మార్చు]

మాధవ తీర్థ పరాశర స్మృతిపై పరాశర మధ్వ-విజయ అనే వ్యాఖ్యానాన్ని వ్రాసాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలకు వ్యాఖ్యానాలు చేశాడు. ఆయన శిష్యుడు శ్రీ మధుహరి తీర్థ ముల్బాగల్ సమీపంలో మజ్జిగేనహళ్లి మఠం పేరుతో ఒక మఠాన్ని స్థాపించారు.[2]

మూలాలు[మార్చు]

  1. Sharma 2000, p. 228.
  2. Sharma 2000, p. 229.