మానుషి చిల్లర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానుషి చిల్లర్ ( జననం - మే 14, 1997 ) హర్యానాకు చెందిన 67వ ప్రపంచ సుందరి మిస్‌వరల్డ్-2017 కిరీటం అవార్డును గెలుచుకున్న యువతి. భారతదేశం తరపున ఈ కీరీటం గెలిచిన ఆరవ యువతి.[1].

Manushi Chillar
మానుషి చిల్లర్
2017 నవంబర్ లో జరిగిన సాన్య సిటి అరేనాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును బహూకరించారు[2].
జననం (1997-05-14) 1997 మే 14 (వయసు 27)
Rohtak,[3] హర్యానా రాష్ట్రం, India
ఎత్తు1.75 m (5 ft 9 in)

బాల్యం,కుటుంబం,విద్యాభ్యాసం,వృత్తి[మార్చు]

మానుషి తల్లిదండ్రులు మిత్రా మసు చిల్లర్, నిలీమా చిల్లర్ ఇద్దరూ డాక్టర్లే. హరియాణాలో పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది.

జీవిత విశెషాలు[మార్చు]

 • గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరమ్యారు.
 • మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
 • స్కెచింగ్, పేయింటింగ్ మానుషి ఇష్టమైన వ్యాపకాలు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
 • స్కూబాడైవింగ్, బంగీజంప్‌లంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
 • మిస్ వరల్డ్ కిరీటం గెలవడం ఆమె చిన్ననాటి కోరిక. చాలా ఇంటర్య్వూల్లో ఆమె ఈ విషయం చెప్పారు. స్కూల్, కాలేజీ స్థాయిల్లోనూ అనేక అందాల పోటీల్లో మానుషి విజేతగా నిలిచారు.
 • మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న 6వ భారతీయురాలు మానుషి.[4]

భారత ప్రపంచ సుందరీమణులు వీరే[మార్చు]

 • 1951 లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.
 • ఈ పోటీలు మొదలైన 15 ఏళ్ల తర్వాత భారతీయ యువతి తొలిసారి ఈ కిరీటాన్ని గెలుపొందారు.
 • ఇప్పటివరకు 6 గురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.
 • 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.
 • ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచారు.
 • 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు.
 • 17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్‌కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు[5].

పురస్కారాలు[మార్చు]

 • మిస్ యూనివర్స్(విశ్వ సుందరి) అవార్డు.

మూలాలు[మార్చు]

 1. https://www.youtube.com/watch?v=-0ZInPFf0bU
 2. https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/indias-manushi-chhillar-wins-miss-world-crown/articleshow/61709802.cms
 3. Singh, Swati (25 November 2017). "Haryana girl brings back the coveted 'blue crown' to India". The Sunday Guardian. Archived from the original on 8 డిసెంబరు 2017. Retrieved 8 December 2017.
 4. "All you need to know about Prithviraj actress Manushi Chhillar". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-15. Retrieved 2021-11-16.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. https://www.bbc.com/telugu/india-42037886

బయటి లింకులు[మార్చు]