మామిడికాయ ముక్కల పచ్చడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడికాయ ముక్కల పచ్చడి

మామిడికాయ ముక్కల పచ్చడి ఒక శాకాహార వంటకం.

మామిడికాయ ముక్కల పచ్చడి కావల్సినవి[మార్చు]

మామిడికాయలు

కావాల్సిన పదార్థాలు[మార్చు]

మామిడి కాయలు - నాలుగు, మెంతులు - పావు కప్పు, ఆవాలు - పావు కప్పు, ఇంగువ - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిరపకాయలు - 8, కారం - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు - మూడు టీ స్పూన్లు, నూనె - నాలుగు గరిటెలు, పసుపు - ఒక టీ స్పూను, మెంతి పొడి - పావు కప్పు.

తయారీ విధానం[మార్చు]

ముందుగా మామిడికాయలను బాగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన కాయలను చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలను వేసి సన్న మంటపై బాగా వేయించుకుని చల్లారబెట్టు కోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ తాలింపు (పోపు) ను కలిపి, నాలుగు స్పూన్లు ఉప్పు, కారం, మెంతి పొడి, మిగిలిన నూనె కూడా వేసి బాగా కలపాలి. అంతే ఘుమఘుమలాడే మామిడికాయ ముక్కల పచ్చడిరెడీ. ఇవి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది. [1] [2] చిన్నకాయాలు, కొద్దిగా చేసుకునేందుకు, కాయలు, ముక్కలను బట్టి పదార్థాలు కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]