Jump to content

మాయోన్

వికీపీడియా నుండి
మాయోన్‌
దర్శకత్వంఎన్‌. కిషోర్‌
స్క్రీన్ ప్లేఅరుణ్ మోజి మాణిక్కం
నిర్మాతఅరుణ్ మోజి మాణిక్కం, మామిడాల శ్రీనివాస్
తారాగణం
ఛాయాగ్రహణంరామ్ ప్రసాద్
కూర్పురామ్ పాండియన్
కొండలరావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
మూవీమ్యాక్స్
విడుదల తేదీ
7 జూలై 2022 (2022-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

మాయోన్‌ 2022లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ థ్రిల్లర్‌ సినిమా. తమిళంలో 'మాయోన్' పేరుతో విడుదలైన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో మూవీమ్యాక్స్ బ్యానర్‌పై మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణిక్కం విడుదల చేశారు. : శిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కె. ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్‌. కిషోర్‌ దర్శకత్వం వహించగా ట్రైలర్‌ను 2021 అక్టోబర్ 9న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2]

అర్జున్ (శిబి రాజ్) ఆర్కియాలజిస్ట్. తన సీనియర్ అధికారి దేవరాజ్ (హరీష్ పేరడీ)తో చేతులు కలిపి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలో విజయానందపురంలో అర్జున రాయలు కాలంలో పునర్నిర్మించబడిన శ్రీ కృష్ణుని ఆలయంలో నిధిని దొంగలించి విదేశాలకు అమ్మేయాలనుకుంటారు. ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ లో పనిచేసే సీనియర్ అధికారి వాసుదేవ్ (కె. ఎస్. రవికుమార్) అతని టీమ్ లో పనిచేస్తున్న అంజన (తాన్య రవిచంద్రన్) ఎపిగ్రాఫిస్ట్ గా మరో ఇద్దరు కలసి అదే ఆలయంలో నిధి కోసం వెతకడం మొదలు పెడతారు. మరి ఆ నిధి దొరికిందా? చివరకు, ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (9 October 2021). "'మాయోన్' టీజర్ వదిలిన రానా దగ్గుబాటి" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
  2. V6 Velugu (20 June 2022). "జూలై 7న "మాయోన్" గ్రాండ్ రిలీజ్". Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (7 July 2022). "రివ్యూ: మాయోన్‌". Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మాయోన్&oldid=3595927" నుండి వెలికితీశారు