Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

రాధా రవి

వికీపీడియా నుండి

మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ రవి (జననం 29 జూలై 1952) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. [1] ఆయన ఎం.ఆర్‌.రాధా కుమారుడు, వాసు విక్రమ్ కు మేనమామ, రాధికకు సవతి సోదరుడు. రవి తమిళనాడు ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ చీఫ్ మెంబర్. రవి సినీ ప్రముఖులపై వివాదాస్పద విమర్శలకు చేసి వార్తల్లోకెక్కాడు. [2]

రవి వైదేహి కాతిరుంతల్ (1984), ఉయర్ంద ఉల్లం (1985), గురు శిష్యన్ (1988), రాజాధి రాజా (1989), సోలైకుయిల్ (1989), చిన్న తంబి (1991), అన్నామలై (1992), ఉళైప్పాలి (1984), పూవేలి (1998), పడయప్ప (1999), ఒరు మురై సొల్లివీడు (2004), ఇరైవి (2016), సర్కార్ (2018) లో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన థాయ్ మాసం పూవాసం (1990), ఇదు నమ్మ భూమి (1992), చిన్న ముత్తు (1994) , ఇలైంజర్ అని (1994) సినిమాలను నిర్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాధా రవి 2000లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రచారకర్తగా, తర్వాత డీఎంకే నాయకత్వంతో అభిప్రాయ భేదం కారణంగా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏ.ఐ.ఏడీఎంకే)లో చేరాడు. [3] రవి 2002 తమిళనాడు అసెంబ్లీ ఉప  ఎన్నికల్లో సైదాపేట నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 2001 నుండి 2006 వరకు శాసనసభ సభ్యునిగా  పని చేశాడు. ఆయనకు 2006 ఎన్నికల సమయంలో టికెట్ దక్కలేదు. [4] [5]

అవార్డులు

[మార్చు]
  • తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి – సోలైకుయిల్ (1989)
  • తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (పురుషుడు) – ఒరు మురై సొల్లివిడు (2004)

కన్నడ

[మార్చు]
  • రహస్య రాత్రి (1979)
  • పర్వ (2002)
  • అలోన్ (2015)

మలయాళం

[మార్చు]
  • సాక్ష్యం (1988)
  • కులపతి (1993)
  • కస్టమ్స్ డైరీ (1993)
  • దాధా (1994)
  • సుందరిమరే సూక్షిక్కుక (1995)
  • వెట్టం (2004)

తెలుగు

[మార్చు]

ప్రధాన వ్యాసం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "AIADMK fields Radha Ravi in Saidapet". Indiatimes. 2 May 2002. Retrieved 8 August 2011.
  2. The Hindu (11 October 2012). "The man who brought dignity and grace to villainy" (in Indian English). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. "Party-Hopper Radha Ravi, Notorious for Misogyny, Joins BJP". The Quint (in ఇంగ్లీష్). 2019-11-30. Retrieved 2020-06-02.
  4. Ramakrishnan, T. (2019-06-12). "Radha Ravi rejoins AIADMK". The Hindu. ISSN 0971-751X.
  5. "Actor Radha Ravi back in AIADMK". The New Indian Express. Retrieved 2020-06-02.
"https://te.wikipedia.org/w/index.php?title=రాధా_రవి&oldid=4357216" నుండి వెలికితీశారు