మార్టిన్ బెర్బర్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్టిన్ బెర్బర్యాన్
వ్యక్తిగత సమాచారం
జననం (1980-05-22) 1980 మే 22 (వయసు 44)
యెరెవాన్, ఆర్మేనియా
ఎత్తు1.60 మీ. (5 అ. 3 అం.)
బరువు60 కి.గ్రా. (130 పౌ.)
క్రీడ
క్రీడకుస్తీ పోటి
పోటీ(లు)కుస్తీ పోటిదారుడు
క్లబ్బుయెరెవాన్ రెపబ్లికన్ పాఠశాల
కోచ్సాంవెల్ మర్గార్యెన్


మార్టిన్ బెర్బర్యాన్,  1980 మే 22న జన్మించిన ఒక ఆర్మేనియన్ ఫ్రీస్టైల్ కుస్తీ పోటీదారుడు. అతను ఆర్మేనియన్ ఛాంపియన్, యూరోపియన్ ఛాంపియన్, ప్రపంచ పతకదారుడు, మూడు-సార్లు ఒలింపిక్స్ లో గెలిచారు. 1998లో బెర్బర్యాన్ కు ఆర్మేనియాలో మాస్టర్ క్రీడాకారుడు, అంతర్జాతీయ స్థాయి శీర్షిక వచ్చింది.

జీవిత చరిత్ర

[మార్చు]

మార్టిన్ బెర్బర్యాన్ ఫ్రీస్టైల్ కుస్తీని 1987 లో  తన మొదటి గురువు సాంవెల్ మార్కారియన్ నేతృత్వంలో మొదలుపెట్టారు. తరువాత అంతను 1997లోని జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో వెండి పతకాన్ని, 1998లోని జూనియర్ యూరోపియన్ ఛాంపియన్ గా అవతరించారు. 1999 లో, బెర్బర్యాన్ ను ఆర్మేనియన్ జాతీయ ఫ్రీస్టైల్ కుస్తీలో పాల్గొను జట్టులో సభ్యునిగా చేర్చుకున్నారు. బెర్బర్యాన్ కు సిడ్నీలో జరిగిన 2000 వేసవి ఒలింపిక్స్ లో ఆరవ స్థానంలో దక్కింది, ఇది తన జీవితంలో ఉత్తమ ఒలింపిక్ ఫలితం. బెర్బర్యాన్ 2004లో జరిగిన యూరోపియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 2004 యూరోపియన్ ఛాంపియన్షిప్ అంకరాలో జరిగాయి కానీ పోటీలు ఏప్రిల్ లో జరిగే సమయంలో ఒట్టోమన్ రాజ్యం ప్రారభించిన ఆర్మేనియన్ జెనోసైడ్ మొదలయ్యింది. ఈ సమయంలో బెర్బర్యాన్ యూరోపియన్ ఛాంపియన్ అవ్వడంతో ఆర్మేనియన్ జాతీయ గీతాం మెర్ హేయ్రెనిక్ ను టర్కీ రాజధానిలో పాడారు. దీనితో మార్టిన్ బెర్బర్యాన్ విజయనికి అర్మేనియాలో విస్తృత ప్రచారం లజరిగింది. తర్వాత యెరెవాన్ తిరిగి వచ్చిన వెంటనే, అర్మేనియా నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు గాగిక్ త్సరుక్యాన్ బెర్బర్యాన్ కు ఒక కొత్త కారును బహుమతిగా ఇస్తూ కీస్ ని అందజేశారు.[1]

బెర్బర్యాన్ కు ఏథెన్స్ లో జరిగిన 2004 వేసవి ఒలింపిక్స్ లో పదకొండో స్థానంల వచ్చింది. ఒలింపిక్స్ తర్వాత, అతను 55 కిలోల నుండి 60 కిలోల విభాగానికి మారారు. అతను కొత్త బరువు తరగతి లోకి 2005 లో ప్రవేశించారు. బెర్బర్యాన్ 2005 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆ ఏడాది ఒక బంగారు పతకాన్ని గెలిచారు. తదుపరి రెండు సంవత్సరాలు తన కెరీర్ కు ఇటీవలి వివాహం వలన అంతరాయం ఏర్పడింది అలా అతను తన కుటుంబంతో అమెరికా సమ్యుక్త రాజ్యాలలో స్థిరపడ్డారు. బెర్బర్యాన్ తిరిగి కుస్తీ పోటీలను 2008 లో ప్రారంభించారు. 2008 వేసవి ఒలింపిక్స్ బీజింగ్ లో జరిగిన పోటీలలో అర్హత సాధించారు. అతను పదిహేడవ స్థానంలో వచ్చారు. ఆ తరువాత, మార్టిన్ బెర్బర్యాన్ తన కుస్తీ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. 2008వ సంవత్సరం నుండి అతను లాస్ ఏంజెలెస్ స్పోర్ట్స్ క్లబ్, అంతర్జాతీయ క్రీడలు యూనియన్ లో ప్రధాన రెజ్లింగ్ కోచ్.

సూచనలు

[మార్చు]
  1. Մարտին Բերբերյանը, ազատ ոճի ըմբշամարտի (in ఆర్మేనియన్). www.armgsm.am. Archived from the original on 20 జూలై 2011. Retrieved 26 జూన్ 2018.