Jump to content

మార్టిన్ లూథర్ కింగ్

వికీపీడియా నుండి
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968

పుట్టిన తేదీ: (1929-01-15)1929 జనవరి 15
జన్మస్థలం: అట్లాంటా, జార్జియా,
అ.సం.రా.
మరణించిన తేదీ: 1968 ఏప్రిల్ 4
నిర్యాణ స్థలం: మెంఫిస్, టెన్నిస్సీ,
అ.సం.రా.
ఉద్యమం: ఆఫ్రికన్-అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం , శాంతి ఉద్యమం
ప్రధాన సంస్థలు: సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ (SCLC)
ప్రముఖ పురస్కారాలు: నోబెల్ శాంతి బహుమతి (1964)
ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ (1977, మరణాంతరం)
కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ (2004, మరణాంతరం)
స్మారకస్థలాలు: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాతీయ స్మారకం (ప్రణాళికలో వున్నది)
మతం: బాప్టిస్ట్

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (Martin Luther King, Jr. ) (జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968) అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించడం,, ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉంది.

ఇతను బాప్టిస్ట్ మినిస్టర్ కూడానూ.[1] ఇతను పౌరహక్కుల రక్షణా ఉద్యమం ద్వారా తన ప్రస్థానం మొదలెట్టాడు. ఇతడు 1955 మాంట్‌గొమరీ బస్సు నిరసనకు ప్రాతినిధ్యం వహించాడు,, సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు, ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నెదర్లాండ్స్, 1964లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

1963 లో వాషింగ్టన్ పై ప్రదర్శన సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన “నాకూ ఒక కల వున్నది” అనే ప్రసంగం సాగించాడు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘిక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.

1964 లో, అతి చిన్న వయస్సులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. ఇతని ఈ పురస్కారం తన రేషియల్ సెగ్రిగేషన్, జాతివాదం జాతి వివక్ష లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన పౌర నిరాకరణ, అహింస వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడ్డాడు,, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించాడు.

1968 ఏప్రిల్ 4 న మెంఫిస్ లో హత్య గావింపబడ్డాడు. ఇతని మరణాంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ 1977లోనూ,, కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ 2004లోనూ ప్రసాదింపబడింది. మార్టిన్ లూథర్ దివసంgovernment of AMERICA అమెరికా ప్రభుత్వంచే జాతీయ సెలవు దినంగా 1986 లో ప్రకటింపబడింది.

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
  1. Lischer, Richard. (2001). The Preacher King, p. 3.

మూలాలు

[మార్చు]
  • Abernathy, Ralph (1989). And the Walls Came Tumbling Down: An Autobiography. Harper & Row. ISBN 0060161922.
  • Ayton, Mel (2005). A Racial Crime: James Earl Ray And The Murder Of Martin Luther King Jr. Archebooks Publishing. ISBN 1595070753.
  • {{citebook|authorlink=David T. Beito|last=Beito|first=David|coauthors=Beito, Linda Royster|chapter=T.R.M. Howard: Pragmatism over Strict Integrationist Ideology in the Mississippi Delta, 1942–1954|editor=Feldman, Glenn (ed.)|title=Before Brown: Civil Rights and White Backlash in the Modern South|publisher=University of Alabama Press|year=2004|pages=p. 68–95|isbn=08 దలైలమ

గ్రంధాలు

[మార్చు]

Works by King

  • Stride toward freedom; the Montgomery story (1958)
  • The Measure of a Man (1959)
  • Strength to Love (1963)
  • Why We Can't Wait (1964)
  • Where do we go from here: Chaos or community? (1967)
  • The Trumpet of Conscience (1968)
  • A Testament of Hope : The Essential Writings and Speeches of Martin Luther King, Jr. (1986)
  • The Autobiography of Martin Luther King, Jr. by Martin Luther King Jr. (1998) edited by Clayborne Carson

Other works

  • Bearing the Cross: Martin Luther King, Jr., and the Southern Christian Leadership Conference by David Garrow (1989)
  • King Remembered by Flip Schulke and Penelope McPhee Foreword by Jesse Jackson (1986)
  • Judgment Days: Lyndon Baines Johnson, Martin Luther King Jr., and the Laws that Changed America by Nick Kotz (2005)

బయటి లింకులు

[మార్చు]
Martin Luther King, Jr. గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి