మిట్టే జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిట్టే జలపాతం[మార్చు]

మిట్టే జలపాతం తెలంగాణ రాష్ట్రం,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా,లింగాపూర్ మండంలోని పిట్టగూడ [1]శివారులో ఉంది.దినిని సప్తగుండాల జలపాతం అని అంటారు.[2]మిట్టే అంటే గోండి భాషాలో పాదము అని అర్థం.ఇచ్చట ఆదివాసులు భీముని పాదాన్ని పూజిస్తారు.

మిట్టే జ‌ల‌పాతం
ప్రదేశంపిట్టగూడ, లింగాపూర్ మండలం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ
రకంజలపాతం
మొత్తం ఎత్తు100 మీటర్లు

ఉనికి[మార్చు]

ఈ జలపాతం కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి ఉత్తరాన దట్టమైన అటవీ ప్రాంతంలో పిట్టగూడ గ్రామం నుండి సుమారు రెండు నుండి మూడు కి.మీ దూరంలోఉంది.ఇది కవ్వాల వన్యప్రాణుల అభయారణ్యం శివారులో వస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 354 కి.మీ దూరం,జిల్లా కేంద్రం నుండి వంద కి.మీ దూరంలో ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్ పోయో మార్గం లేదులో జైనుర్ మండల కేంద్రం నుండి ఇరువై కి.మీ దూరంలో ఉంటుంది[3].

విశేషాలు[మార్చు]

ఈ మిట్టే జలపాతంను సప్తగుండాల జలపాతం అని కూడా పేరుంది. వర్షాకాలంలో ఏడు వాగులు ఒకే చోట కలిసి నీటి ప్రవాహం ఉదృక్తి వల్ల నీరు  గుండ్రంగా తిరుగుతు సుమారు వంద మీటర్ల ఎత్తు నుండి క్రిందికి పడుతుంది.  ఏడు సుడిగుండాలు ఒకే చోట కలవడం వల్ల దీనిని సప్తగుండాలు అంటారు.ఈ సప్త గుండాల జలపాతాన్ని జాడ్బ,హిర్బ, బాజీ,బానా,మోకాశి,కొస్బ,భీమా ఇలా ఏడు దేవుళ్ళ పేర్లు పెట్టారని ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ పెద్దలు చెపుతుంటారు.ఈ ఏడు దేవుళ్ళు భూరా భగత్,కోత్మా బాయి కొడుకులు అని భీమా ఇతిహాసం అనే పుస్తకంలో ఏడు అన్నదమ్ములు వాళ్ళ ఐదుగురు చెల్లెలు ఉన్నాయని చరిత్రవలన తెలుస్తుంది.

మిట్టే జలపాతం నుండి జంగుబాయి దేవస్థానం వరకు సొరంగం ఉండేదని ఈ సొరంగం నుండే భీమాల్ దేవుని రాకపోకలు ఉండేదని అందుకే అచ్చట ఉండే భీమాల్ దేవుడు పాదాలకు,భీమాల్ పేన్ విగ్రహాన్ని ఆదివాసులు తమ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం భీముని ఉత్సవాలు ప్రతి గూడల్లో జరుపు కుంటారు ఈ జలపాతం వర్షాకాలంలో అనగా జూలై, ఆగష్టు నెలలో కురిసే వర్షాలకు ఉప్పొంగుతు స్థానికులకు పర్యాటకులను ఆకర్షిస్తుంది.సహజ సిధ్ధంగా ఏర్పడిన ఈ జలపాతం అద్భుతమైన అందాలతో చూపరులను ఆకట్టుకుంటుంది.జలపాతం చుట్టు అందమైన రాతి పలకలు మధ్యలో అందమైన అకుపచ్చని చెట్లు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది.ఈ మిట్టే జలపాతాన్ని కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యుత్తమ పర్యాటక ప్రదేశంలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Srinivas, Pillalamarri (2019-08-18). "Chasing the Mitte waterfall". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-12.
  2. Today, Telangana (2021-10-27). "Magnificent Mitte attracts tourists, nature lovers like never before". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-03-12.
  3. "వావ్‌.. జలజల జలపాతాలు". Sakshi. 2021-07-12. Retrieved 2024-03-12.