Jump to content

మిమీ (2021 హిందీ సినిమా)

వికీపీడియా నుండి
మిమీ
దర్శకత్వంలక్ష్మణ్‌ ఉటేకర్‌
రచనకథ, స్క్రీన్ ప్లే:
లక్ష్మణ్‌ ఉటేకర్‌
రోహన్ శంకర్
డైలాగ్స్:
రోహన్ శంకర్
నిర్మాతదినేష్ విజన్
జియో స్టూడియోస్
తారాగణంకృతి సనన్ , పంకజ్‌ త్రిపాఠి
ఛాయాగ్రహణంఆకాష్ అగర్వాల్
కూర్పుమనీష్ ప్రధాన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
మ్యాడ్‌డాక్ ఫిలింస్
జియో స్టూడియోస్
పంపిణీదార్లుజియో సినిమా
నెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
26 జులై 2021 [1]
దేశం భారతదేశం
భాషహిందీ

మిమీ 2021లో విడుదలైన హిందీ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించాడు. కృతి సనన్ , పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 30 జులై 2021న విడుదల కానుంది.[2] ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావించింది, కానీ వెబ్‌సైట్స్‌లో పైర‌సీ రిలీజ్ కావడంతో జూలై 26న సినిమాను విడుదల చేశారు.[3]

69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ సినిమా ఉత్తమ నటి (సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) విభాగాల్లో 2 అవార్డులను గెలుచుకుంది.[4] 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, మిమీ ఉత్తమ సంగీత దర్శకుడు (రెహమాన్), ఉత్తమ నేపథ్య గాయని (" పరమ సుందరి "కి శ్రేయా ఘోషల్ ) సహా 6 నామినేషన్లు అందుకుంది, 3 అవార్డులను ఉత్తమ నటి (సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి), ఉత్తమ సహాయ నటి (తమ్హంకర్) గెలుచుకుంది.[5]

అవివాహిత అయిన మిమి కృతి సనన్ ను ఆమె మిత్రుడు పంకజ్‌ త్రిపాఠి సరొగసిలో మంచి డబ్బు ఉందని ఒప్పిస్తాడు. విదేశీ జంట నుంచి 20 లక్షల రూపాయలకు డీల్‌ కుదురుతుంది. ఆ గర్భం దాల్చి బిడ్డను ఇవ్వడంలో భాగంగా ఆమె ఊరు విడిచి ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్లి మిత్రుడిని భర్తగా చెప్పి నివాసం ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయాన డబ్బు ఇచ్చిన విదేశీ జంట తమకు ఆ బిడ్డ వద్దని చెబుతారు.. ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి ? గర్భాన్ని మోస్తున్న హీరోయిన్‌ను ఆమె తల్లిదండ్రులు నిలదీస్తారు ? కడుపులో ఉన్న ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి?? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మ్యాడ్‌డాక్ ఫిలింస్, జియో స్టూడియోస్
  • నిర్మాత: దినేష్ విజన్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉటేకర్‌
  • సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
  • సినిమాటోగ్రఫీ: ఆకాష్ అగర్వాల్
  • ఎడిటర్: మనీష్ ప్రధాన్

మూలాలు

[మార్చు]
  1. India Today, Rishita Roy Chowdhury (10 July 2021). "Kriti Sanon's Mimi to release on July 30. Film to premiere on Netflix, Jio Cinema" (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  2. Namasthe Telangana (13 July 2021). "అద్దెగర్భం కష్టాలు". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  3. Andrajyothy (27 July 2021). "ఆన్‌లైన్‌లో సినిమా లీక్‌". chitrajyothy. Archived from the original on 27 జూలై 2021. Retrieved 27 July 2021.
  4. "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun win big". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-24. Archived from the original on 25 August 2023. Retrieved 2023-08-24.
  5. "Filmfare Awards 2022 Winner List". filmfare.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2023. Retrieved 2023-08-24.