మీనా ఖాదికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనా ఖాదికర్
మీనా ఖాదికర్
జననం
మీనా మంగేష్కర్

(1931-09-07) 1931 సెప్టెంబరు 7 (వయసు 92)[1]
వృత్తినేపథ్య గాయని, గాయకురాలు
పిల్లలుయోగేష్
రచన
తల్లిదండ్రులుపండిట్ దీనానాథ్ మంగేష్కర్
శేవంతి మంగేష్కర్
బంధువులులతా మంగేష్కర్ (సోదరి)
ఆశా భోంస్లే (సోదరి)
ఉషా మంగేష్కర్ (సోదరి)
హృదయనాథ్ మంగేష్కర్ (సోదరుడు)

మీనా ఖాదికర్ (జననం 1931 సెప్టెంబరు 7) భారతీయ మరాఠీ, హిందీ భాషల నేపథ్య గాయని, స్వరకర్త.[2] ఆమె పండిట్ దీనానాథ్ మంగేష్కర్ పండిట్ రెండవ కుమార్తె. కాగా గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్ ల సోదరి.[3]

కెరీర్ (1952-2000)[మార్చు]

మదర్ ఇండియా హిందీ సినిమాలో దునియా మే హమ్ ఆయే హై తో.. పాటను లతా, ఉషలతో కలిసి ఆమె ఆలపించింది. పిల్పిలి సాహెబ్‌లోని ఫాగున్ అయా, ఫర్మైష్ చిత్రంలో ముహమ్మద్ రఫీతో డ్యూయెట్ ఆప్నే ఛీన్ లియా దిల్, హై మౌసం యే మస్తానా, ముస్కురానా, అబ్రూ నుండి దిల్ చురానా, పట్రాని నుండి అరే కోయి జావో రి పియా కో బులావ్. వంటి పాటలు ఎన్నో పాడింది.

అయితే ఆమె మరాఠీ పరిశ్రమకు సంగీతం అందించినందుకు ప్రసిద్ధి చెందింది, ఇందులో ప్రసిద్ధ పిల్లల పాట, ఆల్బమ్ అసవా సుందర్ చాకొలేచా బంగ్లా. ఇది బెంగాలీ, గుజరాతీలలో కూడా రికార్డ్ చేయబడింది.

మీనా ఖాదికర్ పిల్లలు యోగేష్, రచన ఒరిజినల్ పాట పాడారు. ఆమె పాట సాంగ్ సాంగ్ భోలానాథ్ కూడా ప్రసిద్ధి చెందింది.

డిస్కోగ్రఫీ[మార్చు]

మరాఠీ పాటలు[మార్చు]

"యే జావళి ఘే ప్రియసఖాయ భగవంత" – మంసాలా పంఖ్ అస్తత్ కంపోజర్ మీనా మంగేష్కర్ సింగర్ లతా మంగేష్కర్

"బావర్లే మీ బవర్లే"- ఏక్ హోతా రాజా బెస్ట్ ఆఫ్ ది సాంగ్

హిందీ పాటలు[మార్చు]

"ఫాగున్ ఆయ" - పిల్పిలి సాహెబ్

"హై మౌసం యే మస్తానా ముస్కురానా దిల్ చురానా" - ఆబ్రూ

రచనలు[మార్చు]

మీనా ఖాదికర్ 2018లో లతా మంగేష్కర్ జీవిత చరిత్రను మోతీ తిచీ సవలి పేరుతో రాసింది. ఆ తర్వాతి సంవత్సరంలో, లతా మంగేష్కర్ జీవిత ప్రయాణంపై దీదీ ఔర్ మైన్ అనే పుస్తకాన్ని ప్రచురించింది.

గుర్తింపు[మార్చు]

మీనా ఖాదికర్‌ను 2021 మార్చి 26న రేడియో మిర్చి జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. Meena Khadikar - The Least Known Mangeshkar Sister Whose Birthday Is Just Before Asha Bhosle's (7th September)
  2. "When the Mangeshkars came together for a book launch". Times of India. September 21, 2018.
  3. Gulzar, Govind Nihalani, Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 486. ISBN 8179910660.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)