ఉషా మంగేష్కర్
Appearance
ఉషా మంగేష్కర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఇండోర్, ఇండోర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1935 డిసెంబరు 15
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతం, ప్లేబ్యాక్ సింగర్ |
క్రియాశీల కాలం | 1954 – ప్రస్తుతం |
బంధువులు | పండిట్ దీనానాథ్ మంగేష్కర్ (తండ్రి) శేవంతి మంగేష్కర్ (తల్లి) లతా మంగేష్కర్ (సోదరి) ఆశా భోంస్లే (సోదరి) మీనా ఖాదికర్ (సోదరి) హృదయనాథ్ మంగేష్కర్ (సోదరుడు) |
ఉషా మంగేష్కర్ (జననం 1935 డిసెంబరు 15) భారతీయ గాయని. ఆమే మరాఠీ, మణిపురి, హిందీ, బెంగాలీ, కన్నడ, నేపాలీ, భోజ్‌పురి, గుజరాతీ, ఒడియా, అస్సామీ లాంటి అనేక భాషా చిత్రాలలోని పాటలను ఆమె రికార్డ్ చేసింది.
బాల్యం
[మార్చు]ఉషా మంగేష్కర్ పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శేవంతి దంపతుల నాలుగవ సంతానం. లతా మంగేష్కర్, ఆశా భోస్లే, మీనా ఖాదికర్ లు ఆమెకు అక్కయ్యలు కాగా సంగీత దర్శకుడు హృదయనాథ్ మంగేష్కర్ తమ్ముడు.[1] ఆమెకు పెయింటింగ్‌పై ఆసక్తి ఎక్కువ.
కెరీర్
[మార్చు]1975 జై సంతోషి మా హిందీ సినిమా కోసం భక్తి పాటలు పాడిన తర్వాత ఆమె ప్లే బ్యాక్ సింగర్‌గా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ కాగా ఇందులోని మెయిన్ తో ఆర్తి ఉతారో రే సంతోషి మాతా కీ.. పాటకు ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డుకు ఎంపికైంది.
అవార్డులు
[మార్చు]- జై సంతోషి మా (1975) చిత్రంలోని పాటలకుగాను ఉత్తమ నేపథ్య గాయనిగా BFJA అవార్డు[2]
- జై సంతోషి మా (1975)లోని మెయిన్ తో ఆర్తి.. పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- ఇంకార్ (1977)లోని మంగ్తా హై తో ఆజా.. పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు[3]
- ఇక్రార్ (1980)లోని హమ్సే నజర్ తో మిలావో.. పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
- మిర్చి అవార్డ్స్ 2020లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "special story to latha Mangeshkar - Sakshi". web.archive.org. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "69th & 70th Annual Hero Honda BFJA Awards 2007". Bengal Film Journalists' Association. Archived from the original on 8 January 2010.
- ↑ "1st Filmfare Awards 1953" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2023-03-27.