మీర్ జులిఫికర్ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్ జులిఫికర్ అలీ

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు ముంతాజ్ అహ్మద్ ఖాన్
నియోజకవర్గం చార్మినార్

హైదరాబాద్ మేయర్
పదవీ కాలం
1991 నుండి 1995
1999 నుండి 2002
ముందు అల్లంపల్లి పోచయ్య

వ్యక్తిగత వివరాలు

జననం 1963
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఎంఐఎం
తల్లిదండ్రులు మీర్ వాజిద్ అలీ
నివాసం ఇంటి నం: 21-4-857/2/A, గులాబ్ సింగ్ బౌలి, కోకా కి తట్టి, బహదూర్‌పూరా, హైదరాబాద్-500064

మీర్ జులిఫికర్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో చార్మినార్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మీర్ జులిఫికర్ అలీ ఎంఐఎం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1986లో చార్ మహల్ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆయన ఆ తరువాత హుస్సేనీ అల్లం నుండి రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచాడు. మీర్ జులిఫికర్ అలీ 1991 నుండి 1995 & 1999 నుండి 2002 వరకు రెండు పర్యాయాలు హైదరాబాద్ మేయర్‌గా పని చేశాడు.[2] మీర్ జులిఫికర్ అలీ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చార్మినార్ నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మేఘరాణి పై 22858 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Vaartha (3 December 2023). "బోణి కొట్టిన MIM". Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
  2. Eenadu (4 November 2023). "మజ్లిస్‌ అభ్యర్థులు వీరే". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Eenadu (21 December 2023). "కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేలయ్యారు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.