Jump to content

ముంతాజ్ అహ్మద్ ఖాన్

వికీపీడియా నుండి
ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌
ముంతాజ్ అహ్మద్ ఖాన్


తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
డిసెంబరు 2018 - ప్రస్తుతం
ముందు సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి
నియోజకవర్గం చార్మినార్ శాసనసభ నియోజకవర్గం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - 2018
ముందు పదవి ప్రారంభం
తరువాత సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి
నియోజకవర్గం యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1994 - 2014
ముందు ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ
తరువాత "నియోజకవర్గం రద్దు"
నియోజకవర్గం యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1948-07-01) 1948 జూలై 1 (వయసు 76)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
ఇతర రాజకీయ పార్టీలు మజ్లిస్ బచావో తెహ్రీక్
తల్లిదండ్రులు గులాం గౌస్ ఖాన్ - మహమూదా బేగం
జీవిత భాగస్వామి మహ్మాది సుల్తానా ఖాన్
సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు, తెలంగాణ
అక్టోబరు 28, 2021నాటికి

ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున చార్మినార్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] తెలంగాణ శాసనసభలో పన్నెల్ స్పీకర్ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నాడు.[2][3]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 1948, జూలై 1న గులాం గౌస్ ఖాన్ - మహమూదా బేగం దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. బి.ఎస్సీ. చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ కు మహమ్మదీ సుల్తానా ఖాన్ తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

ముంతాజ్ ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున 1994 నుండి 2018 వరకు ఐదుసార్లు యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలుపొందాడు.[4][5] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా యకాత్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రూప్ రాజ్ పై 34,423 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉమ మహేంద్ర పై 32,587 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] 2021, అక్టోబర్‌ 5న తెలంగాణ అసెంబ్లీలో ప్యానెల్‌ స్పీకర్‌గా పని చేశాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Mahesh, Koride (8 April 2009). "Baldia beginning to these MLA, MP netas". The Times of India. Archived from the original on 10 May 2011.
  3. "Mumtaz Ahmed Khan takes oath as Telangana pro-tem speaker | INDToday" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-16. Retrieved 2021-10-28.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. "Archived copy". Archived from the original on 23 February 2017. Retrieved 17 February 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "TS Election Results: Mumtaz Ahmed Khan wins from Charminar constituency". The Siasat Daily – Archive (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-01-25. Retrieved 2019-06-26.
  8. Namasthe Telangana (6 October 2021). "ప్యానల్‌ స్పీకర్లుగా ఇద్దరు". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.