ముదిగొండ విశ్వనాధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముదిగొండ విశ్వనాధం

ముదిగొండ విశ్వనాధం (జనవరి 23, 1906- ఏప్రిల్ 25, 1984) ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు.

వీరు 1906 జనవరి 23 తేదీన ఈమని గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: ముదిగొండ కొండయ్య, లింగమ్మ గార్లు. వీరు అలహాబాదు విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేస్తుండగా వారి చూపు మందగించడం వలన స్వాతంత్ర్య సమరం వలన పూర్తిచేయలేకపోయారు.

వీరు 1950వ దశాబ్దంలో పురాణ మీమాంస అను భారతీయ తత్త్వశాస్త్రం గురించి ఒక పుస్తకాన్న్ని రచించి ప్రచురించారు. దానిని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పంపియున్నారు.ఉపరాష్ట్రపతి ఆ పొత్తమును ప్రశసించుతూ స్వయముగా లేఖ వ్రాసియున్నారు.

వీరు ఉపాధ్యాయునిగా ఆంగ్లం, గణితం, హిందీ, సంస్కృతం భాషాల్లో పట్టభద్రులకు బోధించేవారు.

మూలాలు

[మార్చు]