ముద్దు రామకృష్ణయ్య
Jump to navigation
Jump to search
ముద్దు రామకృష్ణయ్య | |
---|---|
జననం | ముద్దు రామకృష్ణయ్య అక్టోబర్ 18, 1907 మంథని |
మరణం | అక్టోబర్ 21, 1985 కరీంనగర్ జిల్లా, మంథని |
ప్రసిద్ధి | విద్యావేత్త |
మతం | హిందూ మతము |
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త. 1907లో మంథనిలో జన్మించాడు[1]. ఆయన తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి., ) పొందాడు. 1950వ దశకంలో అనేక దేశాలు తిరిగాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలు అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నేటికీ ఇతని విధానాలు కొన్ని అమలులో ఉన్నాయి. నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు 'ఈచ్ వన్ టీచ్ వన్' ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించిన గొప్ప విద్యావేత్త. తాను విదేశాలలో చదువుకొవడానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాలతో నా ప్రథమ విదేశీ యాత్ర అను పుస్తకాన్ని వెలువరించాడు.
మరణం
[మార్చు]ముద్దు రామకృష్ణయ్య 1985 అక్టోబరు 21వ తేదిన మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నవ వసంతం-3, 8 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-11