ముల్క్ రాజ్ ఆనంద్
ముల్క్ రాజ్ ఆనంద్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | పెషావర్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) | 1905 డిసెంబరు 12
మరణం | 2004 సెప్టెంబరు 28 పుణె, మహారాష్ట్ర | (వయసు 98)
వృత్తి | రచయిత |
పూర్వవిద్యార్థి | కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లండన్ యూనివర్సిటీ కాలేజ్ ఖల్సా కాలేజ్, అమృత్‌సర్ |
కాలం | 20 వ శతాబ్దం |
గుర్తింపునిచ్చిన రచన | కూలీ (నవల); అన్‌టచబుల్ |
పురస్కారాలు | సాహిత్య అకాడెమీ అవార్డు (1971) పద్మభూషణ్ (1967) అంతర్జాతీయ శాంతి బహుమతి (1953) |
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములు | షిరీన్ వజీఫ్ దార్ |
సంతకం |
ముల్క్ రాజ్ ఆనంద్ (1905 డిసెంబర్ 12 - 2004 సెప్టెంబర్ 28) భారతీయ ఆంగ్ల రచయిత. ఈయన రచనల్లో ఎక్కువగా సాంప్రదాయ భారతీయ సమాజంలోని పేద ప్రజల జీవిత ఇతివృత్తాలు చిత్రీకరించాడు.[1][2][3] ఇండో-ఆంగ్లియన్ ఫిక్షన్ లో ఈయన మార్గదర్శకుడు. ఆర్. కె. నారాయణ్, అహ్మద్ అలీ, రాజా రావు లాంటి వారి సరసన భారతదేశం కేంద్రంగా ఆంగ్ల సాహిత్యాన్ని ప్రచురించి, అంతర్జాతీయ పాఠకులకు చేరువైన మొదటితరం రచయితల్లో ఈయనా ఒకడు. ఈయన రాసిన నవలలు కథలు, భారతీయ ఆంగ్ల సాహిత్యంలో క్లాసిక్స్ గా పేరు గాంచాయి.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ముల్క్ రాజ్ ఆనంద్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పెషావర్ లో ఒక హిందూ ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[4] అమృత్‌సర్ లోని ఖల్సా కళాశాలలో చదువుకున్నాడు. 1924 లో హానర్స్ లో ఉత్తీర్ణుడై ఇంగ్లండు వెళ్ళాడు. తనను తాను పోషించుకోవడానికి ఒక రెస్టారెంటులో పనిచేస్తూ లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించాడు. తర్వాత ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1929 లో బెర్ట్రాండ్ రస్సెల్, అనుభవవాదం (ఎంపిరిసిజం) మీద పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా అందుకున్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Zakaria, Rafiq (29 September 2004). "Very English, more Indian". The Indian Express.
- ↑ "...it can be said that they have taken over from British writers like E. M. Forster & Edward Thompson the task of interpreting modern India to itself & the world." The Oxford History of India, Vincent A. Smith (3rd edition, ed. Percival Spear), 1967, p. 838.
- ↑ Hoskote, Ranjit (29 September 2004). "The last of Indian English fiction's grand troika: Encyclopaedia of arts". The Hindu. Archived from the original on 17 December 2004. Retrieved 2019-08-29.
- ↑ Singh, Gurharpal (1994). Communism in Punjab: A Study of the Movement Up to 1967. Ajanta Publications. p. 312. ISBN 978-81-202-0403-4.
- ↑ Walsh, William, Indian Literature in English, Longman Group Limited (1990), p. 63.