మూలవిరాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Punnainallur Mariamman temple Moolavar, the main deity, Mariamman
నెల్లూరుజిల్లా వింజమూరు శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానంలోని గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి మూలవిరాట్.

మూలవిరాట్ అనే పదం ఒక సంస్కృత పదం, మూలవిరాట్ అనగా హిందూ దేవాలయాలలోని ప్రధాన దైవాన్ని సూచిస్తుంది. మూలం అనగా ముఖ్యమైనది, ప్రధానమైనది అని అర్థం, విరాట్ దైవాన్ని సూచిస్తుంది, అందువలన హిందూ దేవాలయాలలోని ప్రధాన దైవాన్ని మూలవిరాట్ అంటారు.

ప్రాముఖ్యత

[మార్చు]

దేవాలయాలలో మూలవిరాట్ యొక్క ప్రధాన సంరక్షణ కేంద్రపు గదిని గర్భగుడి లేక గర్భగృహం (పిండం యొక్క నివాసస్థలం) అంటారు. మూల విగ్రహం ఉండే గర్భగుడి దేవాలయానికి మధ్యలో ఉంటుంది, గర్భగుడి యొక్క ద్వారం ఎక్కువగా తూర్పు వైపున ఉంటుంది. మూల విగ్రహం ఉండే గది ఒక చదరపు గది, ఎక్కువగా మూల విగ్రహం తూర్పు వైపుకి చూస్తున్నట్లు పడమర వైపు గోడకి దగ్గరగా మధ్యలో ఉంటుంది. పురాతన హిందూ దేవాలయాలలో గర్భగుడి ఎక్కువగా చదునైన రాళ్లను అడ్డంగా నిలువుగా అమర్చి నిర్మించారు. కొన్ని దేవాలయాలలో మూల విగ్రహం ఉండే గర్భగుడిలో ఫోటోలు తీయరాదనే ఆంక్షలు ఉన్నాయి. The more important gods, Moolavar are closed to the center of the temples than the images that surround them and are precisely located at the points corresponding to the energies they represent on the temple plan's magical diagram.

ప్రతిష్టా ఉత్సవ కార్యక్రమ విధానం

[మార్చు]

నూతనంగా మూలవిరాట్ విగ్రహాన్ని స్థాపించేటపుడు జరిపే వివిధ కార్యక్రమాలు, పూజలు

[మార్చు]
 • గణపతి పూజ
 • వేద మంత్రోచ్చారణలు
 • పంచగవ్యప్రాశనము
 • మాతృకాపూజ
 • రక్షాబందనము
 • యాగశీల ప్రవేశము
 • కలశస్థాపన
 • మృత్యం గ్రహణము
 • అంకురారోపణము
 • పుణ్యాహం
 • అగ్నిప్రతిష్ఠ
 • దీక్షాహోమము
 • జప పారాయణములు
 • ప్రాతఃకాల హోమం
 • సప్త కలిశ స్నపనం
 • నవ కలశ స్నపనం
 • క్షీరాధివాసం
 • ఆదివాస హోమం
 • హోమం
 • కుంభ న్యాసం
 • పారామార్చన
 • ఆష్ఠాక్షన
 • మహాన్యాస హోమములు
 • పంచగవ్య అధివాసము
 • జలాధివాసము
 • ధాన్యాధివాసం
 • పుష్ప, ఫతాదివాసం
 • విష్వక్సేన పూజ
 • యంత్ర ప్రతిష్ఠ
 • మహా కుంభాభిషేకం
 • మూర్తి ప్రతిష్ఠ
 • ధ్వజ ప్రతిష్ఠ
 • ఆలయ శిఖరంపై కలశాల ప్రతిష్ఠ
 • ప్రాణ ప్రతిష్ఠ
 • బింబ కళాన్యాసము
 • బలిహరణం
 • శాంతి కల్యాణం
 • అర్చన
 • మంగళ హారతి
 • ఆశీర్వచనములు
 • స్వస్తి

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]