Jump to content

మూస చర్చ:ఈ వారము సమైక్య కృషి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రాక్టికల్ గా లేదు

[మార్చు]

"ఈ వారం సమైక్య కృషి"కి ఏ మాత్రం ఆదరణ లేదు. కారణం ఇందులో వ్రాసినవి చేయాలంటే వారాలు కాదు సంవత్సరాలు పడతాయి. అందుకని ఈ మూసను పునర్వ్యవస్థీకరిద్దామనుకొంటున్నాను. మొదటి పేజీలో "ఈ వారం వ్యాసం", "ఈ వారం బొమ్మ" లాగానే "ఈ వారం సమైక్య కృషి" అనే బాక్సును ప్రముఖంగా పెట్టాలని నా ప్రతిపాదన. మొదటి రెండూ చదివే వారికైతే మూడవది వ్రాసేవారికి అన్నమాట. అందులో ప్రతివారం సమైక్య కృషిగా ఈ క్రింది విషయాలు ఉంచాలనుకొంటున్నాను.

అంటే వారానికి మూడు వ్యాసాలపై సమిష్టి కృషి జరగాలన్నమాట. మీ అభిప్రాయాలను చెప్పండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:10, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వైవిధ్యం కోసం

[మార్చు]

సమిష్టి కృషిలో ఈ వారం - చింపాంజీ, సింధు లోయ నాగరికత, సహజ వాయువు, శ్రీరామనవమి - మొదటి మూడూ ప్రధానంగా అనువాదాలు చేయాల్సినవి. కృషి చేసేవారికి ఇది కొంత బోర్ కొడుతుంది. ముందు వారాలలో కనీసం ఒకటి తెలుగుకు ప్రత్యేకమైన (ఆంగ్ల వికీపై అంతగా ఆధారపడని) వ్యాసం ఉంచితే బాగుంటుంది (ఉదా: నన్నయ, బుడుగు, తూర్పు గోదావరి జిల్లా. ప్రస్తుతం పాల్గొంటున్న పరిమిత సభ్యుల కారణంగా వారానికి రెండే వ్యాసాలు సమిష్టి కృషిలో ఉంచమని సూచిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:13, 25 సెప్టెంబర్ 2008 (UTC)

నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే మీరు చెప్పినట్లు కొద్దిమంది మాత్రమే కృషి చేస్తున్నందున నాలుగు వ్యాసాలు పూర్తి కావడం కష్టమే ! అయితే మనం ఈ వ్యాసాలను ఖచ్చితంగా వారానికి పూర్తిచేయకుండా ఇంకా సమయం తీసుకుంటున్నాం. అందుకని నాలుగు పెట్టాను. ఇక ముందు వారం నుంచి అలాగే చేద్దామని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 14:20, 25 సెప్టెంబర్ 2008 (UTC)