మూస చర్చ:సహాయం కావాలి-విఫలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనుచితమైన సవరణ[మార్చు]

ఏదైనా చర్చలో "సహాయం కావాలి-విఫలం" అనే మూసను పెట్టిన తరువాత, ఆ చర్చలో మళ్ళీ ఎవరైనా స్పందించదలిస్తే, వాళ్ళు స్పందించాక, ఈ మూసను తీసేసి, "సహాయం అందించబడింది" అనే మూసను చేర్చవచ్చు అని ఉంది. అంటే స్పందించిన వాళ్ళే మార్చాలి అనేది ఇక్కడ ఒరిజినలుగా ఉన్న నియమం. కానీ అర్జున గారు ఈ మూసలో మార్చి 26 న ఒక దిద్దుబాటు చేసారు. దాని ప్రకారం విఫలం మూసను మార్చడం అనే పనిని చర్చను "ప్రారంభించినవారు మార్చవచ్చు" అని మార్చారు. ఈ మార్పు చెయ్యడం కోసం చర్చ ఏమీ జరగలేదు. తాను చేసిన మార్పేంటో దిద్దుబాటు సారాంశంలో సరిగ్గా రాయలేదు. ఈ చర్చ పేజీలో కూడా రాయలేదు.

పై మార్పు చేయక ముందు అర్జున గారు వేరే పేజీలో మరొక మార్పు చేసారు. అది వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి పేజీలో చేసిన ఈ మార్పు (ఈ మార్పు చేసిన తేదీ: 2021 మార్చి 23). ఆ మార్పును వ్యతిరేకిస్తూ, దాన్ని రద్దు చెయ్యాలంటూ చర్చ కూడా జరిగింది. ఆ చర్చ తరువాతనే అర్జున గారు ఈ మూస పేజీలో పైన చూపిన మార్పు చేసారు. అక్కడ తాను చేసిన దిద్దుబాటును రద్దు చెయ్యకపోగా, ఇక్కడ ఈ మార్పు చేసారు.

చేసిన పనిని సమర్ధించుకోడానికి పనికొచ్చేలా రెట్రోస్పెక్టివ్‌గా మార్పులు చేయదలచినపుడు, దాన్ని సముదాయానికి తెలిపి, అనుమతి తీసుకుని చెయ్యడమనేది తన బాధ్యతగా అర్జున గారు భావించి ఉంటే బాగుండేది. __చదువరి (చర్చరచనలు) 16:42, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]