Jump to content

మూస చర్చ:When

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వర్గం పేరు తెలుగులో

[మార్చు]

User:యర్రా రామారావు గారు, Vague or ambiguous time కు మీ అనువాదం సమయం అస్పష్టంగా ఉన్న వ్యాసాలు కు బదులుగా కాలం స్పష్టపరచవలసినవి మెరుగైనదనుకుంటాను. సమయం మామూలుగా గంటలు, నిముషాలు సూచించడానికి వాడతాము. లేకుంటే వర్గాన్ని ఆంగ్లంలోనే వుంచవచ్చు. పరిశీలించండి. --అర్జున (చర్చ) 05:16, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీ సూచనకు ధన్యవాదాలు.తెలుగు వికీపీడియాలో ఆంగ్ల వర్గాలు ఉండుట సముచితంకాదని నా అభిప్రాయం.మీరు సూచించిన విధంగా మార్చటానికి నాకేమీ అభ్యంతరంలేదు. "కాలం స్పష్టపరచవలసిన వ్యాసాలు" అని మార్చుతాను. యర్రా రామారావు (చర్చ) 05:57, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
User:యర్రా రామారావు గారు, తెలుగు వికీపీడియాలో ఆంగ్లం కొన్ని చోట్ల మంచిదే అవుతుంది. ఉదాహరణకు తొలినాళ్లలో మూసల పేర్లు తెలుగులో వాడారు. ఇటీవల నా కృషిలో ఆంగ్లవికీతో పోల్చి నిర్వహించటానికి మూసలను ఆంగ్లంలో వుంచడమే మేలనిపించింది. ఇవి చదువరులకు కనపడవనుకోండి. మూసల ద్వారా చేరే నిర్వహణ వర్గాలు ఆంగ్లంలోవుంటే ఒక ఉపయోగం వుంది. సాధారణ చదువరులకు ఈ వర్గాలను పట్టించుకోనవసరంలేకుండా, మానవీయంగా చేర్చిన (తెలుగులో కనబడేవి) లేక చదువరులకు ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడానికి మూసల ద్వారా చేరిన వర్గాలు గుర్తించడం సులభమవుతుంది. ఇక మీరు అనువాదమే చేర్చాలనుకుంటే వ్యాసాలు అని అనువాదంలో చేర్చకపోతే మంచిది. ఈ మూసలు ప్రధానపేరుబరే కాకుండా ఇతర పేరుబరులలో వాడే వీలుండవచ్చు. ఆంగ్ల మూలంలో articles అని లేనందున 'వ్యాసాలు' అనేది వదలివేయడమే మంచిది. --అర్జున (చర్చ) 04:23, 12 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]