మెడికల్ డివైసెస్ పార్క్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెడికల్ డివైసెస్ పార్క్
Medical Devices Park Corridor.jpg
మెడికల్ డివైసెస్ పార్క్ కారిడార్
రకంపారిశ్రామిక పార్క్
స్థానంసుల్తాన్‌పూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లా
విస్తీర్ణం250 ఎకరాలు
నిర్వహిస్తుందితెలంగాణ ప్రభుత్వం

మెడికల్ డివైసెస్ పార్క్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని పటాన్‌చెరు ప్రాంతంలో ఉంది.[1] 250 ఎకరాల విస్తీర్ణంలోని భారతదేశంలోనే అతిపెద్ద పార్కు ఇది.[2][3] పర్యావరణ హితంగా వైద్య సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, వైద్య సంబంధిత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, పరిశోధన-అభివృద్ధికి ఇది సహకారం అందిస్తుంది.[4]

చరిత్ర[మార్చు]

వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్‌ని వృద్ధి రంగాలుగా గుర్తించిన ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో 2017, జూన్ 17న పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ పార్కును ప్రారంభించాడు.[5]

ఇది ప్రారంభమైనప్పటినుండి, ఈ పార్క్ కోసం 40 కంపెనీలు తమ తయారీ/పరిశోధన యూనిట్లను ఏర్పాటు చేశాయి. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీలో హైదరాబాదకున్న ప్రాముఖ్యత వల్ల దేశంలోని హెల్త్‌కేర్ హబ్‌లలో ఒకటిగా ఉంది.[6] ప్లాస్టిక్‌లు, ఇంజనీరింగ్-ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారుచేసే నైపుణ్యమున్న అనేక కంపెనీలు హైదరాబాద్‌లో ఉండడంతో వైద్య పరికర ఆవిష్కర్తలు, తయారీదారులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటోంది.[7]

సదుపాయాలు[మార్చు]

మౌలిక సదుపాయాలు
 1. అంతర్గత రోడ్లు: ప్రయాణ సౌలభ్యం కోసం 100 అడుగుల వెడల్పు గల నల్లటి టాప్ రోడ్లు
 2. విద్యుత్ పంపిణి: నిరంతర విద్యుత్ సరఫరా (పార్కులోని అన్ని అంతర్గత రోడ్లలో 11 కెవి లైన్లు, 16 ఎంకెవి లోడ్‌తో 33/11 కెవి సబ్‌స్టేషన్)
 3. నీటి సరఫరా: ప్రతిరోజూ 546,000 గ్యాలన్ల నీరు సరఫరా
ప్రత్యేక సదుసాయాలు
 1. రాపిడ్ ప్రోటోటైపింగ్, టూలింగ్ ల్యాబ్: 3డి ప్రింటింగ్ టెక్నాలజీలు, 3డి స్కానర్లు, సి.ఎన్.సి. యంత్రాలు, డిజైన్-టూలింగ్ సామర్ధ్యాలు
 2. టెస్టింగ్-సర్టిఫికేషన్ ల్యాబ్‌లు: భద్రతలో కూడిన ఈఎంఐ-ఈఎంసి పరీక్ష సామర్థ్యాలు, గ్లోబల్ సర్టిఫికేషన్ ఏజెన్సీలతో భాగస్వామ్యం
 3. వైద్య పరికరాల పరీక్ష కోసం సౌకర్యాలు: స్టెరిలిటీ-టాక్సిసిటీ టెస్టింగ్, బయో కాంపాబిలిటీ-బయోమెటీరియల్ టెస్టింగ్, విద్యుత్ భద్రత-కాంపోనెంట్ టెస్టింగ్, రేడియేషన్ టెస్టింగ్, గామా వికిరణం, 3డి ప్రింటింగ్, మోల్డింగ్
 4. గిడ్డంగి: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా 3పిఎల్ సేవలతో 100,000 చదరపు అడుగులలో వైద్య పరికరాల భద్రతకు గిడ్డండి

ఇతర పార్క్ లు[మార్చు]

2019, సెప్టెంబరు 1న సుల్తాన్‌పూర్‌లోని సహజానంద మెడికల్ టెక్నాలజీస్ లో మెడికల్ డివైజ్ పార్క్‌ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేస్తున్న ఈ పరిశ్రమలో మెడికల్ స్టంట్లను తయారుచేస్తారు.[8]

మూలాలు[మార్చు]

 1. Nation’s biggest medical devices park gets rolling | Hyderabad News - Times of India
 2. Fosun Group officials meet KTR
 3. Industries, Commerce Dept. gets ₹1,286 crore - The Hindu
 4. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (8 June 2017). "ఈనెల 17న మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ ప్రారంభం". andhrajyothy. Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
 5. Biggest Medical Devices Park in country inaugurated - TELANGANA - The Hindu
 6. Telangana Today, Hyderabad (7 April 2021). "Hyderabad emerging as medical devices hub: KTR". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
 7. "Medical Device Park". Telangana Life Sciences (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
 8. మన తెలంగాణ, వార్తలు (1 September 2019). "మెడికల్ డివైజ్ పార్క్ కు భూమిపూజ". Telangana. Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.

బయటి లింకులు[మార్చు]