Jump to content

మేకిరి దామోదర్

వికీపీడియా నుండి
(మేకిరి దామోదర్‌ నుండి దారిమార్పు చెందింది)
మేకిరి దామోదర్‌
[[File:
మేకిరి దామోదర్‌
మేకిరి దామోదర్‌
|frameless]]
మేకిరి దామోదర్‌
జననందామోదర్‌
(1964-09-09) 1964 సెప్టెంబరు 9 (వయసు 60)
గోపనపల్లి, వరంగల్‌ జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తిఉపాధ్యాయులు
కవి,రచయిత
మతంహిందూ
భార్య / భర్తలలిత
పిల్లలురంజిత్,రణధీర్‌
తండ్రిరాజయ్య
తల్లివీరమ్మ

మేకిరి దామోదర్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.బోధనాశీలి,అధ్యయనవాది,అభ్యుదయ భావాలకు తోడుగా సామాజిక స్పృహ కలిగిన దామోదర్‌ బహుముఖ అంశాల మీద అలవోకగా వ్యాసాలు రాస్తారు.

జననం-విద్యాభ్యాసం

[మార్చు]

వీరమ్మ- రాజయ్య దంపతులకు అనంతారం గ్రామం,పర్వతగిరి మండలం,వరంగల్‌ జిల్లాలో09-09-1964లో జన్మించారు. ప్రాథమిక విద్య గోపనపల్లిలో హైస్కూల్‌ నల్లబెల్లి విద్యానగర్‌లో,ఇంటర్‌ విద్యను వర్ధన్నపేటలో డిగ్రీ(బి.ఏ)విద్య కాకతీయ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసారు. ఉపాధ్యాయ వృత్తి మీద ఆసక్తితో కరీంనగర్‌ డైట్‌లోటీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసారు[1].

ప్రస్తుత నివాసం-వృత్తి/ఉద్యోగం

[మార్చు]

టైగర్‌ హిల్స్‌కాలని, న్యూశాయంపేట,హంటర్‌రోడ్‌,హన్మకొండలో ఉంటున్నారు.1998లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం కొనసాగిస్తూ..ప్రవృత్తి రీత్యా సమకాలీన సామాజిక,ఆర్థిక,రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తారు.ప్రస్తుతం తన స్వగ్రామమైన గోపనపల్లిలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.

వివాహం

[మార్చు]

06-04-1983లో లలిత ను సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. వీరికి రంజిత్‌,రణధీర్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రచురించిన మొదటి పుస్తకం

[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి పేర్వారం జగన్నాథం గారి ప్రేరణతో 2005లో "రైతురాత" మొదటి కవితను రాసారు.దామోదర్‌ కవితలు, వ్యాసాలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి.[2]

  1. పహార (కవిత సంకలనం)[3]
  2. సంఘర్షణ(వ్యాస సంకలనం)
  3. సమర శంఖం(వ్యాస సంకలనం)
  4. ఒక దేశం అనేక ప్రశ్నలు(వ్యాస సంపుటి).

అవార్డులు- పురస్కారాలు

[మార్చు]
  • ఉగాది పురస్కారం- విద్యాసాంస్కృతిక శాఖ‍&రాష్ట్రబాషోపాద్యాయ సంఘం-2009
  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు -ఎ.పి.విద్యాశాఖ, వరంగల్‌ -2011
  • ట్రూ ఇండియా పెలోషిప్‌ అవార్డు-ఎ.పి. దళిత కళామండలి-2012
  • రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-చెలిమి సాంస్కృతిక సమితి,త్యాగరాజగాన సమితి సంయుక్తంగా-2012.
  • మహాత్మాజ్యోతిరావు పూలే నేషనల్‌ ఫెలోషిప్‌ అవార్డు-భారతీయ దళితసాహిత్య అకాడమీ-2014.
  • విద్యారత్న అవార్డు-మదర్‌ ఫౌండేషన్‌ ,వరంగల్‌-2019.
  • రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-కీర్తీ ఆర్ట్స్‌ అకాడమి, హైదరాబాద్‌-2019.
  • సాహితీ రత్న అవార్డు-శ్రీ వివేకానంద సేవా సమితి, భూపాల్‌పల్లి-2019.
  • స్పూర్తి బి.ఎస్‌.రాములు పురస్కారం-విశాల సాహితి అకాడమి,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్తంగా-2019.
  • గిడుగు రామమూర్తి పంతులు ప్రతిష్టాత్మక సాహితి అవార్డు-గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌,హైదరాబాద్‌-2019[4].
  • తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ హోల్డర్‌-2020.
  • విజ్డమ్‌ నేషనల్‌ అవార్డ్‌-కరీంనగర్‌-2021.

మూలాలు

[మార్చు]
  1. "దామూ". d1gn0d1ziaoihb.cloudfront.net/andhra-jyothi-epaper/0001.jpg. Retrieved 9 సెప్టెంబరు 2007. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)[permanent dead link]
  2. "కళలంటే ప్రాణం". epaper.sakshi.com/. 2000-08-20. Retrieved 2022-08-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "పహార గమ్యాన్ని చేర్చిన కవిత్వం". gantaravam.com/. 2020-11-17. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
  4. "దామోదర్‌కు గిడుగు రాంమూర్తి పురస్కారం". epaper.andhrajyothy.com. Retrieved 2019-08-30. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)