Jump to content

మైఖేల్ రిచర్డ్‌సన్

వికీపీడియా నుండి
మైఖేల్ రిచర్డ్‌సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైఖేల్ జాన్ రిచర్డ్‌సన్
పుట్టిన తేదీ (1986-10-04) 1986 అక్టోబరు 4 (వయసు 38)
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
బంధువులుడేవ్ రిచర్డ్‌సన్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 19)2019 19 June - Denmark తో
చివరి T20I2023 25 July - Jersey తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2019Durham (స్క్వాడ్ నం. 18)
2013/14Badureliya Sports Club
2014/15Colombo Cricket Club
2019Northumberland
కెరీర్ గణాంకాలు
పోటీ T20I FC LA T20
మ్యాచ్‌లు 25 103 31 71
చేసిన పరుగులు 511 4,828 1,304 1,025
బ్యాటింగు సగటు 30.05 29.26 56.69 25.00
100లు/50లు 0/2 6/26 3/10 0/3
అత్యుత్తమ స్కోరు 61* 148 111 61*
క్యాచ్‌లు/స్టంపింగులు 15/10 186/5 12/0 38/10
మూలం: Cricinfo, 17 August 2023

మైఖేల్ జాన్ రిచర్డ్‌సన్ (జననం 1986, అక్టోబరు 4) దక్షిణాఫ్రికాలో జన్మించిన జర్మన్ క్రికెట్ ఆటగాడు. ఇతడు వికెట్ కీపర్‌గా ఫీల్డింగ్ చేసే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్గా రాణించాడు. 2010లో డర్హామ్ ఎంసిసియుతో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో డర్హామ్ తరపున అరంగేట్రం చేశాడు.

జననం

[మార్చు]

రిచర్డ్‌సన్ 1986, అక్టోబరు 4న పోర్ట్ ఎలిజబెత్‌లో జన్మించాడు. ఆతడి కుటుంబానికి మంచి క్రికెట్ నేపథ్యం ఉంది. ఇతని తండ్రి డేవ్ రిచర్డ్‌సన్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతని తాత జాన్ రిచర్డ్‌సన్, మామ రాల్ఫ్ రిచర్డ్‌సన్, కజిన్ మాథ్యూ రిచర్డ్‌సన్ అందరూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.

2019 జూన్ లో, 2018–19 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఐరోపా క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో గ్వెర్న్సీలో జరిగే రీజినల్ ఫైనల్స్‌కు జర్మనీ జట్టుకు ఎంపికయ్యాడు.[1] రిచర్డ్‌సన్ తన తల్లి వైపు జర్మన్ పౌరసత్వాన్ని కలిగి ఉండటం ద్వారా జట్టు కోసం ఆడేందుకు అర్హత సాధించాడు.[2] 2019 జూన్ 19న డెన్మార్క్‌పై జర్మనీ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[3]

2021 సెప్టెంబరులో, 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఐరోపా క్వాలిఫైయర్ టోర్నమెంట్ ప్రాంతీయ ఫైనల్ కోసం జర్మనీ టీ20 జట్టులో ఎంపికయ్యాడు.[4] 2022 జనవరిలో ఒమన్‌లో జరిగే 2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గ్లోబల్ క్వాలిఫైయర్ ఎ టోర్నమెంట్ కోసం జర్మనీ జట్టులో ఎంపికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Denmark remain in contention". Cricket Europe. Archived from the original on 2 September 2019. Retrieved 18 June 2019.
  2. "Michael Richardson, son of ICC CEO Dave, expected to make international debut". Sport Star. Retrieved 17 June 2019.
  3. "15th Match, ICC Men's T20 World Cup Europe Region Final at Castel, Jun 19 2019". ESPN Cricinfo. Retrieved 19 June 2019.
  4. @Cricket_Germany (16 September 2021). "Our squad for the men's T20 World Cup European Finals" (Tweet) – via Twitter.
  5. @Cricket_Germany (28 January 2022). "Our 14 man squad for the ICC T0 World Cup Global Qualifiers in Oman from 17-24 February" (Tweet) – via Twitter.

బాహ్య లింకులు

[మార్చు]