మై ఫెయిర్ లేడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మై ఫెయిర్ లేడి
సినిమా పోస్టర్
దర్శకత్వంజార్జ్ కుకోర్
స్క్రీన్ ప్లేఅలన్ జె లెర్నర్
దీనిపై ఆధారితం
నిర్మాతజాక్ ఎల్.వార్నర్
తారాగణం
  • ఆడ్రీ హెప్బర్న్
  • రెక్స్ హారిసన్
  • స్టాన్లీ హాలవే
  • విల్‌ఫ్రిడ్ హైడ్-వైట్
  • గ్లాడిస్ కూపర్
  • జెరెమీ బ్రెట్
  • థియోడార్ బైకెల్
ఛాయాగ్రహణంహారీ స్ట్రాడ్‌లింగ్
కూర్పువిలియం హెచ్. జీగ్లర్
సంగీతంఫ్రెడెరిక్ లూయీ
నిర్మాణ
సంస్థ
వార్నర్ బ్రదర్స్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్
విడుదల తేదీ
అక్టోబరు 21, 1964 (1964-10-21)[1]
సినిమా నిడివి
170 నిముషాలు[2]
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$17 మిలియన్లు[1]
బాక్సాఫీసు$72.7 మిలియన్లు[1]

మై ఫెయిర్ లేడీ 1964లో విడుదలయిన అమెరికన్ సంగీతప్రధానమైన హాస్య చలనచిత్రం. ఈ సినిమాకు జార్జి బెర్నార్డ్ షా 1913లో రచించిన పెగ్మాలియన్ అనే నాటకం ఆధారం. ఈ సినిమా 8 అకాడమీ పురస్కారాలను గెల్చుకుంది. 1998లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వారు 100 ఉత్తమచిత్రాలలో 91వ ర్యాంకును ఈ సినిమాకు ఇచ్చారు. 2018లో ఈ సినిమాను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారి నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో భద్రపరిచారు.

మనం మాట్లాడే భాష మన గురించి అన్ని విషయాలను స్పష్టం చేస్తుంది అనే అంశాన్ని నమ్మే ఓ భాషా శాస్త్రజ్ఞుడి గురించిన కథే 'మై ఫెయిర్ లేడీ'. భాష సరిగ్గా ఉంటే ఇక అన్నీ సరిగ్గా ఉన్నట్లేనని ప్రొఫెసర్ గారి అభిప్రాయం. భాష సరిగ్గా లేకుంటే దాన్ని సరిచేసుకోవచ్చుననీ ఆయన నమ్మకం. అసలు భాషాజ్ఞానం లేకుండా నోటికి ఏది వస్తే అది, ఎలా అంటే అలా అనేసే వాళ్లను గనుక తన ట్రెయినింగ్‌లో ఉంచితే, వాళ్లను ఆరునెలల కాలంలో చక్కని భాష మాట్లాడే వాళ్లలాగ తీర్చిదిద్దగలననీ, ఫలితంగా వాళ్లు ఉన్నత సంఘంలో సైతం తేలికగా చలామణీ అయిపోగలరనీ ఆయన అంటుంటారు. ఇలా చెప్పే ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్‌తో అదంత సాధ్యంకాదని పందెం వేస్తాడు కల్నల్ హ్యూ పికరింగ్. చివరికి వాళ్లిద్దరూ కొపెంట్ గార్డెన్‌కు వెళ్లి, అక్కడ పూలు అమ్ముకొనే ఎలిజా డ్యూలిటిల్ అనే యువతిని తీసుకు వస్తారు. చాలా మొరటు భాష మాట్లాడే ఆమెకు అనేక రకాల తర్ఫీదును ఇచ్చి, చివరికి- ఆమె పర్వాలేదనే స్థితికి వచ్చిందని భావించాక, ఆస్కాట్ గుర్రపు పందాలకు తీసుకువెడతారు. అయితే ఆమె అక్కడ- మామూలు పద్ధతిలో తన నోరు విప్పి, తన స్థాయి ఏమిటో అందరి ముందూ బయట పెట్టేసుకుంటుంది. ఇది ప్రొఫెసర్ గారికి కోపం తెప్పిస్తుంది. అయినా - ఇంకా టైముందంటూ, ఈసారి ఆమెను ఏకంగా ఎంబనీ బాల్ (డాన్స్)కు తీసుకువెడతాడు. అక్కడ ఆమె అన్నిరకాల ఒత్తిళ్లనూ తట్టుకొంటూ, అన్నిరకాల పరీక్షలనూ నెగ్గి విజేతగా తిరిగి వస్తుంది. అప్పటికే ఆమె అంటే ఇష్టాన్ని పెంచుకొని ఉంటాడు ప్రొఫెసర్ హిగ్గిన్స్. కానీ ఆయన తనను పందెంలో పావులాగే చూస్తున్నాడని భావిస్తున్న ఎలిజా ఆయనకు చెప్పకుండా ఇల్లు వదిలేస్తుంది. అప్పటికి ప్రొఫెసర్ గారికి ఆమె లేని లోటు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు వెళ్లి ఆమెను తిరిగి వచ్చి తనతో ఉండాల్సిందిగా కోరుతాడు. ఆ ప్రొఫెసర్ అంటే ఎలిజాలోనూ ఇష్టం ఏర్పడి ఉండటంతో ఎలిజా తిరిగి రావటంతో కథ ముగుస్తుంది.[3]

నటీనటులు

[మార్చు]
  • ఆడ్రీ హెప్బర్న్ - ఎలిజా డ్యూలిటిల్
  • రెక్స్ హారిసన్ - ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్
  • స్టాన్లీ హలోవే - ఆల్‌ఫ్రెడ్ పి. డ్యూలిటిల్
  • విల్‌ఫ్రిడ్ హైడ్-వైట్ - కల్నల్ జ్యూ పికరింగ్
  • గ్లాడిస్ కూపర్ - ప్రొఫెసర్ హిగ్గిన్స్ భార్య
  • జెరెమీ బ్రెట్ - ఫ్రెడ్డీ ఐన్స్‌ఫోర్డ్-హిల్
  • థియోడోర్ బైకెల్ - జోల్టన్ కర్పథి
  • మోనా వాష్‌బోర్న్ - ప్రొఫెసర్ హిగ్గిన్స్ పనిమనిషి
  • ఇసోబెల్ ఎల్సమ్‌ - ఐన్స్‌ఫోర్డ్-హిల్ భార్య
  • జాన్ హాలండ్ - బట్లర్

పాటలు

[మార్చు]
సినిమా సెట్లో ఎలిజా డ్యూలిటిల్ పాత్రను ధరించిన ఆడ్రీ హెప్బర్న్ తో ఛాయాగ్రాహకుడు హారీ స్ట్రాడ్లింగ్
  1. "ఓవర్చర్"
  2. "వై కాన్‌ట్ ది ఇంగ్లీష్ లర్న్ టు స్పీక్?"
  3. "వుడ్‌న్‌ట్ ఇట్ బి లవర్‌లీ?"
  4. "యాన్ ఆర్డినరీ మ్యాన్"
  5. "విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ లక్"
  6. "జస్ట్ యు వెయిట్"
  7. "సర్వెంట్స్ కోరస్"
  8. "ది రెయిన్ ఇన్ స్పెయిన్"
  9. "ఐ కుడ్ హ్యావ్ డాన్స్‌డ్ ఆల్ నైట్"
  10. "ఆస్కాట్ గవొట్టె"
  11. "ఆన్ ది స్ట్రీట్ వేర్ యు లివ్"
  12. "ఇంటర్‌మిషన్"
  13. "ట్రాన్సిల్వేనియన్ మార్చ్"
  14. "ఎంబసీ వాల్ట్జ్"
  15. "యు డిడ్ ఇట్"
  16. "షో మీ"
  17. "గెట్ మీ టు ది చర్చ్ ఆన్ టైమ్"
  18. "ఎ హిమ్న్ టు హిమ్"
  19. "వితౌట్ యు"
  20. "ఐ హావ్ గ్రోన్ అకస్టమ్డ్ టు హర్ ఫేస్"

నిర్మాణం

[మార్చు]

చలనచిత్రంగా రూపొందించటానికి హక్కులకోసం వార్నర్ సంస్థ మొత్తం 55 లక్షల డాలర్ల మొత్తాన్ని చెల్లించింది. ఈ ఖర్చుతో కలుపుకొని, ఈ సినిమాకు వార్నర్ వారు కోటీ 70 లక్షల డాలర్లు ఖర్చుపెట్టారు. ఇంత ఖర్చుతో వార్నర్ సంస్థ అంత క్రితం ఏ సినిమానూ తీయలేదు.[3][4]

విడుదల

[మార్చు]

ఈ సినిమా ప్రీమియర్ షో న్యూయార్క్ నగరంలోని క్రిటేరియన్ థియేటర్‌లో 1964, అక్టోబర్ 21వ తేదీన ప్రదర్శించబడింది. తరువాతి రోజు నుండి ఈ సినిమాను సాధారణ ప్రజల కోసం ప్రదర్శించారు.[5]

పురస్కారాలు, ప్రతిపాదనలు

[మార్చు]
పురస్కారం విభాగము ప్రతిపాదితుడు (లు) ఫలితం
అకాడమీ పురస్కారాలు[6][7] ఉత్తమ చిత్రం జాక్ ఎల్.వార్నర్ గెలుపు
ఉత్తమ దర్శకుడు జార్జ్ కుకోర్ గెలుపు
ఉత్తమ నటుడు రెక్స్ హారిసన్ గెలుపు
ఉత్తమ సహాయనటుడు స్టాన్లీ హాలవే ప్రతిపాదన
ఉత్తమ సహాయనటి గ్లాడిస్ కూపర్ ప్రతిపాదన
ఉత్తమ స్క్రీన్ ప్లే అలన్ జె లెర్నర్ ప్రతిపాదన
ఉత్తమ కళాదర్శకుడు (కలర్) కళాదర్శకత్వం: జీన్ అలెన్ & సెసిల్ బీటన్
సెట్టింగులు: జార్జ్ జేమ్స్ హాప్‌కిన్స్
గెలుపు
ఉత్తమ ఛాయాగ్రహణం (కలర్) హారీ స్ట్రాడ్లింగ్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ సెసిల్ బీటన్ గెలుపు
ఉత్తమ ఫిలిమ్ ఎడిటర్ విలియం హెచ్. జీగ్లర్ ప్రతిపాదన
ఉత్తమ సంగీతం ఆండ్రీ ప్రెవిన్ గెలుపు
ఉత్తమ శబ్దగ్రహణం జార్జ్ ఆర్ గ్రోవ్స్ గెలుపు
అమెరికన్ సినిమా ఎడిటర్స్ అవార్డులు ఉత్తమ ఎడిటర్ విలియం హెచ్. జీగ్లర్ ప్రతిపాదన
బాక్సాఫీస్ మ్యాగజైన్ అవార్డులు బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది మంత్ ఫార్ హోల్ ఫ్యామిలీ (డిసెంబర్) జార్జ్ కుకోర్ గెలుపు
బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు ఉత్తమ సినిమా గెలుపు
ఉత్తమ బ్రిటిష్ నటుడు రెక్స్ హారిసన్ ప్రతిపాదన
సినిమా రైటర్స్ సర్కిల్ అవార్డులు ఉత్తమ విదేశీ చిత్రం గెలుపు
డేవిడ్ డి డొనటెల్లో అవార్డులు ఉత్తమ విదేశీ చిత్రం జాక్ ఎల్.వార్నర్ గెలుపు
ఉత్తమ విదేశీ నటుడు రెక్స్ హారిసన్ గెలుపు
ఉత్తమ విదేశీ నటి ఆడ్రీ హెప్బర్న్ గెలుపు
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ దర్శకుడు జార్జ్ కుకోర్ గెలుపు
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు ఉత్తమ చలన చిత్రం - మ్యూజికల్ లేదా కామెడీ గెలుపు
ఉత్తమ దర్శకుడు జార్జ్ కుకోర్ గెలుపు
ఉత్తమ నటుడు - మ్యూజికల్ లేదా కామెడీ రెక్స్ హారిసన్ గెలుపు
ఉత్తమ నటి - మ్యూజికల్ లేదా కామెడీ ఆడ్రీ హెప్బర్న్ ప్రతిపాదన
ఉత్తమ సహాయనటుడు స్టాన్లీ హాలవే ప్రతిపాదన
లారెల్ అవార్డులు టాప్ రోడ్ షో గెలుపు
ఉత్తమ నటుడు రెక్స్ హారిసన్ గెలుపు
ఉత్తమ నటి ఆడ్రీ హెప్బర్న్ ప్రతిపాదన
ఉత్తమ సహాయనటుడు స్టాన్లీ హాలవే ప్రతిపాదన
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు[ టాప్ 10 సినిమాలు రెండవ స్థానం
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డు నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ చేర్చుకోబడింది
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఉత్తమ చిత్రం గెలుపు
ఉత్తమ దర్శకుడు జార్జ్ కుకోర్ ప్రతిపాదన
ఉత్తమ నటుడు రెక్స్ హారిసన్ గెలుపు
ఉత్తమ నటి ఆడ్రీ హెప్బర్న్ ప్రతిపాదన
ఆన్‌లైన్ ఫిల్మ్ & టెలివిజన్ అసోసియేషన్ అవార్డులు హాల్ ఆఫ్ ఫేమ్ – చలన చిత్రం గెలుపు
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ రచన అలన్ జె లెర్నర్ ప్రతిపాదన

పునరుద్ధరణ

[మార్చు]

ఈ సినిమా ఒరిజినల్ కెమెరా నెగెటివ్‌ల నుండి 1994లో జేమ్స్ సి.కాట్జ్, రాబర్ట్ ఎ.హారిస్‌లు పునరుద్ధరించారు.[8] 2015లో మళ్ళీ ఈ చిత్రాన్ని పునరుద్ధరించి బ్లూ రే సంస్థ విడుదల చేసింది.[9] 2008లో ఈ సినిమాను పునర్మించే ప్రయత్నాలు జరిగాయి కానీ అవి విజయవంతం కాలేదు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "My fair lady". Box Office Mojo. Archived from the original on అక్టోబరు 25, 2019. Retrieved అక్టోబరు 25, 2019.
  2. "My Fair Lady (1964)". IMDb. డిసెంబరు 25, 1964. Archived from the original on నవంబరు 25, 2015. Retrieved నవంబరు 25, 2015.
  3. 3.0 3.1 పాలకోడేటి సత్యనారాయణరావు (ఏప్రిల్ 1, 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 178–180.
  4. Richard Barrios (ఏప్రిల్ 8, 2014). Dangerous Rhythm: Why Movie Musicals Matter. ISBN 9780199973859. Archived from the original on మే 21, 2021. Retrieved అక్టోబరు 20, 2016.
  5. "B'way Still Spotty But 'Poppins' Smash 157G, 'Topkapi' Sock $53,000; 'Outrage' 36G, 2d; 'Lilith' 35G, 3d". Variety. అక్టోబరు 21, 1964. p. 15.
  6. "NY Times: My Fair Lady". Movies & TV Dept. The New York Times. 2012. Archived from the original on ఫిబ్రవరి 17, 2012. Retrieved డిసెంబరు 21, 2008.
  7. "The 37th Academy Awards (1965) Nominees and Winners". oscars.org. Archived from the original on ఏప్రిల్ 2, 2015. Retrieved ఆగస్టు 24, 2011.
  8. Grimes, William (ఆగస్టు 15, 1994). "In 'My Fair Lady,' Audrey Hepburn Is Singing at Last". The New York Times. Archived from the original on అక్టోబరు 5, 2016. Retrieved ఏప్రిల్ 23, 2010.
  9. "MORE LOVERLY THAN EVER! HIGH DEFINITION UPGRADE OF ICONIC BELOVED MUSICAL" (Press release). HOLLYWOOD, Calif.: Paramount Home Entertainment. సెప్టెంబరు 15, 2014. Archived from the original on అక్టోబరు 15, 2014. Retrieved అక్టోబరు 11, 2014.
  10. "Keira Knightley is My Fair Lady". ComingSoon.net. జూన్ 6, 2008. Archived from the original on జనవరి 20, 2012. Retrieved ఫిబ్రవరి 5, 2014.
  11. Cameron Mackintosh Shares Update on MISS SAIGON & MY FAIR LADY Films – One is OFF! broadwayworld.com, Retrieved May 3, 2014

ఉపయుక్త గ్రంథసూచి

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.