మొక్కపాటి సుబ్బారాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొక్కపాటి సుబ్బారాయుడు (1879 - 1918) పరిపాలనా దక్షుడు, పండితుడు. ప్రఖ్యాత హాస్య రచయిమొక్కపాటి నరసింహశాస్త్రి ఈయన సహోదరుడు. ఈయన 1879 సంవత్సరం సెప్టెంబరు 8 తేదీన జన్మించాడు. ఈయన ముత్తాత షట్ఛాస్త్రవేత్త, శ్రౌతి అయి పెద్దాపురం విద్వత్తిమ్మ జగపతి మహారాజు వద్ద మొగలితుర్రు సంస్థానంలో అఖండ రాజ గౌరవాలు పొందాడు. తాత సదాశివశాస్త్రి నాలుగు శాస్త్రాలలో పండితుడు. తండ్రి తపశ్శాలి అనీ, అన్న ప్రదాత అని కీర్తిపొందాడు. ఈయన విద్యాధికుడు, పిఠాపురం సంస్థానంలో దివానుగా ఉండి పలువురికి ఉపకారాలు చేశాడు. ఆ కాలంలో పీఠికాపురాధీశుల సమస్త ధర్మకార్యాలకు వీరి ప్రోత్సాహమే ప్రధానమైన కారణము.

న్యుయింగ్తన్ కళాశాల లో అధ్యాపకులుగా పనిచేసిన మొక్కపాటి సుబ్బారాయుడు పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యా రావు బహుదూర్ కు బాల్యం లో సత్ప్రవర్తన, ఆంగ్ల, ఆంద్ర భాషలను బోధించారు. సుబ్బారాయుడు మహారాజుకు కార్యదర్శిగా నియమితులయ్యారు. 1906 లో వారసత్వ వివాదాలలో రాజా విజయం సాదించిన తరువాత 1907 లో పట్టాభిషిక్తులై సుబ్బరాయుడును దివాన్ గా నియమిచారు. ఆయనే మహా మంత్రి తిమ్మరుసు మాదిరిగా పిఠాపురం సంస్థానానికి వైభవాన్ని, రాజు సూర్యా రావుకు ఘనకీర్తిని సముపార్జీంచి పెట్టారు. కోర్ట్ కమీషనర్ వద్ద నుండి లభించిన లక్షలాది రూపాయలను సుబ్బారాయుడు, విద్యావ్యాప్తి, ప్రజా సంక్షేమం, సంఘసంస్కరణలు, ఆనాడ శరణాలయాలు, అన్నదానం, సాహిత్య పోషణ, కోసం మాత్రమే రాజు చేత ఒప్పించి ఖర్చు చేయించారు. మొక్కపాటి వారి పాలనాకాలం లో ఉచ్చదశకు చేరిన సంస్తానం వారి నిష్క్రమణ తరువాత పతన దిశగా పరుగులు తీసింది. హరిజనోద్దరణ, మధ్య నిషేధం, మహిళా వికాసం, హరిజన హాస్టల్, ఉచిత విద్యలు లాంటి సంస్కరణలను దేశంలోని అనేక ప్రాతాలకంటే చాలా కాలం ముందే పిఠాపురం సంస్తానంలో అమలుజరిగాయి.

ఈయన 1918 సంవత్సరం డిసెంబరు 12 తేదీన పరమపదించాడు.