Jump to content

మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

వికీపీడియా నుండి
మొగుడూ పెళ్ళాం ఓ దొంగొడూ
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం వెంకీ
నిర్మాణం వాకాడ అంజన్ కుమార్
కథ వెంకీ
తారాగణం రాజా, శ్రియా, బ్రహ్మానందం
సంగీతం కాబూలీ
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు 2005 లో విడుదలైన సినిమా. ఈ చిత్రంలో 3 పాత్రలు మాత్రమే ఉన్నాయి,[1] ఇది మామూలుగా వచ్చే చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది.

శ్రీ రామ చంద్ర మూర్తి ( రాజా ) సత్యభామ ( శ్రియ ) తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. మూర్తి ఒక ఎన్నారై, సత్యభామ బాగా చదువుకున్న గ్రామీణ యువతి. వారి మొదటి రాత్రి సమయంలో, సత్యభామ రాత్రి 10 గంటలకు గదిలోకి ప్రవేశించి, ముహూర్తం 12 గంటలకు ఉన్నందున అర్ధరాత్రి వరకు కలుసుకో కూడదని తన అమ్మమ్మ సలహా ఇచ్చిందని చెబుతుంది. ఇద్దరూ గడియారం 12 కొట్టడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తారు. రాత్రి 11 గంటలకు కరెంటు పోయినపుడు దంపతులకు తెలియకుండానే జీవితంలో మొట్టమొదటి దొంగతనం చేస్తున్న ఓ దొంగ (బ్రహ్మానందం) గదిలోకి ప్రవేశిస్తాడు. దీంగలెవరూ లోపలికి రాకుండా, సత్యభామ తలుపుకు తాళం వేసి, తాళం చెవిని తన వద్ద ఉంచుకుంటుంది. దొంగ అప్పటికే వారి పడకగదిలో దూరి ఉన్నాడని తెలియదు పాపం. దొంగ సత్యభామ నుండి తాళం చెవిని లాక్కొని గది నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సమయం గడుపుతుండగా, రాత్రి 11.30 గంటల సమయంలో సత్యభామ ముహూర్తం గురించి చెప్పినది అబద్దం అని తెలిసి మూర్తికి కోపం వస్తుంది. అప్పుడు, క్లైమాక్సులో దొంగ బయటకు వచ్చి వారి తగువును పరిష్కరించి తప్పించుకుంటాడు. ఈ జంట ఒకటి కావడంతో కథ ముగుస్తుంది.

తారగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు వ్యాఖ్యలు Movie Comments & Discussion in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-21. Retrieved 2020-08-21.