మొదటి జయసింహుడు
మొదటి జయసింహుడు (సా.శ. 641–673), కుబ్జ విష్ణువర్ధనుడి తర్వాత తూర్పు చాళుక్యుల రాజుగా పాలనకు వచ్చాడు. అతని పేరు మొదటి జయసింహవల్లభుడు అని కూడా కొందరు చరిత్రకారులు రాసారు.[1] అతను 32 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పాలించాడు. అయితే అతని పాలనలో ముఖ్యమైనది ఏమీ జరగలేదు. అతను సకలలోకాశ్రయ, విజయసిద్ధి అనే బిరుదులు ధరించాడు.
మొదటి జయసింహుడు రాజ్యానికి వచ్చే సమయానికి, పల్లవ రాజైన మొదటి నరసింహవర్మ పశ్చిమ చాళుక్యులను ఓడించి వాతాపిని స్వాధీనం చేసుకున్నాడు. జయసింహుని తండ్రి కుబ్జ విష్ణువర్ధనుడు ఆ యుద్ధంలో తన అన్నయ్య రెండవ పులకేశికి సహాయంగా వెళ్ళి అక్కడే మరణించాడు.[1] ఆ తరువాత మొదటి జయసింహుడు రాజయ్యాడు.
జయసింహుడు వేయించిన విప్పర్ల గామశాసనము సాగరసీమలో తెలుగులో వేయించిన తొలిశాసనము. ఇది గుంటూరుజిలా నరసరావుపేట తాలూకాలో లభించింది.[2]
మొదటి జయసింహుడికి పిల్లలు లేనందున, తన తమ్ముడు ఇంద్ర భట్టారకుడిని వారసుడిగా ఎంచుకున్నాడు. ఇంద్ర భట్టారకుని 7 రోజుల పాలన తరువాత అతని కుమారుడు రెండవ విష్ణువర్ధనుడు పాలనకు వచ్చాడు. అతని కుమారుడు మంగి ని మొదటి జయసింహుడు (తన తమ్ముని మనుమడిని) యువరాజుగా ప్రకటించాడు.[3][4]
అంతకు ముందువారు కుబ్జ విష్ణువర్ధనుడు |
తూర్పు చాళుక్యులు సా.శ. 641 – 673 |
తరువాత వారు ఇంద్ర భట్టారకుడు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 64.
{{cite book}}
: CS1 maint: date and year (link) - ↑ ఖండవల్లి, లక్ష్మీరంజనం; ఖండవల్లి, బాలేందు శేఖరం (1957). ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. బాలసరస్వతి బుక్ డిపో. p. 185.
- ↑ భట్టిప్రోలు, శ్రీలక్ష్మీ హనుమంతరావు (2003-12-01). ఆంధ్రుల చరిత్ర. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 148.
{{cite book}}
: CS1 maint: date and year (link) - ↑ నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 62.
{{cite book}}
: CS1 maint: date and year (link)
మరింత సమాచారం
[మార్చు]- దుర్గాప్రసాద్, క్రీ.శ.1565 వరకు ఆంధ్రుల చరిత్ర, పి.జి.పబ్లిషర్స్, గుంటూరు (1988)
- దక్షిణ భారత శాసనాలు - http://www.whatisindia.com/inscriptions/
- నీలకంఠ శాస్త్రి, KA (1955). ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, OUP, న్యూఢిల్లీ (పునర్ముద్రితం 2002).