మొదటి నరసింహవర్మను
మొదటి నరసింహవర్మను | |
---|---|
Pallava King | |
పరిపాలన | సుమారు 630 – 668 AD |
పూర్వాధికారి | Mahendravarman I |
ఉత్తరాధికారి | Mahendravarman II |
వంశము | Mahendravarman II |
Dynasty | Pallava |
తండ్రి | Mahendravarman I |

మొదటి నరసింహవర్మను (మొదటి నరసింహ వర్మ క్రీస్తుశకం 630–668 నుండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ రాజవంశం రాజు మొదటి నరసింహ వర్మను. ఆయన తన తండ్రి మొదటి మహేంద్రవర్మను కళాభిమానాన్ని పంచుకున్నాడు. మహేంద్రవర్మను మామల్లపురం (మహాబలిపురం) లో ప్రారంభించిన పనిని పూర్తి చేశాడు. ఆయన పాలనలో నిర్మించబడిన ప్రసిద్ధ పంచపాండవ రాతి ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
సా.శ. 642 వ సంవత్సరంలో చాళుక్య రాజు రెండవ పులకేశి చేతిలో తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదటి నరసింహవర్మనును మహమల్లా అని కూడా ప్రశంశించబడ్డాడు.[1][2] (గొప్ప రెజ్లరు) అని కూడా పిలుస్తారు. ఆయనకు లభించిన ఈ ప్రశంశాత్మక మహామల్ల పేరును మహేంద్రవర్మను నిర్మించిన నగరానికి మామల్లపురం (మహాబలిపురం) అని పేరు పెట్టబడింది.
ఆయన పాలనలో సా.శ. 640 లో చైనా యాత్రికుడు హ్యూయెను త్సాంగు కాంచీపురం సందర్శించాడు.[3]
మొదటి నరసింహవర్మను శివభక్తుడు. అప్పరు, సిరుతోండరు, తిరుగ్నానసంబందరు వంటి గొప్ప నాయనారు సాధువులు ఆయన పాలనలో నివసించారు.[మూలం అవసరం]
మొదటి నరసింహవర్మను తరువాత ఆయన కుమారుడు రెండవ మహేంద్రవర్మను సా.శ. 668 వ సంవత్సరంలో వచ్చాడు.
సైనిక విజయాలు
[మార్చు]మొదటి నరసింహవర్మను యుద్ధరంగంలో తమ శత్రువులతో ఎప్పుడూ ఓడిపోని 12 మంది భారతీయ రాజులలో ఒకరని గుర్తించబడ్డాడు. ఇతరులు అజతాశత్రు, చంద్రగుప్త మౌర్యుడు, కరికాల చోళుడు, చేరను సెంగుట్టువను, విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ, రాజసుయ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చోళ రాజు పెరునారుకిళ్ళి (క్రీ.పూ 575 ), సంగం యుగానికి చెందిన పాండ్యరాజు నెడుంజళియను, సముద్రగుప్తుడు, రాజసుయ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాయన్మారు సాధువు రాజసింహ, మొదటి రాజరాజ చోళుడు, ఆయన కుమారుడూ గొప్ప యోధుడు అయిన రాజేంద్ర చోళుడు.
చాళుక్యులతో యుద్ధాలు
[మార్చు]దక్కను రాజు రెండవ పులకేశి గతంలో వివిధ ఉత్తర పల్లవ కోటలపై దాడి చేశారు. అయినప్పటికీ పల్లవ రాజధాని కాంచీపురం పట్టుకోలేకపోయాడు.[4] ఇది చాళుక్యులు, పల్లవుల మధ్య సుదీర్ఘ ఘర్షణకు దారితీసింది.
రెండవ పులకేశి తిరిగి పల్లవ రాజధానిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి చాలా సంవత్సరాల తరువాత మరొక దండయాత్ర చేపట్టాడు. అయినప్పటికీ పల్లవ పాలన అప్పటికి అనేక యుద్ధాలలో చాళుక్యులను ఓడించిన మొదటి నరసింహవర్మను వద్దకు వెళ్ళింది. ఆయన విజయం సాధించిన యుద్ధాలలో కాంచీపురానికి తూర్పున 20 మైళ్ళ దూరంలో ఉన్న మణిమంగళం ఒకటి. ఆయన తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ భయంకరమైన శత్రురాజు సైన్యాలతో వెదిరగడాన్ని చూడగలనని పేర్కొన్నాడు. ఈ విజయంతో ప్రోత్సహించబడిన మొదటి నరసింహవర్మను తన సైన్యాధ్యక్షుడు పరంజోతితో కలిసి తన సైన్యాన్ని ముందుకు నడిపించి వాతాపి మీద దాడి చేసి విజయవంతంగా ఓడించాడు.[3] సా.శ. 642 లో చాళుక్య రాజు రెండవ పులకేశిని చంపాడు. ఈ నగరం మరలా రాజధాని కాలేదు.[5]
విజయోత్సాహంతో ఆయన కాంచీపురానికి విజయవంతంగా తిరిగి వచ్చాడు. ఆయనకు వటపికొండను (వతాపిని జయించినవాడు) అనే బిరుదు ఇవ్వబడింది.[6]
ఆయన సైన్యాధ్యక్షుడు పరంజోతి (విక్రమా కేసరి, పరదుగమర్దనా అని కూడా పిలుస్తారు) శివ భక్తికి బాగా ప్రసిద్ధి చెందాడు. 63 నాయన్మారు సాధువులలో ఒకరిగా మొదటి నరసింహవర్మను నాయకత్వంలో వాతాపి నగరాన్ని వ్యక్తిగతంగా నాశనం చేసినట్లు పేర్కొన్నారు. సెక్కీజారు రచనలో 12 వ తిరుమురై ఈ సిరుతొండరు దుష్టనాశనం చేసిన కాళీమాతలా పల్లవుల దక్కను శత్రువును నాశనం చేసినట్లు వర్ణించబడింది. ఆయనను 'సిరుతోండరు' అని కూడా పిలుస్తారు. ఒక విధేయుడైన యోధుడుగానూ "వైద్యంలో అనేక గ్రంథాలను ప్రావీణ్యం పొందిన" ఒక వైద్యుడుగా కూడా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఈ విక్రమకేసరి శివుడి ఆదేశం మేరకు ఎలాంటి సంకోచం లేకుండా తన బిడ్డను బలి ఇచ్చాడు. చెంగట్టంకుడిలోని ఒక ఆలయంలోని గణేశుడు ఈ దండయాత్ర ఫలితంగా ఉండవచ్చా అనే గందరగోళం ఉంది. కాని ఇది నిజం కాదనిపిస్తుంది ఎందుకంటే గణేశుడి ఆలయం, అనుబంధాన్ని స్థలాపురాణం లేదా సాహిత్యంలో బాగా వివరించబడిన స్థలం ప్రాముఖ్యత ఆధారంగా గణేశుడు మునుపటి యుగంలో అనేక వేల సంవత్సరాల క్రితం వ్యవస్థాపించబడినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి మంజూరు చేయబడిన చాలా నిధి మంజూరులు ఈ సంఘటనను ఇలా సూచిస్తాయి: అగస్త్య ఋషి చాలా కాలం క్రితం ఆ పేరుతో ఒక రాక్షసుడిని చంపిన విధంగా "కిలిసాయోనెరివా విమత్తితా వాతాపి" లేదా వాతాపిని నాశనం చేసినవాడు అని ప్రస్తుతించాడు.
శ్రీలంక రాజకీయాలలో ప్రభావం
[మార్చు]మొదటి నరసింహవర్మను ఆస్థానంలో సింహళ యువరాజు మానవర్మ నివసించాడు. ఆయన శత్రువు రెండవ పులకేశిని అణిచివేసేందుకు మానువర్మ సహాయం చేశాడు. ప్రతిగా మానవర్మ రెండుసార్లు శ్రీలంక మీద దండెత్తడానికి మొదటి నరసింహవర్మను సైన్యాన్ని సరఫరా చేశాడు. రెండవ దాడి విజయవంతమైంది. మానవర్మ శ్రీలంకను ఆక్రమించి దాని మీద ఆయన సా.శ. 691 నుండి 726 వరకు పరిపాలించాల్సి ఉంది. అయినప్పటికీ కసకుడి రాగిఫలకాలు నరసింహవర్మన్ శ్రీలంకను జయించడాన్ని సూచిస్తాయి. మహావంశం కూడా ఈ వాస్తవాలను ధ్రువీకరిస్తుంది.
సాహిత్యంలో నరసింహవర్మను
[మార్చు]కల్కి కృష్ణమూర్తి రచన, "శివగామియిన్ శపధం" (శివకామి శపథం) నరసింహవర్మను ప్రారంభ పాలనా సంవత్సరాలు చాళుక్యులతో ఆయన చేసిన యుద్ధాల మీద ఆధారపడింది. కల్కి కృష్ణమూర్తి " పార్థిబాను కనవు " (ఫార్తిఫను కల) నరసింహవర్మను పాలన తరువాతి సంవత్సరాల ఆధారంగా రూపొందించబడింది.
మొదటి నరసింహవర్మను
| ||
అంతకు ముందువారు మొదటి మహేంద్ర వర్మను |
పల్లవ రాజవంశం 630–668 |
తరువాత వారు రెండవ మహేంద్ర వర్మను |
మూలాలు
[మార్చు]- ↑ Rabe, Michael Dan (1987). The Monolithic Temples of the Pallava Dynasty: A Chronology (in ఇంగ్లీష్). University of Minnesota.
- ↑ Gangoly, Ordhendra Coomar (1957). The art of the Pallavas (in ఇంగ్లీష్). G. Wittenborn.
- ↑ 3.0 3.1 Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 41–42. ISBN 978-9-38060-734-4.
- ↑ Keay, John, India: A History, p170
- ↑ KAN Sastri, A History of South India, p136
- ↑ Keay, John, India: A History, p172
వనరులు
[మార్చు]- Keay, John (2001). India: A History. Grove Press. ISBN 0-8021-3797-0.
- Sastri, K A N (2008). A History of South India (4th ed.). New Delhi, India: Oxford University Press.
- Ancient India, R. C. Majumdar, Ancient India, K.A.Nilakanta Sastri
వెలుపలి లింకులు
[మార్చు]- August 2019 from Use dmy dates
- Articles with short description
- All articles with unsourced statements
- Articles with unsourced statements from June 2019
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- Pallava kings
- 7th-century monarchs in Asia