ఆగాకర

వికీపీడియా నుండి
(మొమోర్డికా డయాకా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆకాకరకాయ
ఆకాకర కాయలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
మొ. డయాకా
Binomial name
మొమోర్డికా డయాకా
ఆకాకరకాయ

ఆగాకర, ఆకాకర లేదా అడవికాకర ఒక చిన్న పాకుడు మొక్క. దీనిని కూరగాయగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉపయోగిస్తారు. ఇది కాకర కాయ జాతికి సంబంధించినది. కాకర కాయలా పొడవుగా ఉండదు. పొట్టిగా గుండ్రముగా పై ముళ్ళ లాంటి తోలుతో ఉంటుంది. ఆంధ్ర, అస్సామీ, గుజరాతీ, ఒడిషా, మహారాష్ట్ర వంటకాలలో వాడతారు. కాకరకాయతో పోల్చితే చేదు తక్కువగా ఉంటుంది, కొన్ని సార్లు చేదు లేకుండా ఉంటుంది.

లక్షణాలు[మార్చు]

  • దుంప వేరున్న ఎగబ్రాకే బహువార్షిక పొద.
  • మూడు నుండి ఐదు నొక్కులు గల సరళ పత్రాలు కలిగివుంటుంది.
  • ఏకాంత పసుపు రంగు పుష్పాలు పూస్తుంది.
  • మృదువైన కంటకాల వంటి ప్రికిల్స్ ఉన్న దీర్ఘవృత్తాకార ఫలాలు కాస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగాకర&oldid=3875657" నుండి వెలికితీశారు