Jump to content

మొవ్వు ఈగ

వికీపీడియా నుండి

మొవ్వు ఈగ ను మొవ్వు తొలుచు ఈగ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం ఎథెరిగోనా సొక్కేట ఇది డిప్టేరా క్రమానికి చెందినది.ఈ పురుగు ప్రధానంగా మొక్కజొన్న పంటను ఆశిస్తుంది

గుర్తింపు చిహ్నాలు

[మార్చు]

1.తల్లి పురుగు ఊదా రంగు కలిగి చిన్న ఈగ లాగా ఉంటుంది

2.ఉదర ఖండితాల పైన మగ పురుగుకు ఆరు మచ్చలు , ఆడ పురుగుకు నాలుగు మచ్చలు ఉంటాయి . ఇవి రెండు వరుసలలో ఉంటాయి

3.లద్దె పురుగులు లేత పసుపు రంగులో ఉండి కాళ్ళు లేకుండా తల భాగం వద్ద కొనదేలి ఉండును

4.పిల్ల పురుగులను మ్యాగెట్స్ అంటారు[1]

గాయ పరిచే విధానం

[మార్చు]

మ్యూగట్స్ లేదా లద్దె పురుగులు ఆకు పై భాగం పై పాకి క్రమంగా లేత మొవ్వులోనికి చొచ్చుకొని పోతాయి . మొవ్వును తెరిచి తినడం వలన మొవ్వు ఎండి చనిపోతుంది . ఎండిన మొవ్వును పీకగానే సులువుగా పైకి వస్తుంది . మొవ్వు మొదలు వద్ద కుళ్ళి ఉండటం వలన చెడువాసన వస్తుంది. పురుగు ఆశించిన తల్లి మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి . ఈ పిలకలకు కంకులు రావు మొక్క మొలకెత్తినప్పటి నుండి ఒక వేల వరకు మాత్రమే ఈ పురుగు పైరును ఆశిస్తుంది[2]

జీవిత చక్రం

[మార్చు]

1.తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో పొడవైన తెల్లని గుడ్లను ఒక్కొక్కటిగా సుమారు 20 నుండి 25 వరకు పెడతాయి

2.గుడ్డుదశ 1-2 రోజులు

3.లార్వాదశ 8-10 రోజులు

4.ప్యూపాదశ 8 రోజులు

5.కోశస్థ దశలో పురుగులు మొక్కల మొదళ్ళ వద్ద ప్రవేశిస్తాయి

యాజమాన్య పద్ధతులు

[మార్చు]

1.పురుగు సంతతి ఆగష్టు - సెప్టెంబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది.ఆలస్యంగా విత్తిన పైరుకు ఈ పురుగు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది . అందువల్ల తొలకరి వర్షాలు పడగానే పదును చూసుకొని ఖరీఫ్ సీజన్ లో జూలై 15 లోపు విత్తుకోవాలి

2.ఆలస్యంగా విత్తనం వేయవలసి వస్తే విత్తన మోతాదును 4-10 కిలోలకు పెంచి మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను తీసివేయాలి

నివారణ

[మార్చు]

సేంద్రియ నివారణ

[మార్చు]

1.ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కి వేప పిండి వేయాలి

2.మొవ్వులో కొంత మోతాదు లో ఎర్రమట్టి ని నింపాలి

2.అగ్ని అస్త్రం విచికారి చేయాలి[3]

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణ వ్యవసాయ శాఖ". Telangana agriculture department. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-29.
  2. Millet Telugu magazine. Millet. 2020.
  3. వివిధ చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.
"https://te.wikipedia.org/w/index.php?title=మొవ్వు_ఈగ&oldid=4344132" నుండి వెలికితీశారు