మొవ్వ వృషాద్రిపతి
మొవ్వ వృషాద్రిపతి సుప్రసిద్ధ సాహితీ కారుడు, నాటక రంగ ప్రముఖులు.
జీవిత విశేషాలు
[మార్చు]వీరు గుంటూరు జిల్లా నగరం మండలంలోని పూడివాడ గ్రామంలో శ్రీనివాస పెరుమాళ్ళు. బాలమాంబ దంపతులకు, 1941లో జన్మించారు. వీరు తాత నుండి సంగీతజ్ఞానం, తండ్రి నుండి సాహిత్యజ్ఞానం అందిపుచ్చుకున్నారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ఎం.ఎ. (తెలుగు) పట్టాపుచ్చుకున్నారు. వీరు డిగ్రీ కళాశాల ఉపన్యాసకులుగా తమ ఉద్యోగ జీవితాన్ని 1964లో ప్రారంభించి, తెలుగు శాఖ అధ్యక్షులుగా, ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు పొంది 1997లో పదవీ విరమణ చేశారు. వీరిని గురించి సాహితీ ప్రపంచంలో తెలియనివారు అరుదు. పండిత కుటుంబం నుండి వచ్చిన ఆయన అధ్యాపక వృత్తితోపాటు, ఆధ్యాత్మిక. సాహిత్య, నాటక, వ్యాఖ్యాన రంగాలలో రాణించి తనదైన ముద్ర వేసినారు. గంభీరమైన గాత్రంతో ఆయన దేశ, విదేశాలలో పలుప్రదర్శనలిచ్చారు. ఆలిండియా రేడియో, దూరదర్శన్, టీవీలు, తి.తి.దేవస్థానం కార్యక్రమాలలో విరివిగా పాల్గొని, వందలాది ప్రదర్శనలతో వీక్షకులు, శ్రోతలను ఆకట్టుకున్నారు. బర్మింగ్ హాం (లండన్), అమెరికా తానా సభలలో ఆయన ప్రసంగాలు ప్రశంసల జల్లులు కురిపించినవి.[1]
రచనలు
[మార్చు]వీరు బహుగ్రంథకర్తలుగా ప్రసిద్ధులు. వీరి రచనలలో కొన్ని:
- ఉపనిషద్వాణి (7 భాగాలు)
- శ్రీ పద్మావతీ శ్రీనివాసీయం
- హరిహరాత్మక విజయం
- తపస్సిద్ధి
- సోమనాద్రి
- భారతజ్యోతి
- విశ్వగాయత్రి
- లలితాస్తవం
- కన్నెవాగు
- కసాపురక్షేత్ర మహాత్మ్యం
- రాణి దుర్గావతి
- రఘునాథవిజయం
- శ్రీకృష్ణరాయ విజయ ప్రబంధం
- శ్రీబాలకృష్ణలీలావిలాసం
- భావమందాకిని
- విరిదండ
- వేంకటేశ్వర శతకం
- పద్మావతీ శతకం
- కసాపురాంజనేయ శతకం
- కన్యకావిజయం
- జ్ఞానతరంగాలు
- ప్రతిజ్ఞార్జునీయం
- దానరాధేయ
- చంద్రహాస విజయం
- సాయీ విజయం
- కూచిమంచి తిమ్మకవి విరచిత నీలాసుందరీపరిణయ వ్యాఖ్యానము
- అచ్చతెనుగు రామాయణము - వ్యాఖ్యానం
సాహితీరూపకాలు
[మార్చు]వీరు భువనవిజయం, ఇంద్రసభ, యమసభ, త్రైలోక్యసభ, విజయసభ, శారదాధ్వజం వంటి పలు సాహితీరూపకాలలో అనేక పాత్రలను ధరించి దేశమంతటా వేలకొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
సత్కారాలు
[మార్చు]వీరు స్వర్ణాభిషేకము, స్వర్ణసింహతలాటము, స్వర్ణాంగుళీయకము వంటి సత్కారాలను పొందడమే కాక
- వడ్డే శ్యామసుందర్ - సుజాత పురస్కారం
- కవితా పురస్కారం (గుంటూరు)
- కవిసింహ పోకూరి కాశీపతి సెంటినరీ పురస్కారం (మాచర్ల)
- నన్నయ భట్టారక పురస్కారం (తణుకు)
- భూతపురి సుబ్రహ్మణ్యశర్మ స్మారక పురస్కారం (కడప) మొదలైన పురస్కారాలను పొందారు.
పురస్కారాలు
[మార్చు]- 2018 సంవత్సరానికి రాసిన శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధము అనే పద్య కవిత గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం పొందాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ [ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఆగష్టు-22; 9వపేజీ]
- ↑ "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. 2021-10-30. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.