Jump to content

మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు

వికీపీడియా నుండి

1919 వ సంవత్సరంలో భారతదేశమునందు బ్రిటిష్ ప్రభుత్వము అమలు చేసిన ఇండియా రాజ్యాంగ చట్టములో ఇమడ్చబడ్డ సంస్కరణల నే మాంటేగూ-షెమ్సఫర్డు సంస్కరణములనబడినవి. ఆ చట్టము లోని సంస్కరణలను కలిగియున్న నివేదిక తయారుచేసిన వారిద్దరు పేర్లతో ప్రసిధ్దిచెందిన సంస్కరణలు. 1917 లో ఇంగ్లండ్ లోని బ్రిటిష్ ప్రభుత్వపు మంత్రివర్గములో భారతదేశ వ్యవహారములు చూచుచుండిన విదేశ రాజ్యాంగమంత్రి ఎడ్విన్ శామ్యుయల్ మాంటెగూ (Edwin Samuel Montagu) మరియూ 1916-1921 మధ్య భారతదేశములో గవర్నర్ జనరల్ (వైస్రాయి) గా నుండిన లార్డు షెమ్సు ఫర్డు (Frederic John Napier Thesiger, 1st Viscount Chelmsford) కలసి తయారుచేసిన నివేదిక. ఆ నివేదికలోని సంస్కరణలు గల రాజ్యాంగ చట్టము జూన్ 1918 లో ఇంగ్లండు పార్లమెంటునందు ఆమోదించబడి 1919 మద్యలో భారతదేశములో అమలుచేయబడింది. కానీ అప్పటికే; 1909 లో ప్రవేశపెట్టిన మింటో-మార్లే సంస్కరణల ఫలితముగా నెలకొల్పబడ్డ శాసన సభలు, ప్రజాప్రభుత్వవిధానము పేరట బ్రిటిష్ ప్రభుత్వమువారు చేయుచున్న నిరంకుశ తీర్మానములు, నిర్ణయములను మేదాశక్తుల పత్రికా విమర్శనలతో ప్రజలలో రాజకీయ పరిజ్ఞానము విఛక్షణా శక్తి కలిగించబడినవి (చూడు మింటో-మార్లే సంస్కరణలు ). తత్ఫలితముగా ఉద్భవించిన జాతీయ చైతన్యత, స్వాతంత్ర్య కాంక్షలను అణచివేయుటకు అనేక విధములుగా బ్రిటిష్ ప్రభుత్వము రాజ్యతంత్రములు చేయసాగెను. 1919 మొదటిలో బ్రిటిష్ ప్రభుత్వమువారు అవలంబించిన నిరంకుశ చర్యలు; మార్చి 1919 న ప్రవేశపెట్టబడిన రౌలట్ చట్టం (Rowlatt Act) లో పొందపపరచబడిన అతినిరంకుశ అతివిశేష నిబంధనల శాసనమును అమలుచేయుట, ఏప్రిల్ 1919 లో జరిగిన జలియన్ వాలా బాగ్ కాల్పులు, పంజాబ్ లో విధించిన సైనికపరిపాలన మార్షల్ లా మొదలగు నిరంకుశ చర్యలు భరించిన ప్రజలు ఆ వెంటనే ఉపశమనముగా బ్రిటిష్ ప్రభువులు చేసిన ఆ మాంటేగూ-షెమ్సఫర్డు సంస్కరణల ద్వారా ప్రజాప్రభుత్వ విధానములు (శాసన సభలు, ఎన్నికలు) కలిపించినప్పటికీ అవి అన్నీకూడా గవర్నర్ జనరల్ యొక్క నిరవధిక నిరంకుశ నిర్నయములకు లోబడియుండినవి. గవర్నర్ జనరల్ యొక్కనిరంకుశాధికారములేమియును ఆ సంస్కరణలు తొలగించియుండలేదు. ఏమాత్రము తక్కువకూడా చేయలేదు. సరికదా శాసనసభకు ఎన్నుకోబడిన సభ్యుల నిర్ణయాలసైతము (ప్రజాబిప్రాయములపై) త్రోసిపుచ్చగల అధికారము కొద్దిపాటేయున్న ఆధికారసభ్యులకు కలిగియుండినది. ఆ తరువాత 1931లో జరిగిన గాంధీ-ఇర్విన్ సంధి వడంబడికల ద్వారా మరికొన్ని సానుభూతికమైన ఉదార చర్యలుగూడా దేశములో రగులుకున్న క్రోధాగ్ని, స్వరాజ్యకాంక్ష అనే మంటలను ఆపలేకపోయినవి. ఆ సంస్కరణలు 1919 కన్నా ముందుగాకనుక వచ్చియున్న యడల బహుశా కాంగ్రెస్సు వారు ఆమోదించి ప్రజాదరణ కూడా పొందియుండేవేమో.[1]

మాంటెగూ సంస్కరణలను ప్రస్తావించిన సందర్భం, ఉద్దేశ్యం, భాతదేశంలో కలిగిన స్పందన

[మార్చు]

1914- 1916మధ్య ఐరోపా ఖండములో జరిగిన మొదటి ప్రపంచయుద్దము (ఐరోపాసంగ్రామము) లో బ్రిటిష్ సామ్రాజ్యము వారి మిత్రమండలికి విజయము కిలిగినది. రష్యా ఓడిపోవటం, జర్మనీ దేశము విఝంభించటము జరిగినది (చూడు మొదటి ప్రంపంచ యుద్దం ). ఆ యుద్దము తరువాత యూరోప్ దేశీముల మధ్య గొప్ప ఏర్పాటులు జరిగినవి. ఐరోపామహాసంగ్రామములోని సభ్యదేశములలో భారతదేశము కూడా సభ్యదేశముగా పరిగణించబడి సంగ్రామ సమనాలోచనలయందును, 1917-18 మధ్యజరిగిన సామ్రాజ్య కార్యాలోచన సభలయందును, మిత్రమండలి సభలయందును కూడా భారతదేశానికి ఒక స్ధానమొసగబడింది. ఆ సభ్యదేశముల మద్య జరిగిన సంధి ( పారీస్ సంధి చర్చలు, వర్సాలిస్ సంది), వప్పందములమేరకు అనేక చిన్నచిన్న జాతీయులయొక్క స్వాతంత్ర్యముకూడా కాపాడబడునని ప్రకటింపబడింది. స్వయం నిర్ణయ సూత్రము ప్రచారములోకి వచ్చింది. దక్షిణాఫ్రికానుండి అప్పుడే భారతదేశానికి వచ్చేసిన గాంధీజీ మహాసంగ్రామమునకు బ్రిటిష్ వారికి సహాయమొనరించుటకు భారతీయ సైనికులను ప్రోవుచేసి బ్రిటిష్ సామ్రాజ్యప్రభుత్వము పట్ల భారతదేశ సానుభూతిని ప్రకటించియుండెను. ఆ ప్రంపచమహా సంగ్రామములో భారతసైనికులు ధైర్యసాహసములతో బ్రిటిష్ సామ్రాజ్య విజయముకొరకు పోరాడిరి. ఆట్టి త్యాగముచేసి యోగదానముచేసిన భారతదేశానికి స్వరాజ్యమిచ్చెదరని ఆశించిరి. 1917 ముందుగా భారతదేశ పర్యటనకువచ్చిన ఇండియా వ్యవహారాల బ్రిటిష్ విదేశాంగమంత్రి ఎడ్విన్ మాంటెగూకు స్వరాజ్యము కోరుచూ లక్షలకొలది సంతకములతో మహజరు (విజ్ఞప్తి) సమర్పించటమైనది. భారతదేశములో పురోగమించుచున్న స్వరాజ్య కాంక్ష, ఆందోళన పరిస్థితులు గమనించి ఇచ్చటి గవర్నర్ జనరల్ షెమ్స్ ఫర్డుతో కలని నివేదిక తయారు చేసి 1917 ఆగస్టు మాసములో బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగములో భాతదేశమునందు క్రమేణ ప్రజాపరిపాలన వ్యవస్థలు, పధ్దతులు ప్రవేశపెట్టి చివరకు పూర్తి స్వపరిపాలిత మైన స్వరాజ్యదేశముగా నుండవలెనని సూచించాడు. కానీ ఆ ఉద్ఘోషణ అచ్చటి రాజకీయనాయకులకు నచ్చకనివేదికలోని సూచనలను రాజ్యాంగ చట్టములో ఇమర్చినప్పుడు సంకలనముచేసి 'స్వపరిపాలిక ప్రభుత్వము' బదులు 'బాధ్యతాయుత' ప్రభుత్వముగా మార్చి 1919 రాజ్యాంగ చట్టముగా అమలుచేశారు. 1917 జూన్ నెలలో ఇండియా వ్యవహారాల మంత్రి గానున్న ఎడ్విన్ మాంటెగు భారతదేశానికి చేయవలసిన రాజ్యాంగ సంస్కరణల చిత్తుప్రకటనను సమీక్షించునప్పుడు అప్పటి బ్రిటిష్ ప్రదాన మంత్రి లాయిడ జార్జి భారతదేశపు మాజీ వైస్రాయి, తత్కాలీన వార్ కాబినట్ మెంబరుగా నున్న లార్డ్ కర్జన్కు ఆ చిత్తు ప్రకటనను సవరించి మెరుగు పరచమనగా ఆ చిత్తు ప్రకటనలో 'స్వపరిపాలన' అను మాటను మార్చి 'బాధ్యతాయుత స్వపరిపాలన' గా చేసిన ఘనత లార్డు కర్జన్ దొరకే.[2] మాంటెగూ భారతదేశయాత్ర ఫలితమే ఆ రాజ్యాంగ చట్టమని సంతసించుచు ఎంతో ఉత్సాహముతో ఎదురుచూచున్న భారతీయులకు అట్టి ప్రస్తావనకు భారతదేశము లోని బ్రిటిష్ ప్రభుభక్తులు సంతృప్తి చెందారుగాని రాజకీయ పరిజ్ఞానముకలిగిన మేదావులను నిరాశచెందిరి. చాలమంది కాంగ్రెస్స్ నాయకులు, కార్యకర్తలు ఆ సంస్కరణలను నిరాకరించవలెనని కోరిరి. అయిననూ అప్పటి అగ్రనాయకుడైన లోకమాన్య తిలక్ మరియూ అప్పటికి కొలదికాలము క్రిందటనే దక్షిణ ఆఫ్రికానుండి భారతదేశము వచ్చి స్వరాజ్య ఆందోళనలో ప్రవేశించిన గాంధీజీ ఆ రాజ్యాంగమును స్వీకరించి ఇంకా ముందు పూర్తి స్వరాజ్యము కొరకు పోరాటము సాగించవచ్చునని ప్రజలకు నచ్చచెప్పిరి.[3] 1916 సంవత్సరములో హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము (Home Rule League) అను సంస్థను స్థాపించిన అనిబిసెంట్ అప్పటిలో జైలునుండి విడులై వచ్చి1917 లోజరిగిన కలకత్తా కాంగ్రెస్సుమహాసభకు అధ్యక్షతవహించెను. ఆమె చేసిన స్పందన ఉల్లేఖన "ఈ సంస్కరణములు బ్రిటిష్ వారు ప్రసాదించుటకుగాని భారతీయులు స్వీకరించుటకు గాని యోగ్యమైనవి కావు" ఉల్లేఖన సమాప్తం. మాంటెగూ సంస్కరణలప్రకారం నెలకొల్పబడిన శాసనసభలకు 1920 అక్టోబరులో జరిగిన ఎన్నికలు బహిష్కరింపబడెను.[1]

1919 ఇండియా రాజ్యాంగ చట్టానికి పీఠిక

[మార్చు]

మాంటెగూ పార్లమెంటులో చేసిన ప్రకటన తదనంతరం మాంటెగూ-షెమ్సు ఫర్డు సంస్కరణల శిఫారసు నివేదికను పొందుపరచి రాజ్యాంగచట్టముగా 1918 లో బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదము పొంది 1919 లో అమలుచేసిన చట్టములోని అంశముల తెలుగుసేత ఉల్లేఖన " భారతఖండము సామ్రాజ్యాంతర భాగముగ భాద్యతాయుత స్వపరిపాలనను పొందుటకు స్వపరిపాలిత సంస్ధలను క్రమ క్రమముగా నేలకొలిపి అభివృధ్ధి యుటయు, భారతీయ ప్రభుత్వము యొక్క అన్ని శాఖలలోను భారతీయులు పాల్గొనుటకవకాశమిచ్చుటయుపార్లిమెంటువారి యుద్దేశ్యమైనందునను, వృధ్ధిక్రమాణుగుణములగు మజీలల ప్రకారమే ఈయుద్దేశ్యమును నెరవేర్చుట యుక్తమైనందునను , అందుకొరకు కొన్ని ఏర్పాటులిప్పుడు గావింపవలయును. ఎప్పుడేప్పుడేయో విధముగ అభివృధ్ది గావింపవలెయునో పార్లమెంటువారే నిర్ణయింతురు. ఏలన భారతవర్ష ప్రజలయొక్క క్షేమాభివృధ్దిభారము పార్లిమెంటుపైనే గలదు. ఈక్రొత్త యవకాశము లెవరికి కలుగజేయబడుచున్నవో ఆ ప్రజల సహాకారమునుబట్టియు బాధ్యతలను నిర్వహించుటయందు వారికి కల శక్తినిబట్టియు పైనచేప్పబడిన విషయములను పార్లిమెంటువారు నిర్ణయింతురు. "భరతఖండమునందలి పరగణాలలో స్వపరిపాలనా సంస్థలు వృధ్ధిచేయబడిన కొలదియు కేంత్రప్రభుత్వముయొక్క ప్రభుత్వకర్తవ్యములకు భంగకరములుకాకుండగ సాధ్యమైనంతహెచ్చు స్వాతంత్ర్యములు పరగణాల కీయబడును" ఆ రాజ్యాంగచట్టమును బ్రిటిష్ సార్వభౌముడు భరతఖండ వైస్రాయికి పంపిన రాజ్యనిర్దేశ పత్రములో మాయధినివేశరాజ్యములందు భరతఖండము తన యర్హస్థానమును పొందుటకుగాను సామ్రాజ్యాంతర్భాగమగు రాజ్యముు వృధ్దిక్రమానుగుణమైన బాధ్యతాయుత స్వపరిపాలన సిధ్ధికొరకు పార్లమెంటువారు సూచించిన విధానములు పరిపూర్ణత్వు నందుటయో మా యభిమతము అనియూ ఉదహరింపబడియున్నది" ఉల్లేఖన పూర్తి.[1] మాంటెగూ భారతదేశ యాత్ర తరువాత అతను బ్రిటిష్ పార్లమెంటులో చేసిన ప్రకటన చూచినతరువాత అధినివేశ స్వరాజ్యము (డొమీనియన్ స్టేటస్) కలుగజేయబడునని ఎదురుచూచుచున్న భారతదేశప్రజలు, కాంగ్రెస్స్ నాయకులకు ఆసంస్కరణతో వచ్చిన రాజ్యాంగచట్టమునందు అట్టి ఘోషణలేకపోవటం, స్వరాజ్యమునకు బదులు బాధ్యతాయుతస్వపరిపాలన అని యుండుట చాలా నిరాశకలుగజేసినది. (చూడు అధినివేశ స్వరాజ్యము )

1919 రాజ్యాంగ చట్టం నందలి సంస్కరణాంశాలు

[మార్చు]


(1) ఇంగ్లండు బ్రిటిషసామ్రాజ్య ప్రభుత్వమువారి ఇండియా వ్యవహారాల విదేశాంగమంత్రి భారతదేశ పరిపాలనా పద్ధతులను నియంత్రణచేయును
(2) వైస్రాయి (గవర్నర్ జనరల్) కార్యనిర్వాహక సమితిలో కనీసము ముగ్గురు సభ్యులు భారతీయులై యుందురు
(3) సర్వోఛ కేంద్రశాసన సమావేశము (ASSEMBLY) రెండుగా (BICAMERAL) ; ఇంపీరియల్ శాసన సభ (కేంద్ర శాసన సభ) మరియూ స్టేట్ కౌన్సిల్ అను రెండు సమావేశములుగా విభజింప బడియున్నవి ఇప్పటి లోక సభ, రాజ్యసభ లాగ
(4) ఇంపీరియల్ శాసన సభలో 140 సభ్యులుందురు వారిలో 100 మందిని ఎన్నికలద్వారాను, 25 మంది అధికారులు మిగతావారలు నిర్ణిత (నామినేటెడ్) సభ్యులు.
(5) స్టేట్ కౌన్సిల్లో 60 మంది సభ్యులుందురు. ఆ 60 లో 33మంది సభ్యులు ఎన్నికపైన 47 మంది నిర్ణయించబడిన సభ్యులుగనూ నుండిరి
(6) శాసనసభలామోదించిన తీర్మానములు త్రోసిపుచ్చుటకు, శాసనసభలను సమావేశపరచుటకు, వాయిదావేయుటకు, ఆపుటకు, రద్దుచేయటకు గవర్నర్ జనరల్ కు విశిష్ట అధికారములు ఉన్నాయి. వారిదే చివరిమాట.
(7) దేశానికి తగిన శాసనములను నిర్మాణము చేయు హక్కు కేంద్ర శాసనసభకు కలదు
(8) దేశ పరిపాలనలో ద్వందపరిపాలన (DIARCHY or DYARCHY) పద్ధతి నిర్మించబడుట. పరిపాలనా విభాగములు; ఆర్థిక, సైనిక, న్యాయపరిపాలన విభాగములను గవర్నర్ జనరల్ పరిపాలక వర్గముకులోబడి పనిచేయును. మిగత విభాగములు; ఆరోగ్య, విద్య, వ్యవసాయ, గ్రామపరిపాలన విభాగములు మాత్రమే ప్రజాప్రతినిధులైన మంత్రులక్రింద పనిచేయును.

ప్రజాప్రభుత్వ విధానాలన్నీ వైస్రాయి నిరవధిక నిరంకుశాదికారం క్రిందే, 1919 వ సంవత్సరపు రాజ్యంగ చట్ట సమీక్ష

[మార్చు]

1919 సంవత్సరపు రాజ్యాంగ చట్టము ద్వారా ప్రవేశపెట్టిన ప్రజాప్రభుత్వ విధానములన్నీ కళ్ళనీళ్ళ తుడుపులేనన్న విషయము ఆ చట్టము ద్వారా కలుగజేసిన శాసనసభలకు మొదటితడవ ఎన్నికలలో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ మొదలగు రాజకీయ మేదావులు నిలబడి శాసనసభలలో పాల్గొని ప్రజాభిప్రాయములు అమలుజరుప ప్రయత్నించిన తరువాతనే తెలియవచ్చినది ఆ ప్రజాప్రభుత్వ వ్యవస్థలు, పధ్దతులన్నీ బూటకమని. శాసనసభకు అతీతమై ప్రభుత్వ యంత్రాంగము పరిపాలనను నిరంకుశముగా నిర్వహించుచుండెను. శాసనసభలనబడినవాటిలో ప్రజలు ఎన్నుకున్న సభ్యుల కన్నా నియామకసభ్యుల పలుకుబడికలిగియుండుటవలన వారి దే పై చేయిగానుండెను. 140 మంది సభ్యులు గల శాసనసభలో 40 మందే నియామకసభ్యులైనప్పటికీ శాసనసభతీర్మానములను పరిపాలకవర్గమున కనుకూలముగా మళ్లించుటకు ప్రోద్బలముచేయట జరుగచుండెను. పరిపాలకవర్గ అంగీకార తిరస్కారములకను గుణముగా శాసనసభ తీర్మానములుండునటుల నియామక సభ్యులు రాజకీయం చేయగలుగుచుండెను. 1919 సంవత్సరపు రాజ్యాంగ చట్టములో మాంటెగూ సూచించిన కొన్ని ప్రజాహితములుగా కనపడు సంస్కరణలతో పాటుగా వైస్ రాయికు నిరంకుశాదికారములియ్యబడియుండెను. 1923 సంవత్సరములో ఉప్పుపన్నును తొలగించమని శాసనసభ తీర్మానించగా వైస్రాయి తీర్మానమును ధిక్కరించి ఉప్పుపన్ను స్ధిర పరచి విధించాడు. అందుచేతనే గాంధీజీ నాయకత్వములోఉప్పుసత్యాగ్రహము చేపట్టెను. ఈ చట్టముద్వారా ప్రవేశపెట్టబడిన ద్వందపరిపాలనా యంత్రాంగము (BICAMERAL) వలన అనేక అనర్ధకములు కలిగి ప్రజలకు నిష్ప్రయోజకమైయున్నవి. ప్రజాప్రతినిధులైన మంత్రులవశమైన పరిపాలనా విభాగములకు ధనసంచయము గవర్నర్ పరిపాలకవర్గముక్రిందయుంచబడినది, మంత్రుల క్రింద పనిచేయవలసిన ఐ.సి.యస్ ఉద్యోగులు కార్యదర్శులు గానుండుట, వారు గవర్నర్ చే నియమింపబడి గవర్నర్ పరిపాలక వర్గ వశమైయుండుట, మంత్రులశక్తులై నిరధికార మూర్తులగ చేయబడిరి. కేంద్రశాసనసభ వారికిని పరిపాలకవర్గమునకును రాజ్యాంగవివాదములు ఉద్బవించుచుండెను. శాసనసభాధ్యక్షుడైన గవర్నర్ జనరల్ పక్షపాతబుద్ధితో పరిపాలకవర్గమువారి కనుకూలమగు నిరంకుశ నిర్ణయములుచేయుచుండెను. ప్రజలహక్కులనణచివేయబడినవి. నిజమైన స్వరాజ్యమీయకుండా బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమును బానిసదేశముగనే పరిపాలించి లబ్ధిపొందుటకై ఆ మాంటెగూ స్సస్కరణల రాజ్యాంగ చట్టమును నిర్మించిరి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The British Rule in India" D. V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల , బెజవాడ pp 379, 380-404
  2. "The Making of a Nation" B.R. Nanda (2004) HarperCollins pp109
  3. Macropedia Britannica vol 9 (1984)The Indian Subcontinent pp 417-419