Jump to content

మోటూరు హనుమంతరావు

వికీపీడియా నుండి
(మోటూరి హనుమంతరావు నుండి దారిమార్పు చెందింది)

మోటూరు హనుమంతరావు (1917 - 2001) ఆంధ్ర దేశములో పేరు గాంచిన కమ్యూనిస్టు నాయకుడు, రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ, శాసన మండలిలోనూ సభ్యునిగా పనిచేసారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి తెలుగు దినపత్రికలకు సంపాదుకుడిగా పనిచేసారు. రచయిత

మోటూరు హనుమంతరావు
దస్త్రం:Moturi Hanumantharao.jpg
కామ్రేడ్ మోటూరి హనుమంతరావు
జననం1917
గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామము
మరణం2001 జూన్ 18
ప్రసిద్ధిప్రజాశక్తి సంపాదకుడు
పదవి పేరురాజ్య సభ సభ్యులు
పదవీ కాలం1988 - 1994
రాజకీయ పార్టీసి,పి,ఐ,(యం)
భార్య / భర్తశ్రీమతి మోటూరి ఉదయం
పిల్లలుముగ్గురు కుమార్తెలు
తల్లిదండ్రులులక్ష్మీ నారాయణ

జననం

[మార్చు]

మోటూరు హనుమంతరావు గారు గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామములో ఒక పేద రైతు కుటుంబములో లక్ష్మీ నారాయణ దంపతులకు 1917లో జన్మించాడు. 1938 లో వీరికి ఉదయం గారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు[1].

రాజకీయ జీవితం

[మార్చు]

1948లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనభకు పోటీచేసి, అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళి పై విజయం సాధించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శాసనసభలో ఉపనాయకుడిగా వ్యవహరించారు. 1955లో జరిగిన ఏన్నికలో పరాజయం చెందారు. 1978 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఏన్నికై 1984 వరకు పనిచేసారు. 1988 లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ్యునిగా ఏన్నికై 1994 వరకు పనిచేసారు.[1]

సంపాదకుడు

[మార్చు]

మోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసారు. ఆయన విశాలాంధ్ర దిన పత్రికకు 10 ఏళ్ళు ఎడిటర్ గా పనిచేసారు. అలాగే ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గానూ 15 ఎళ్ళుగా పనిచేసారు. మోటూరు కలం రాజకీయ వర్గ చైతన్యభరితమైన భావజాలానికి పదసంపద సమకూర్చింది.

రచనలు

[మార్చు]
  • నక్సలిజం - పుట్టుక, పరిణామం, పతనం
  • అమెరెకన్ సామరాజ్యవాది వైదొలుగు
  • రోజెన్ బర్గ్ లు
  • నా గమ్యం

మరణం

[మార్చు]

మార్క్సిజం లెనినిజం తీర్చిదిద్దిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కష్టజీవుల రాజ్యాన్ని సాధించడానికి సోషలిజం తీసుకురావడానికి ఆజన్మాంతం కృషిచేశారు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు. ఒక చేత్తో పార్టీని ప్రజా ఉద్యమాలను మరో చేత్తో పత్రికా వ్యాసంగాన్ని అద్భుతంగా నడిపిన నవ్యసాచి అయన. బహిరంగ సభల్లో అయన గళం రాజకీయ అవకాశవాదాన్ని దుసుమాడేది. పత్రికా రంగంలో అయన కలం ప్రజావ్యతిరేకులను చీల్చి చెండాడేది. ఆయనతో మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్. అయన ఆప్యాయత వారికీ ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకం. 'నా గమ్యం' పేరుతో వారు రాసిన ఈ పుస్తకం అయన విప్లవ పోరాట అనుభవాల సారం. కామ్రేడ్ హనుమంతరావు 2001 జూన్ 18న మరణించారు[1].

వెల్లటూరులో పదవ వర్ధంతి నాడు (18.6.2011) కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారి కాంస్య విగ్రహాన్ని సీతారాం ఏచూరి ఆవిష్కరించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Rajyasabha Members Biological Sketches 1952-2003" (PDF). Retrieved 31 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

యితర లింకులు

[మార్చు]