సీతారాం ఏచూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారాం ఏచూరి
సీతారాం ఏచూరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
April 19, 2015
ముందు ప్రకాష్ కారత్

రాజ్యసభ సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-12) 1952 ఆగస్టు 12 (వయస్సు 68)
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) South Asian Communist Banner.svg

సీతారాం ఏచూరి (జ. 1952, ఆగస్టు 12) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రధాన కార్యదర్శి.[1] ప్రముఖ భారతదేశ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ యోధుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో (మార్క్సిస్ట్) పార్లమెంటరీ వర్గపు నాయకుడు. విశాఖపట్నంలో జరిగిన సీపీఎం మహాసభల్లో అతను పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సీనియర్‌ కామ్రేడ్ ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై పోటీ నుంచి వైదొలగటంతో సీతారాం ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్ ప్రకటించారు. అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్‌ కారత్‌ వరుసగా మూడుసార్లు‍(2010-2015) పనిచేశారు.

విద్యాభ్యాసం[మార్చు]

అతని విద్యాభ్యాసమంతా ఢిల్లీ లోనే సాగింది. దిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించాడు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు.

రాజకీయ జీవితం[మార్చు]

1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.

అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందిస్తారు. పశ్చియాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమంటారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికే, పెత్తనం కోసం అర్రులు చాస్తోందని విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు. ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కుకుండా సైన్యం జోక్యం చేసుకుంటోదన్నది ఏచూరి ఆరోపణ.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సీతారాం ఏచూరీ, 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు. ఈయన తల్లి కల్పకం, మోహన్ కందా సోదరి, ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ శిష్యురాలు. సీతారాం విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీతారాం ఏచూరి, సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి దిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు.ప్రస్తుతం సీమా చిస్తీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రెసిడెంట్‌ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం, కుమార్తె ఎడిన్‌బరోలో ఫ్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు ఇంకా చదువుతున్నారు. సీతారాం ఏచూరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌లో కాలమ్స్‌ రాస్తుంటారు.

మూలాలు[మార్చు]

  1. "పాకెట్‌ మనీ ఇవ్వలేదు". eenadu.net. ఈనాడు. 15 April 2018. Archived from the original on 15 April 2018. Retrieved 15 April 2018.