వీణా మజుందార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vina Mazumdar
దస్త్రం:Vina Mazumdar.jpg
Mazumdar while a student of Asutosh College
జననం(1927-03-28)1927 మార్చి 28
Calcutta, Bengal Presidency, British India
మరణం2013 మే 30(2013-05-30) (వయసు 86)
జాతీయతIndian
విద్యD. Phil.
విద్యాసంస్థOxford University
వృత్తిwomen studies academic and researcher
Centre for Women's Development Studies, ఢిల్లీ
వీణా మజుందార్ 2010 లో

డాక్టర్ వీణా మజుందార్ (28 మార్చి 1927 - 30 మే 2013) ఒక భారతీయ విద్యావేత్త, వామపక్ష కార్యకర్త మరియు స్త్రీవాది. భారతదేశంలో మహిళల అధ్యయనాలలోమార్గదర్శకురాలు, ఆమె భారతీయ మహిళా ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి.మహిళా అధ్యయనాలలో పాండిత్య పరిశోధనతో క్రియాశీలతను మిళితం చేసిన మొదటి మహిళా విద్యావేత్తలలో ఆమె ఒకరు.ఆమె భారతదేశంలో మహిళల స్థితిగతులపై మొదటి కమిటీకి కార్యదర్శిగా పనిచే సింది ,ఈ కమిటి దేశంలోని మహిళల స్థితిగతులపై మొదటి నివేదికను స్త్రీ సమానత్వం వైపు (1974). తీసుకువచ్చింది, [1][2] ఆమె “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్”(ICSSR) పేరుతో 1980లో స్థాపించబడిన “సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్”CWDS)కి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు . ఢిల్లీలోని ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ సెంటర్‌లో నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. [3]

ప్రారంభ జీవితం మరియు విద్యాభ్యాసం[మార్చు]

వీణా మజుందార్ బెంగాల్ రాష్ట్రం లోనికోల్‌కాతా నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.కుటుంబంలో ముగ్గురు పిల్లలు,ఇద్దరు అమ్మాయిలు కాగా,వీణా మజుందార్ అందరి కన్న చిన్నది. ఆమె తండ్రి ప్రకాష్ మజుందార్ ఇంజనీర్. ఆమె బాబాయి ప్రముఖ చరిత్రకారుడు రమేష్ చంద్ర మజుందార్ (1888–1980).[4]ఆమె మొదటి విద్యాభ్యాసం కొల్ కాతా లోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో మొదలైంది .ఆమె కాలేజీ ఉన్నత విద్యాభ్యాసం మొదట మహీళ కళాశాల ( బనారస్ యునివర్సిటికి చెందినది). తరువాత అసుతోష్ కాలేజ్, (కలకత్తా విశ్వవిద్యాలయం)లో చదివారు. ఆమె అశుతోష్ కాలేజ్ గర్ల్స్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ అయ్యారు.కళాశాలలో ఉన్నప్పుడు, ఆమె స్త్రీలకు కీలకమైన ఆధునిక హిందూ చట్టంసంస్కరణల ద్వారా కుమార్తెలకు వారసత్వ హక్కులను విస్తరించాలని సిఫార్సు చేసిన రామారావు కమిటీకి మద్దతుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.[4]1947లో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఆమె సెయింట్ హ్యూస్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్] వెళ్ళింది, అక్కడ ఆమె 1951లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె 1960లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కి మళ్ళి తిరిగి వచ్చి, 1962లో. డాక్టరేట్ ఇన్ ఫిలాస్పీ (D.Phil) అందుకుంది.

వృత్తి -జీవన ప్రగతి[మార్చు]

ఆమె 1951లో పాట్నా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించింది, చేరిన కొద్ది కాలంలోనే పాట్నా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్‌కి మొదటి సెక్రటరీ అయ్యింది.[4]తరువాత ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో చదువుతున్నపుడు ఆమె స్నేహితుడైన ప్రొఫెసర్ బిధు భూషణ్ దాస్, ఒడిశాలోని పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టర్‌గా వుండి,అతని సిఫారసు మేరకు బెర్హంపూర్ విశ్వవిద్యాలయం ఆద్యాపకురాలిగా చేరింది.తదనంతరం, ఆమె యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా)| సెక్రటేరియట్, న్యూ ఢిల్లీలో ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా చేరారు మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, సిమ్లా వారి పరిశోధన ప్రాజెక్ట్, 'భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్య మరియు సామాజిక మార్పు'(ఏప్రిల్ 1970-డిసెంబర్ 1970) కి ఫెలో షిప్ కు ఎన్నిక అయ్యింది. [1][5]ఆ మె భారతదేశంలో మహిళల స్థితిపై కమిటీకి సభ్య కార్యదర్శి (1971–74) గా పనిచేసింది 1971లో భారత ప్రభుత్వంచే నియమించబడిన కమిటీ ఆమె వచ్చిన,తరవాత 1973 లోఆమె నాయకత్వంలో పునర్నిర్మించబడినది.[6]ఈ కమిటీ తయారు చేసిన కమిటీ నివేదిక, సమానత్వం వైపు, వ్యవసాయాధారిత సమాజం నుండి పారిశ్రామిక సమాజానికి పరివర్తనలో స్త్రీలలో పేదరికం పెరుగుదలను, అలాగే భారతదేశంలో లింగ నిష్పత్తి క్షీణతను ఎత్తి చూపింది. చివరికి, ఈ నివేదిక మహిళల అధ్యయనాలకు మరియు భారతదేశంలోని మహిళల ఉద్యమానికి ఒక మలుపుగా మారింది. [7][8]తరువాత వీణా మజుందార్ 1975 నుండి 80 వరకు ఉమెన్స్ స్టడీస్ ప్రోగ్రామ్, (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్)డైరెక్టర్ అయ్యారు. [1][9]హిందూ న్యాయ సంస్కరణపై (కూతుళ్ల వారసత్వ హక్కులను విస్తరించేందుకు) రామారావు కమిటీ సిఫార్సులకు మద్దతుగా ఒక సమావేశాన్ని నిర్వహించడంలో మజుందార్ తన సంపూర్ణ సహాయ సహాకారం అందించినది. [10]

1980లో, ఆమె న్యూఢిల్లీలో “సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్” (CWDS), సహ-స్థాపన చేసింది మరియు 1980 నుండి 1991లో ఆమె పదవీ విరమణ చేసే వరకు దాని వ్యవస్థాపక-డైరెక్టర్‌గా కొనసాగింది.ఆమె CWDS ద్వారా పశ్చిమ బెంగాల్. లోని బంకురా జిల్లా కు చెందిన భూమిలేని రైతు మహిళలనుద్వారా చర్య -పరిశోధన ఉద్యమాన్ని నిర్వహించినది.[4] ఇది త్వరలోనే ప్రభావవంతమైన సంస్థగా మారింది, ఇది భారతదేశంలో మహిళల అధ్యయనాల కోర్సును ప్రభావితం చేసింది. [7] ఆమె1982లో స్థాపించబడిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్ (IAWS,) వ్యవస్థాపక-సభ్యురాలు కూడా.

ఆ తర్వాత ఆమె రెండు సంవత్సరాలు CWDSలో సీనియర్ ఫెలోషిప్ గా మరియు JP నాయక్ నేషనల్ ఫెలోషిప్ (ICSSR). పనిచేశారు 1996 నుండి 2005 వరకు ఆమె న్యూఢిల్లీలోని ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ సెంటర్ చైర్‌పర్సన్‌గా పనిచేసినది.ఆమె తన జీవిత స్మృతులను 2010 లో మెమొరీస్ ఆఫ్ ఎ రోలింగ్ స్టోన్' అనే పేరుతో పుస్తకాన్నిరచించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె తాను పాట్నాలో పని చేస్తున్నప్పుడు పరిచయమైన సంగీత విద్వాంసుడు శంకర్ మజుందార్‌ను 1952లో వివాహం చేసుకున్నది.[4]ఆమె వివాహం తర్వాత, ఆమె ఇంటిపేరు స్పెల్లింగ్‌ను Majumdar (ఆమె మొదటి పేరు) నుండి mazumdar (ఆమె వైవాహిక పేరు)గా మార్చుకున్నది.ఈ దంపతులకు నలుగురు పిల్లలు - ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. ఆమె కుమార్తెలలో ఒకరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కి చెందిన సీతారాం ఏచూరి మొదటి భార్య.డా. మజుందార్ 86 సంవత్సరాల వయస్సులో కొంతకాలం అనారోగ్యంతో బాధ పడి, మే 30, 2013న ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించినది. [4]

ఇవికూడాచూడండి[మార్చు]

1.ప్రియా జింగన్

2.సంపత్ పాల్ దేవి

3.షర్మిలా రేగే

4.శశి దేశ్‌పాండే

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Interview with Vina Mazumdar, Global Feminisms Project University of Michigan Library#Deep Blue|Deep Blue, Michigan University
  2. "First Anniversary Special Fifty Faces, A Million Reasons: Vina Mazumdar : Gender Activist". Outlook (Indian magazine). 23 అక్టోబరు 1996. Archived from the original on 9 జూన్ 2011.
  3. Our people Archived 2009-10-03 at the Wayback Machine Centre for Women's Development Studies, website.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Remembering Vina Mazumdar". The Hindu. 30 May 2013. Retrieved 2 June 2013.
  5. Fellows of the Institute Archived 13 జనవరి 2010 at the Wayback Machine Indian Institute of Advanced Studieswebsite.
  6. Agrawal, p. 62
  7. 7.0 7.1 Nagarajan, Rema (8 March 2010). "Educated middle class women are selfish". The Times of India. Archived from the original on 11 August 2011.
  8. "Vina Mazumdar, freedom's child". Indian Express. 1 June 2013. Retrieved 2 June 2013.
  9. Emerging State Feminism in India: A Conversation with Vina Mazumdar, International Feminist Journal of Politics, Volume 9, Issue 1 March 2007, pp. 104 – 111.
  10. "Remembering Vina Mazumdar". The Hindu. 7 December 2013. Retrieved 7 December 2013.