Jump to content

యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్

వికీపీడియా నుండి
అంబులెటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ - నమూనా రేఖాచిత్రం

యాంబులరేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ (ఏజీపీ) అనేది రోగి రోజువారీ గ్లూకోజ్. ఇన్సులిన్ నమూనాలను వివరించే ప్రామాణిక నివేదిక. ఇది రోజువారీ గ్లూకోజ్ పరిమాణాలలోను, రేఖా చిత్రాలలో అందిస్తుంది. ఈ ప్రమాణ పద్ధతిని 1987లో మొదటిసారిగా డాక్టర్ రోజర్ మాజ్జే ఇంకా డేవిడ్ రోడ్బార్డ్ లు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైద్య కళాశాల (కాలేజ్ ఆఫ్ మెడిసిన్) సహచరులతో కలిసి అభివృద్ధి చేశారు, దీనిని స్వీయ-పర్యవేక్షణ రక్తంలో గ్లూకోజ్ (సెల్ఫ్ మానిటర్డ్ బ్లడ్ గ్లూకోజ్ - SMBG) పరిమాణం కోసం ఉపయోగించారు.[1] మొదటి సంస్కరణలో గ్లూకోజ్ మధ్యస్థ, ఇంటర్-క్వార్టైల్ శ్రేణులు 24 గంటల రోజుగా రూపొందించారు . డాక్టర్ మాజ్ 1980ల చివరలో ఏజీపీ ని అంతర్జాతీయ మధుమేహ కేంద్రం (ఇంటర్నేషనల్ డయాబెటిస్ సెంటర్ IDC) కు తీసుకువచ్చారు. అప్పటి నుండి ఈ సంస్థ గ్లూకోజ్ నమూనా నివేదించడము లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రమాణంగా ఏజీపీని రూపొందించింది.[2] దీని రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్. CaptwrAGP. ఇప్పుడు దీనికి అనేక అదనపు విభాగాలు ఉన్నాయి.

నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ వ్యవస్థ

[మార్చు]

దీనిని సి.జి.ఎం.ఎస్. (Continuous Glucose Monitoring System) అంటారు . సాధారణ స్థాయిలో వ్యక్తికి రక్తంలో గ్లూకోజ్ మోతాదు (70-180 మి.గ్రా.) ఉంచడానికి జరిగే స్వయంగా పరీక్షలు చేసుకునే ప్రయత్నాలలో సి.జి.ఎం.ఎస్ ముఖ్యమైనది. ఎ.జి. పి. నివేదికలకు ఆధారము.[3] 1988లో సాంకేతిక ప్రయోగశాల మిన్నెసోటాలోని పార్క్ నికోలెట్ (ఐడిసి) లోని అంతర్జాతీయ మధుమేహ కేంద్రానికి మారింది. అన్ని వైద్య పరిశోధన ప్రాజెక్టులలో ఎజిపి విశ్లేషణతో కూడిన కొలమానాలు (మీటర్లు) అసాధారణతలను వర్గీకరించడానికి విస్తృతంగా ఉపయోగించారు.[4][5][6]

ఈ ప్రయోగశాలపేరు మార్చారు, అది - హు (WHO) కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్, ట్రాన్స్లేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీస్ (ఇది IDC ఇంకా మేయో క్లినిక్ ల ఉమ్మడి కార్యక్రమం).

2004లో నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ (సి.జి.ఎం.ఎస్.) వ్యవస్థ ఏర్పాటు మొదలు పెట్టారు. మూడు రోజుల పాటు చర్మం కింద ఉంచిన ఒక చిన్న సెన్సార్ గ్లూకోజ్ ను నిరంతరం కొలుస్తుంటుంది, ఫలితాలను కూడా అందుకొని ప్రసారం చేస్తుంది, 2013 నాటికి ఇది 14 రోజుల ఫలితాలు చూపిస్తుంది. సుమారు 1344 నివేదికలు 5 శ్రేణులలో రీడింగులను వాటి శాతముతో ఇస్తుంది. అవి - 54 మి. గ్రా. కంటే తక్కువ; 54 నుండి 70 మి. గ్రా; 70 నుండి 180 లోపు; 180 నుండి 250 మి. గ్రా. వరకు; 250 మి. గ్రా. కంటే ఎక్కువ. [3] ఇది ఆరోగ్య సంరక్షకులకు నివేదికలను అందే విధంగా కంప్యూటర్ కి అనుసంధానించుతారు. సి.జి.ఎం.ఎస్. రాత్రిపూట రోగి గ్లూకోజ్ విలువలు, పోస్ట్ ప్రాండియల్ విలువలు, ఇంకా గ్లూకోజ్ స్థాయిలు తరువాత విశ్లేషణ కోసం వైద్యుడికి తక్షణమే అందుబాటులో ఉంటాయి. చాలా వ్యవస్థలలో రోగి రోజుకు 2-4 సార్లు (SMBG ద్వారా) సెన్సార్ను క్రమాంకనం చేయడం వైద్యుడు ఈ సమాచారాన్ని ప్రామాణికం కాని నివేదికలలోకి పొందుపరచడం జరిగేది. అయితే సి.జి.ఎం.ఎస్. తో రోజువారీ నమూనాలను విశ్లేషించడానికి ఉపయోగించడం సాధ్యమైంది.[7]

ఈ ఏజిపి నివేదిక 3 వ్యవధులలో ఉంటుంది. ఒక రోజులో రక్తం లో గ్లూకోజ్ సాధారణ స్థాయిలో అంటే 70 నుండి 180 మి. గ్రా. మధ్య ఎంత సేపు ఉందో సూచిస్తుంది. దీనిని టీ.ఐ.ఆర్. (టైం ఇన్ రేంజ్) అంటారు. దీని కంటే (అంటే 180 ఎక్కువగా) ఉండే సమయాన్ని టీ. ఏ.ఆర్. (టైం అబౌవ్ రేంజ్) అంటారు. అయితే ఉండవలసిన దానికన్నా తక్కువగా (54 కంటే తక్కువ లేదా 54 నుంచి 70 వరకు) ఉంటే ప్రమాదకరంగా పరిగణిస్తారు. దీనిని టీ.బి.ఆర్. (టైం బిలో రేంజ్) అంటారు.[3]

  • ఈ విధానం అనుసరించి సాధారణంగా రోజులో 16 గంటల 48 నిముషాలు (70%) పాటు 17 గంటలయినా రక్తంలో గ్లూకోజ్ 70-180 మి.గ్ర. ఉండాలి అని చూస్తారు.
  • మధుమేహం నియంత్రణం లేనివారిలో ఒక రోజులో సగటున గంట 12 నిముషాలు (5%) రక్తంలో గ్లూకోజ్ 250 మి .గ్ర. ఎక్కువ ఉండవచ్చు. ఇంజెక్షన్లు, మందులు వాడే వారిలో కొంతసేపు చాల తక్కువ గ్లూకోజు స్థాయిలు ఉంటాయి . రోజులో ఒక గంట సేపు 54-70 మి.గ్ర. మధ్య, ఇంకా తక్కువ కూడా ఉండవచ్చు. కొంత మందిలో 5 గంటల పాటు ఎక్కువగా ఆంటీ దాదాపుగా 250 మి. గ్రా.కూడా ఉంటుంది. ఇది ఆప్రమత్తతకు సంకేతం.
  • ఈ హెచ్చు తగ్గులు మధుమేహ రోగులకు కాకుండా మామూలు వ్యక్తులకు వర్తిస్తాయి. వైద్యుల సలహాతో మందు మోతాదు సమయాలు మార్చుతూ టీ.ఐ.ఆర్. నిర్వహించుకోవాలి
  • పెద్ద వయసువారిలో రోజులో సగం అంటే 12 గం 180-250 మి. గ్రా. వరకు ఉండవచ్చు 250 మి. గ్రా. దాటి మాత్రమూ 24 ని . కంటే ఎక్కువ ఉండకూడదు .
  • గర్భిణీ స్త్రీలలో ఈ కొలమానాలు వేరుగా ఉన్నాయి, అవి 63-140 వరకు మి. గ్రా.మధ్య. కనీసం 17 గం ఉండేటట్లు చూస్తారు. [3]

2006 నుండి, ఏ.జి.పి. విశ్లేషణకొరకు సి.జి.ఎం.ఎస్. ఆధారిత అధ్యయనాలకు వర్తించడం మొదలయింది, ఇది సాధారణ గ్లూకోజ్ జీవక్రియ (ముఖ్యంగా మధుమేహం లేనివారికి కూడా ) రోజువారీ నమూనాలను చూపిస్తుంది.[8][9][10][11] ఈ పనికి గుర్తింపుగా, ఏ.జి.పి. విశ్లేషణకొరకు ప్రామాణిక నివేదిక అందించే వ్యవస్థగా హెల్మ్ స్లీ ట్రస్ట్ గ్రాంట్ను ఇచ్చింది, నిపుణుల ప్రత్యేక సింపోజియంలో సమగ్ర సమీక్ష జరిగిన తర్వాత ట్రస్ట్ అంగీకరించింది.[12] క్రమంగా ఇతర సమూహాలు కూడా ఇదే విధమైన నిర్ణయానికి వచ్చాయి. [13][2][14][15]

ఫ్లాష్ గ్లూకోజ్ పర్యవేక్షణ (ఎఫ్. జి. ఎం.)

[మార్చు]
గుర్తించదగిన పెరుగుదల లేదా తగ్గింపులతో మధ్యస్థం అస్థిరమైన గ్లైసెమిక్ ధోరణిని సూచిస్తుంది.
ఏ.డి.సి . రేఖాచిత్రం - గుర్తించదగిన పెరుగుదల లేదా తగ్గింపులతో మధ్యస్థంగా అస్థిరమైన గ్లైసెమిక్ ధోరణిని సూచిస్తుంది.

గ్లూకోజ్ పర్యవేక్షణ వ్యవస్థలో 2013లో ఆబోట్ డయాబెటిస్ కేర్ (ADC)సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్రీస్టైల్ లిబ్రే ఫ్లాష్ ను ఏ.జి.పి. నివేదికకు ఉపయోగించడం కొరకు అనుమతి (లైసెన్స్) ఇచ్చింది.[16] అధునాతన వైర్డ్ ఎంజైమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ సంస్థ రోగిచే క్రమాంకనం అవసరం లేని రెండు వారాల సెన్సార్ను అభివృద్ధి చేసి, దీనిని ఆటోమేటెడ్ ఏ.జి.పి.నివేదిక వ్యవస్థకు కలిపింది. లిబ్రే రీడర్ను అప్లోడ్ చేసిన సెకన్లలో ఈ నివేదికలు ఉత్పత్తి అయి సమాచార విశ్లేషణ, రోగనిర్ధారణ, మూల్యాంకనం చేయడం వంటి వేగవంతమైన వైద్య నిర్ణయాలకు ఆధారాన్ని అందించుతున్నాయి. రెండు వారాల గ్లూకోజ్ డేటాను ఉపయోగించి అంతర్లీన నమూనాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్లూకోజ్ పరిమాణం, వైవిధ్యం, స్థిరత్వాన్ని సూచించే విధంగా ఐదు సున్నితమైన పౌన: పున్య (ఫ్రీక్వెన్సీ కర్వ్) వక్రరేఖలను ఉపయోగిస్తుంది, అదే సమయంలో గణనీయమైన హైపోగ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా సమయాలను గుర్తిస్తుంది.[12]

సార్వత్రిక సాఫ్ట్వేర్ నివేదిక

[మార్చు]

ఫిబ్రవరి 2017 లో, మధుమేహ సంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ఆసక్తి ఉన్న శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్న అంతర్జాతీయ సంస్థ అయిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ కాంగ్రెస్, పరిశోధన, క్లినికల్ కేర్ అనేక వైద్య విద్యా, పరిశోధన కేంద్రాలు, రోగి సంరక్షణ నుండి నిపుణులతో జరిపిన సమావేశం ఫలితాలు 2017 డిసెంబరులో ప్రచురించబడ్డాయి.[2] ఈ బృందం, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ డేటాకు సంబంధించిన వివిధ నివేదికలను సమీక్షించిన తరువాత, ఏ.జి.పి. విధానం... ఒక ప్రమాణంగా ఏకాభిప్రాయం సిఫార్సు చేసారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇంకా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ల ఉమ్మడి ప్రకటనలో"యాంబులరేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ (AGP) ను సార్వత్రిక సాఫ్ట్వేర్ నివేదికగా సిఫార్సు చేశారు, దీనిని పరికరాలు, తయారీదారులు కొలమానాలను ప్రామాణీకరించడానికి అవలంబించవచ్చు". వారు AGP కొలమానాలు, ప్రస్తుతం వరుసగా గ్లూకోజ్ పరిమాణం, వైవిధ్యంను సూచించడానికి ఉపయోగించుతున్నారు. [14]

జూన్ 2017లో, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సైంటిఫిక్ మీటింగ్స్ లో అన్ని ప్రధాన డయాబెటీస్ ప్రొఫెషనల్ ఇంకా రోగుల సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిపుణుల బృందం మధుమేహానికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం కోసం వారి ఆలోచనలను, సిఫార్సులను సమర్పించింది. ఏదైనా నివేదికలో గ్లూకోజ్ నమూనాలను పూర్తిగా వ్యక్తీకరించడానికి 14 కీలక మూలకాలను ఉపయోగించాలని ప్రమాణం సూచించింది.[17]

నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ కోసం ఏ.జి.పి. అంతర్జాతీయ ప్రామాణిక నివేదికగా గుర్తించబడింది. [15] ఇది IDC అనుమతుల(లైసెన్సింగ్) ద్వారా అంటే: అబోట్ డయాబెటిస్ కేర్, డెక్స్కామ్, గ్లూకో + డయాసెండ్, రోచ్ అందుబాటులో ఉంది.[18] ప్రస్తుత ఏ.జి.పి. నివేదికల ఆధారంగా రక్తంలో గ్లూకోజ్ ఇప్పుడు స్వీయ పర్యవేక్షణ , నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ పరికరాలు అలాగే ఇన్సులిన్ పంపుల కోసం రూపొందించబడుతున్నాయి . IDCలో ఇంకా ఏ.జి.పి నివేదిక అభివృద్ధి పక్రియ కొనసాగుతోంది.[18]

ఇది కూడా చూడండి

[మార్చు]
  1. గ్లూకోజ్ పరీక్ష
  2. మధుమేహం

సూచనలు

[మార్చు]
  1. (1987-01-01). "Ambulatory Glucose Profile: Representation of Verified Self-Monitored Blood Glucose Data". American Diabetes Association.
  2. 2.0 2.1 2.2 (2017-11-10). "International Consensus on Use of Continuous Glucose Monitoring". American Diabetes Association.
  3. 3.0 3.1 3.2 3.3 డా. పి.వి.రావు.మధుమేహంలో గ్లూకోజు ప్రొఫైల్. ఈనాడు.2024=09=10
  4. Mazze R. Langer O. Innovative Technologies in Research and Care in Diabetes and Pregnancy. Israel J of Medical Science, 1993.
  5. . "The relationship between large-for-gestational-age infants and glycemic control in women with gestational diabetes". Elsevier BV.
  6. Mazze R, Langer O. Assessing Metabolic Control and Improving Patient Management: The Application of Computer Technology. Diabetes Research and Clinical Practice, October 1990.
  7. Mazze R, Strock E, Wesley D, Borgman S, Morgan B, Bergenstal R, Cuddihy R. Characterizing glucose exposure for individuals with normal glucose tolerance using continuous glucose monitoring and ambulatory glucose profile (AGP) analysis. Diabetes Technology and Therapeutics, 2008; 10(3).
  8. Mazze R, Strock E, Borgman S, Wesley D, Stout P, Racchini J. Evaluating the Accuracy, Reliability, and Clinical Applicability of Continuous Glucose Monitoring (CGM): Is CGM Ready for Real Time? Diabetes Technology & Therapeutics, 2009;11(1).
  9. Mazze R, Strock E, Morgan B, Wesley D, Cuddihy R, Bergenstal R. Diurnal glucose patterns of Exenatide Once Weekly: A 1 year study using continuous glucose monitoring and Ambulatory Glucose Profile analysis. Endocrine Practice 2009;15(4):326-34.
  10. Bolli G, Deeb L, Garg S, Leahy J, Mazze R, Owens D, Riddle M, Southerland P, Strock E. International Forum for the Advancement of Diabetes Research and Care, April 29–30, 2011, Athens, Greece. Diabetes Technology & Therapeutics 2011;13(9):967-979.
  11. Mazze R, Yogev Y, Langer O. Measuring glucose exposure and variability using continuous glucose monitoring in normal and abnormal glucose metabolism in pregnancy. Journal of Maternal-Fetal and Neonatal Medicine 2012, vol./is. 25/7(1171-5).
  12. 12.0 12.1 Bergenstal R, Ahman AJ, Recommendations for standardizing glucose reporting and analysis to optimize clinical decision making in diabetes: the Ambulatory Glucose Profile (AGP). Diabetes Technology and Therapeutics,2013;15(3): 198-211.
  13. Matthaei S, Antuna Dealaiz R, Bosi, E, et al. Consensus recommendations for the use of Ambulatory Glucose Profile in clinical practice. British Journal of Diabetes and Vascular Disease 2014, 14:153-157.
  14. 14.0 14.1 (1 December 2017). "Improving the Clinical Value and Utility of CGM Systems: Issues and Recommendations".
  15. 15.0 15.1 Riddle, M. C., Gerstein, H. C., & Cefalu, W. T. (2017). Maturation of CGM and Glycemic Measurements Beyond HbA1c—A Turning Point in Research and Clinical Decisions. Diabetes Care, 40(12), 1611-1613.
  16. Hoss U, Budiman E, Liu H Christiansen H. Continuous Glucose Monitoring in the Subcutaneous Tissue over a 14-Day Sensor Wear Period Diabetes. Sci Technol. Sep 2013; 7(5): 1210–1219.
  17. Buckingham BA, Close KL, Bergenstal RM, Danne T, Grunberger G, Kowalski AJ, Peters A, Heller SR. Reaching an International Consensus on Standardizing Continuous Glucose Monitoring (CGM) Outcomes―Aligning Clinicians, Researchers, Patients, and Regulators. American Diabetes Association 77th Scientific Meeting, San Diego, CA, June 2017.
  18. 18.0 18.1 "Welcome to AGP Report | AGP Report".