యాత్రా చరిత్ర
యాత్రాచరిత్ర మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833-1897) రచించిన వచన గ్రంథము. దీనిని పూర్వభాగము, ఉత్తరభాగము లనే రెండు పుస్తకములుగా ముద్రించారు. దీని పూర్వభాగాన్ని బొబ్బిలి సంస్థానానికి చెందిన శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల వారు 1915లో ముద్రించారు.
ప్రారంభము
[మార్చు]ఈ యాత్ర 1886 సంవత్సరం జనవరి 24వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి ఆదివారమునాడు లాంచన పుర్వకముగా గొంత పరివారమును ముందుగా బంపి; 25వ తేదీని శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామివారిని సేవించికొని పగలు 10 గంటలకు బయలుదేరి 4 గంటలకు విజయనగరము కంటన్మేంటులో బసచేసారు. ఈ మార్గములోని గ్రామాలు 1. రామభద్రపురము, 2. మరడాము, 3. గజపతినగరము. విజయనగరము పట్టణం సుందరముగా నున్నది, ఇది శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు మహారాజావారి రాజధానియైయున్నది. ఇందు నాలుగు బురుజులుగల సాధారణమైన రాతి కోటయు, సంస్థానపు బియ్యే కాలేజీయు - తంతి యాఫీసును 4, 5 శివకేశవ నివేశంబులును మేలైన పూలతోటయు మంచి కోనేరును, వైద్యశాలలును - సంస్కృత పాఠశాల నొక సత్రంబును గలవు.