యు.టి. ఖాదర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యు.టి. ఖదీర్ ఫరీద్
యు.టి. ఖాదర్


పదవీ కాలం
24 మే 2023 – ప్రస్తుతం
ముందు విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2007 – ప్రస్తుతం
ముందు యు.టి. ఫరీద్
నియోజకవర్గం మంగళూరు

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
20 మే 2013 – 20 జూన్ 2016

ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
20 జూన్ 2016 – 2018
ముందు దినేష్ గుండు రావు

పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
జూన్ 2018 – జులై 2019

డిప్యూటీ లీడర్ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
జనవరి 2022 – 13 మే 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1969-10-12) 1969 అక్టోబరు 12 (వయసు 54)
ఉప్పల, కాసర్గోడ్, కేరళ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్

యు.టి. ఖాదర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మంగళూరు శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై  2023 మే 24న కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

యు.టి. ఖాదర్ తన తండ్రి యుటి ఫరీద్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి ఉల్లాల్ అసెంబ్లీ నియోజకవర్గం(ప్రస్తుతం మంగళూరు) నుంచి 2007లో జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత వరుసగా ఐదుసార్లు మంగళూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2013లో సిద్దరామయ్య ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, ఆ తర్వాత ఆహార, పౌరసరఫరాల మంత్రిగా, 2018లో కాంగ్రెస్, జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఆ తరువాత బిజెపి ప్రభుత్వ సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా పని చేశాడు. యు.టి. ఖాదర్ 2023లో ఎన్నికలో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 మే 24న కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (24 May 2023). "కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 31 May 2023. Retrieved 31 May 2023.
  2. Andhra Jyothy (24 May 2023). "కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఖదెర్". Archived from the original on 31 May 2023. Retrieved 31 May 2023.
  3. The Hindu (24 May 2023). "U.T. Khader unanimously elected Speaker of Karnataka Assembly" (in Indian English). Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.