Jump to content

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి

వికీపీడియా నుండి

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి (జననం 10 జూలై 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంకోలా & సిర్సి శాసనసభ నియోజకవర్గాల నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రాథమిక & మాధ్యమిక విద్య మంత్రిగా, కర్ణాటక శాసనసభ 22వ స్పీకర్‌గా పని చేశాడు.[1]

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరిను బీజేపీ అధిష్టానం 2024లో లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

విశ్వేశ్వర్ హెడ్గే కాగేరి 19641 జూలై 10న సిర్సీలో జన్మించి, ధార్వాడ్ జిల్లాలోని కర్నాటక్ విశ్వవిద్యాలయం నుండి బి కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి రాజకీయాల్లోకి రాకముందు సంఘ్ పరివార్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో క్రియాశీలక సభ్యుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో అంకోలా నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి 2008లో అంకోలా నియోజకవర్గం రద్దు కావడంతో సిర్సి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాలుగవ సరి ఎమ్మెల్యేగా ఎన్నికై 30 మే 2008 నుండి 13 మే 2013 వరకు రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2013, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి 31 జూలై 2019 నుండి 20 మే 2023వరకు కర్ణాటక శాసనసభ 22వ స్పీకర్‌గా పని చేశాడు.[3]

విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి[4], 2024లో లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (31 July 2019). "Vishweshwar Hegde Kageri elected as the Speaker of Karnataka Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  2. Eenadu (26 March 2024). "నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  3. NDTV (31 July 2019). "Six-Term Lawmaker Vishweshwar Hegde Elected Speaker Of Karnataka Assembly". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  4. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  5. The Hindu (24 March 2024). "BJP chooses Kageri over Hegde for Uttara Kannada LS seat" (in Indian English). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.