యెల్ది సుదర్శన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యెల్ది సుదర్శన్‌ ముంబయికి చెందిన సాహితీకారుడు, రచయిత, కవి. అతను సృజనాత్మక సాహిత్య రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని 2017లో అందుకున్నాడు[1] .

జీవిత విశేషాలు[మార్చు]

యెల్ది సుదర్శన్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌. వారి కుటుంబం ఎప్పుడో ముంబాయికి వెళ్లి అక్కడ స్థిరపడింది. [2] అతను వృత్తిరీత్యా ముంబాయిలో ముత్యాలు,రత్నాలు,మాణిక్యాల వ్యాపారి అయినా ప్రవృత్తిరీత్యా తన వృత్తి ధర్మాన్ని ప్రతిబింబిస్తూ యెల్ది రత్నాలు, యెల్దిముత్యాలు, యెల్ది పగడాలు వంటి పేర్లతో అతను ఐదు కవితా సంకలనాలు అందించాడు[3]. అతను ముంబైలో వృత్తిరీత్యా వ్యాపారం చేస్తూనే తెలుగు భాష, సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకొని రచనలు చేస్తున్నారు. తెలుగుభాష పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకుని రచనలు చేస్తున్న ఆచార్య రవికంటి వసునందన్‌ తన పేర సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి యెల్ది సుదర్శన్‌కు 2016 ఆగస్టు 3న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్‌ డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా అందజేసారు.[4]

రచనలు[మార్చు]

  • గూఢచారి వదిన
  • యెల్ది కవిత
  • యెల్ది రత్నాలు[5]
  • యెల్ది మాణిక్యాలు[6]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". మూలం నుండి 15 October 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 15 October 2018. Cite news requires |newspaper= (help)
  2. "యెల్ది సుదర్శన్‌కు సాహితీ పురస్కార ప్రదానం". Cite web requires |website= (help)
  3. "'యెల్ది మాణిక్యాల' వెలుగులు". Cite web requires |website= (help)
  4. "యెల్ది సుదర్శన్‌కు వసునందన్‌ సాహితీ పురస్కారం". Cite web requires |website= (help)
  5. "Yeldi Sudarshan Padmashali books". Cite web requires |website= (help)
  6. "'యెల్ది' పుస్కకావిష్కరణ". Cite web requires |website= (help)